ETV Bharat / offbeat

తమిళనాడు స్పెషల్ "మటన్ సుక్కా ఫ్రై" - ముక్క మెత్తగా, టేస్ట్ అదిరేలా!

మటన్ కర్రీ ఎప్పుడూ ఒకేలా తిని బోర్ కొట్టిందా? - ఓసారి ఇంట్లో ఈ విధంగా ట్రై చేసి చూడండి!

Mutton Sukka Fry
Mutton Sukka Fry (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : January 10, 2026 at 3:40 PM IST

2 Min Read
Choose ETV Bharat

Mutton Chukka Fry in Telugu : చాలా మందికి మటన్ పేరు చెప్పగానే నోరూరుతుంది. వీటితో వివిధ రకాల రెసిపీలు చేస్తుంటారు. అయితే ఎప్పుడు ఒకేలా కాకుండా ఈసారి తమిళనాడు స్పెషల్ మటన్ సుక్కా రెసిపీ చేశారంటే ఇళ్లంతా ఘుమఘుమలాడాల్సిందే. ఈ పద్ధతిలో చేస్తే ముక్క మెత్తగా ఉడకడమే కాకుండా మంచి రుచికరంగా ఉంటుంది. బిగినర్స్​తో పాటు బ్యాచిలర్స్​ కూడా సింపుల్​గా ప్రిపేర్ చేయోచ్చు. ఈ రెసిపీ వేడివేడి అన్నంతో పాటు రోటీ, చపాతీ, పులావ్, బగారా రైస్​లోకి అద్దిరిపోతుంది. మరి ఇప్పుడు మటన్ సుక్కా ఫ్రై ఎలా చేయాలో చూద్దాం.

సంక్రాంతికి రసాలూరే "బూందీ లడ్డూ" - ఇలా చేస్తే స్వీట్ లవర్స్ ఫుల్ ​ఖుష్​!

Mutton Sukka Fry
మటన్ (Getty Images)

కావాల్సిన పదార్థాలు :

  • మటన్ - అర కిలో (500 గ్రాములు)
  • ఆయిల్ - 9 టేబుల్ స్పూన్లు
  • పసుపు - పావు టీ స్పూన్
  • అల్లంవెల్లుల్లి పేస్ట్ - 1 టేబుల్ స్పూన్
  • ఉప్పు - రుచికి సరిపడా
  • ఎండుమిర్చి - 8
  • యాలకులు - 5
  • మిరియాలు - అర టేబుల్ స్పూన్
  • లవంగాలు - 8
  • జీలకర్ర - 1 టీ స్పూన్
  • దాల్చినచెక్క - కొద్దిగా
  • సోంపు - అర టీ స్పూన్
  • బిర్యానీ ఆకు - 1
  • కరివేపాకు - కొద్దిగా
  • కొత్తిమీర - కొంచెం
  • సాంబార్ ఉల్లిపాయలు - సరిపడా
Mutton Sukka Fry
కొత్తిమీర (Getty Images)

తయారీ విధానం :

  • ముందుగా గిన్నెలో అర కిలో మటన్ వేసి శుభ్రంగా కడిగి పక్కనుంచాలి.
  • అదేవిధంగా స్టవ్ ఆన్ చేసి కుక్కర్​లో నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ పోయాలి. నూనె వేడైన తర్వాత 15 సాంబార్ ఉల్లిపాయలు వేసి వేయించాలి.
  • ఆనియన్స్ రంగు మారుతున్నప్పుడు కడిగి పెట్టుకున్న మటన్ వేయాలి. ఇప్పుడు మంటను హై ఫ్లేమ్​లో ఉంచి బాగా వేయించాలి. ఇందులోనే పావు టీ స్పూన్ పసుపు, ఒక టేబుల్ స్పూన్ అల్లంవెల్లుల్లి పేస్ట్, రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసి ఒక నిమిషం పాటు వేగనివ్వాలి. అనంతరం ఒకటిన్నర కప్పుల వేడి నీళ్లు పోసి కలపాలి. ఆ తర్వాత మూతపెట్టి మంటను మీడియం ఫ్లేమ్​లో ఉంచి ఐదు విజిల్స్ వచ్చేవరకు ఉడికించాలి.
Mutton Sukka Fry
మసాలా దినుసులు (Getty Images)
  • అలాగే స్టవ్ ఆన్ చేసి కడాయిలో 8 ఎండుమిర్చి, ఐదు యాలకులు, అర టేబుల్ స్పూన్ మిరియాలు, 8 లవంగాలు, ఒక టీ స్పూన్ జీలకర్ర వేయాలి. అదేవిధంగా కొద్దిగా దాల్చినచెక్క, అర టీ స్పూన్ సోంపు, ఒక బిర్యానీ ఆకు, కొంచెం కరివేపాకు యాడ్ చేసి మంటను లో ఫ్లేమ్​లో ఉంచి వేయించాలి. అనంతరం వీటిని గిన్నెలో వేసి చల్లారనివ్వాలి. ఇవి చల్లారిన తర్వాత మిక్సీజార్​లో వేసి కాస్త బరకగా గ్రైండ్ చేయాలి.
Mutton Sukka Fry
అల్లంవెల్లుల్లి పేస్ట్ (Getty Images)
  • ఇంకోవైపు స్టవ్ ఆన్ చేసి కడాయిలో ఐదు టేబుల్ స్పూన్ల నూనె పోయాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అర కప్పు సాంబార్ ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి.
  • ఆనియన్స్ రంగు మారిన తర్వాత కొద్దిగా కరివేపాకు యాడ్ చేసి ఫ్రై చేయాలి. ఆ తర్వాత ఉడికించిన మటన్​ను నీళ్లతో సహా పోసి మంటను హై ఫ్లేమ్​లో ఉంచి నాలుగు నిమిషాల పాటు ఉడికించాలి.
Mutton Sukka Fry
కారం (Getty Images)
  • అనంతరం గ్రైండ్ చేసుకున్న మసాలా పొడి వేయాలి. ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్​లో ఉంచి బాగా కలుపుతూ వేయించాలి. చివరన కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
  • అంతే ఘుమఘుమలాడే మటన్ సుక్కా ఫ్రై రెడీ అయినట్లే!

సంక్రాంతి స్పెషల్ "మినప జంతికలు" - ఆయిల్ తక్కువ, క్రంచీ ఎక్కువ!

"సేమియా ఉప్మా" పిల్లలు నచ్చట్లేదా? - ఓ సారిలా మార్చి చేశారంటే ఇష్టంగా తింటారు!