అరటిపండ్లతో "సింపుల్, ఈజీ డెజర్ట్" - ఒక్కసారి ఇలా తయారు చేయండి!
న్యూ ఇయర్ స్పెషల్ డెజర్ట్ - బనానా, బిస్కెట్లతో సింపుల్‌గా చేసుకోవచ్చు!

By ETV Bharat Andhra Pradesh Team
Published : December 30, 2025 at 4:54 PM IST
Banana Dessert : ఇంట్లో కుటుంబ సభ్యులకు ఐస్ క్రీమ్ లాంటి డెజర్ట్ ఏదైనా తయారు చేయాలనుకుంటే కాస్త టైం కేటాయించి ఇలా ట్రై చేయండి. ఇది ఎంతో టేస్టీగా క్రీమీగా గొంతు దిగిపోతుంది. అరటి పండ్లు, కస్టర్డ్ పౌడర్, పాలు, పంచదార కలిపి చేసే ఈ డెజర్ట్ నిజంగా ఎంతో రుచిగా ఉంటుంది. న్యూ ఇయర్ కోసం ఇలాంటి రెసిపీ ఓ సారి ఇంట్లో ట్రై చేసి ఫ్యామిలీతో షేర్ చేయండి.
న్యూ ఇయర్ వేడుకల్లో "సింపుల్ స్వీట్" ట్రై చేయండి - ఫ్రెండ్స్, ఫ్యామిలీతో షేర్ చేసుకోండి!

కావలసిన పదార్థాలు :
- అరటి పండ్లు - 6
- పాలు - 120 మి.లీ
- కండెన్స్డ్ పాలు - 120 మి.లీ
- కస్టర్డ్ పౌడర్ - 2 టేబుల్ స్పూన్లు
- క్రీమ్ చీజ్ - 50 గ్రాములు
- తాజా క్రీమ్ - 100 గ్రాములు
- పంచదార - 50 గ్రాములు
- వెనిల్లా ఎసెన్స్ - 1 స్పూన్
- విప్డ్ క్రీమ్ - 100 గ్రాములు
- చల్లబడిన విప్డ్ క్రీమ్ - 180 మి.లీ
- వెనిల్లా ఎసెన్స్ - 1 స్పూన్
- క్రీమ్ చీజ్ - 120 గ్రాములు
- బిస్కెట్లు - 100 గ్రాములు

తయారీ విధానం :
- ముందుగా కస్టర్డ్ తయారు చేసుకోవాలి. మిక్సింగ్ బౌల్లోకి కస్టర్డ్ పౌడర్ లో చీజ్, పంచదార, క్రీమ్, పాలు, వెనీలా ఎసెన్స్ వేసి బాగా బీట్ చేసి కలుపుకోవాలి. అన్నీ కలిసిపోయేలా బీట్ చేసుకోవాలి. బాగా కలపకపోతే గడ్డలుగా మారుతుంది. ఇపుడు స్టవ్ పై పెట్టుకుని సన్నటి మంటపై బాగా కలుపుతూ ఉండాలి. ఐదారు నిమిషాల తర్వాత స్టవ్ మీద నుంచి దించి మరో సారి బాగా కలుపుకోవాలి. ఇలా క్రీమీగా తయారైన ఈ మిశ్రమాన్ని ఫ్రిజ్ లో పెట్టుకోవాలి.

- ఇపుడు మరో గిన్నెలో 80గ్రాముల విప్డ్ క్రీమ్ వేసుకుని బాగా బీట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఫ్రెష్ క్రీమ్ వేసుకుని మిక్స్ చేసుకోవాలి.ఇపుడు వెనీలా ఎసెన్స్ వేసుకోవాలి. ఇపుడు అరటి పండ్లు తెచ్చుకుని సన్నటి ముక్కలు కట్ చేసుకోవాలి. వీటిని ఫ్రిజ్‌లో పెట్టుకున్న క్రీమ్‌లో వేసుకోవాలి. అరటి పండ్ల ముక్కల్లో కొన్నింటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇపుడు అందులోకి కండెన్స్డ్ మిల్క్, క్రీమ్ చీజ్ వేసుకుని బాగా కలుపుకోవాలి. రూమ్ టెంపరేచర్లో ఉన్న చీజ్ మాత్రమే బాగా కలుస్తుంది.

- ఇపుడు రెండు మిశ్రమాలను గిన్నెలోకి వేసుకుని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత బిస్కెట్లను కొన్ని పక్కన పెట్టుకుని మిగతా వాటిని చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఆ తర్వాత అన్నింటినీ బాగా కలుపుకోవాలి. ఈ ఫుడ్డింగ్ ని డీప్ ఫ్రిజ్‌లో ఐదారు గంటల పాటు పెట్టుకోవాలి. చివరగా మిగిలిన బిస్కెట్ ముక్కలను కూడా వేసుకుని కలుపుకోవాలి. అంతే! ఎంతో టేస్టీ డెజర్ట్ రెడీగా ఉంటుంది.
ఘుమఘుమలాడే "వెజిటేరియన్స్ స్పెషల్ రెసిపీ" - న్యూ ఇయర్ వేడుకల్లో ఇలాంటి ఫుడ్ ఆస్వాదించండి!
జ్యూసీ, స్పైసీ "మటన్ లివర్ ఫ్రై" - ఈ 31st పార్టీకి పర్ఫెక్ట్ కాంబినేషన్!

