ETV Bharat / offbeat

నోట్లో వేస్తే కరిగిపోయే "అంజీర్ కలాకండ్​" - ఈ కొలతలతో చేస్తే స్వీట్ షాప్​ టేస్ట్ పక్కా!

పాలు, పంచదారతో సింపుల్​గా చేసుకునే స్వీట్ - ఇలా చేసి పెడితే ఇంటిల్లిపాదీ ఇష్టంగా తింటారు!

Anjeer Kalakand
Anjeer Kalakand (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : January 5, 2026 at 10:50 AM IST

2 Min Read
Choose ETV Bharat

Anjeer Kalakand Recipe in Telugu : స్వీట్స్​ను అందరూ ఇష్టంగా తింటారు! ఇక స్వీట్ బాక్స్ కనిపిస్తే చాలు ఒకటి రెండు మిఠాయిలు తిని మనసును తృప్తి చేసుకుంటారు. ఇందులోనూ కలాకండ్​ అంటే చాలా మందికి ఫేవరెట్​! ఎందుకంటే దీని రుచి అద్భుతం. నోట్లో వేసుకోగానే కరిగిపోతుంది. ఇది​ తినడానికి బాగానే ఉన్నా దీనిని ప్రిపేర్ చేయాలంటే చాలా కష్టమని మెజార్టీ పీపుల్​ అనుకుంటారు. ఎందుకంటే పాలను కలియబెడుతూ ఉండాలి. కొంచెం ఆలస్యమైనా మిల్క్​ గడ్డకట్టడమో, అడుగంటడమో జరుగుతుంటాయి. అందుకే చాలా మంది దీనిని తినాలనిపించినప్పుడు షాప్స్​ నుంచి కొనుగోలు చేస్తారు.

అయితే ఇకపై ఆ అవసరం లేకుండా ఇంట్లోనే స్వీట్ షాప్ స్టైల్ కలాకండ్​ను సింపుల్​గా చేసుకోవచ్చని మీకు తెలుసా? ఓసారి ఇప్పుడు చెప్పబోయే పద్ధతిని పాటిస్తూ దీనిని ప్రిపేర్​ చేశారంటే చాలా బాగా వస్తుంది. బిగినర్స్​ కూడా ఈజీగా తయారు చేయోచ్చు. ఇలా చేసి పెడితే పిల్లలు, పెద్దలు వన్స్​మోర్ అనాల్సిందే. మరి అంజీర్ కలాకండ్ చేయడానికి కావాల్సిన పదార్థాలేంటి? ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూద్దాం.

రెస్టారెంట్ స్టైల్ "పల్లీ చట్నీ" - ఒకసారి చేసి పెట్టుకుంటే ఎప్పుడంటే అపుడు పోపు వేసుకోవచ్చు!

Anjeer Kalakand
పాలు (Getty Images)

కావాల్సిన పదార్థాలు :

  • పాలు - 1 లీటర్
  • పంచదార - అర కప్పు
  • జీడిపప్పు - 2 టేబుల్ స్పూన్లు
  • అంజీర్ - 10
  • నిమ్మరసం - 1 టీ స్పూన్
  • నెయ్యి - పావు కప్పు
Anjeer Kalakand
జీడిపప్పు (Getty Images)

తయారీ విధానం :

  • ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నెలో ఒక లీటర్ పాలు పోయాలి. ఇందులోనే అర కప్పు పంచదార, రెండు టేబుల్ స్పూన్ల జీడిపప్పు, 10 అంజీర్ సన్నని తరుగు వేయాలి.
  • ఇప్పుడు మంటను హై ఫ్లేమ్​లో ఉంచి పాలను చిక్కబరచాలి. పాలు మూడు పొంగులు వచ్చిన తర్వాత ఒక టీ స్పూన్ నిమ్మరసం వేసి కలపాలి.
  • పాలను దాదాపు 28 నిమిషాల పాటు కలిపిన తర్వాత పాల పదార్థం లైట్ గోల్డెన్ కలర్​లోకి వస్తుంది. ఇప్పుడు పావు కప్పు నెయ్యి వేసి బాగా మిక్స్ చేయాలి. అనంతరం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
Anjeer Kalakand
అంజీర్ (Getty Images)
  • ఇంకోవైపు నెయ్యి రాసిన ప్లేట్​లో కలాఖండ్ మిశ్రమాన్ని వేసి సరిపడా స్ప్రెడ్ చేసి మూడు గంటల పాటు పక్కనుంచాలి.
  • మూడు గంటల తర్వాత మీకు నచ్చిన షేప్​లో కట్​ చేసుకోవాలి.
  • అంతే స్వీట్ షాప్​ స్టైల్ అంజీర్ కలాకండ్​ రెడీ అయినట్లే!
Anjeer Kalakand
పంచదార (Getty Images)
  • ఇలా ఇంట్లో చేసి పెట్టారంటే ఇంటిల్లిపాదీ ఇష్టంగా తింటారు!
  • ఈ కలాకండ్​ స్వీట్ తయారీ విధానం​ నచ్చితే మీరు ఇంట్లో ఓసారి ట్రై చేయండి.
  • మీరు ఎక్కువ మోతాదులో అంజీర్ కలాకండ్​ను చేసుకోవాలనుకుంటే పాలు, పంచదారతో పాటు ఇతర పదార్థాలను అందుకనుగుణంగా పెంచి తీసుకోవాలి.

ఘుమఘుమలాడే ఇన్​స్టెంట్ "గుత్తి వంకాయ కర్రీ" - చూస్తేనే టేస్ట్ చేయాలనిపిస్తుంది!

"చేపల కర్రీ" బాగా కుదరాలంటే ఈ టిప్స్ పాటించండి - మరుసటి రోజు ఘుమఘుమలాడుతుంది!