ETV Bharat / offbeat

శివరాత్రికి "చిలగడ దుంప బొబ్బట్లు" - నోట్లో వేసుకోగానే కరిగిపోతాయి!

పప్పు నానబెట్టుకునే అవసరమే లేదు - బెల్లం, గోధుమ పిండితో ట్రై చేయండి!

sweet_potato_sweet_recipes
sweet_potato_sweet_recipes (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : February 14, 2026 at 11:40 AM IST

2 Min Read
Choose ETV Bharat

Sweet Potato Sweet Recipes : శివరాత్రి వచ్చేసింది. ఉపవాసం, జాగారం చేసే భక్తులు చిలగడ దుంపలు తెచ్చుకుని పెట్టుకుంటారు. చాలా మంది వాటిని ఉడికించి తింటుంటారు. కానీ, చిలగడదుంపలతో అద్భుతమైన స్వీట్ తయారు చేసుకోవచ్చు. ఉపవాసం ఉండే భక్తులకు ఇంది ఎంతో ఉపయోగపడుతుంది. పప్పులు నానబెట్టకుండా కేవలం ఆరోగ్య ప్రయోజనాలు అందించే చిలగడదుంప స్వీట్ ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ తెలుసుకోండి.

పసందైన "అటుకుల కొబ్బరి పూర్ణాలు" - పర్ఫెక్ట్​గా పొంగాలంటే ఇలా ట్రై చేయండి!

sweet_potato_sweet_recipes
sweet_potato_sweet_recipes (Getty images)

కావల్సిన పదార్థాలు :

  • చిలగడదుంపలు - అర కేజీ
  • గోధుమ పిండి - 2 కప్పులు
  • మైదా - 1 కప్పు
  • నెయ్యి - పావు కప్పు
  • పసుపు - పావు స్పూన్
  • ఉప్పు - కొద్దిగా
  • బెల్లం - కప్పు
  • కొబ్బరి పొడి - 2 టేబుల్ స్పూన్లు
  • యాలకుల పొడి - అర స్పూన్
sweet_potato_sweet_recipes
sweet_potato_sweet_recipes (Getty images)

తయారీ విధానం :

  • ముందుగా అర కేజీ చిలగడదుంపలు బాగా శుభ్రం చేసుకోవాలి. మట్టి లేకుండారెండు మూడు సార్లు క్లీన్ చేసుకుని కుక్కర్​లోకి తీసుకోవాలి. మునిగిపోయే వరకు నీళ్లు పోసుకుని 3 నుంచి 4 విజిల్స్ వచ్చే వరకు మీడియం ప్లేమ్​లో కుక్ చేసుకోవాలి. ఈ లోగా పిండి కలుపుకోవడానికి ఒక మిక్సింగ్​ బౌల్ లోకి 2 కప్పుల గోధుమ పిండి తీసుకోవాలి. మీరు గోధుమ పిండికి బదులు మైదా లేదా రెండింటినీ కలిపి కూడా వాడుకోవచ్చు. ఆ తర్వాత కొద్దిగా నెయ్యి లేదా నూనె, పసుపు, ఉప్పు వేసుకుని బాగా కలుపుకోవాలి.
sweet_potato_sweet_recipes
sweet_potato_sweet_recipes (Getty images)
  • ఆ తర్వాత కొద్దికొద్దిగా నీళ్లు పోసుకుంటూ చపాతీ పిండి మాదిరిగా గట్టిగా కాకుండా కాస్త సాఫ్ట్ గా కలుపుకోవాలి. ఆ తర్వాత కొద్ది కొద్దిగా నెయ్యి కలుపుకొంటూ పిండిని కలిపి చివరగా పిండి ముద్దపై కొద్దిగా నెయ్యి రాసి మూతపెట్టి పక్కన పెట్టుకోవాలి. ఈ లోగా చిలగడదుంపలు చక్కగా ఉడికిపోతాయి. ఇపుడు పొట్టు పీల్ చేసుకుని మాష్ చేసుకోవాలి. వేడి తగ్గిన తర్వాత చేతితో కూడా మాష్ చేసుకోవచ్చు.
sweet_potato_sweet_recipes
sweet_potato_sweet_recipes (Getty images)
  • ఇపుడు స్టవ్​పై కడాయి పెట్టుకుని కప్పు బెల్లం తరుగు వేసుకుని కొద్దిగా నీళ్లు పోసి కరిగించుకోవాలి. బెల్లంతో పాటు 2 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి పొడి వేసుకుని కలిపి ఆ తర్వాత మ్యాష్ చేసుకున్న స్వీట్ పొటాటో మిశ్రమాన్ని వేసుకోవాలి. ఐదు నిమిషాల పాటు సన్నటి మంటపై ఉడికిస్తూ ఫ్లేవర్​ కోసం యాలకుల పొడి వేసుకుని కలపాలి. ఆ తర్వాత స్టవ్ కట్టేసి చల్లారిన తర్వాత చిన్న చిన్న బాల్స్ చేసుకోవాలి.
sweet_potato_sweet_recipes
sweet_potato_sweet_recipes (Getty images)
  • ఇపుడు గోధుమ పిండి మిశ్రమాన్ని మరో సారి కలుపుకొని బొబ్బట్ల కోసం పిండి ముద్దలు చేసుకోవాలి. టేబుల్​పై బటర్ పేపర్ పెట్టుకుని నెయ్యి రాసుకుని పిండి ముద్దను పెట్టుకుని కొద్దిగా వెడల్పు చేసుకుని ముందుగా రెడీ చేసుకున్న చిలగడదుంప బాల్ పెట్టుకుని క్లోజ్ చేసుకోవాలి. ఆ తర్వాత బొబ్బట్లు వత్తుకోవాలి. ఇపుడు స్టవ్ పై కడాయి పెట్టుకుని కొద్దిగా నెయ్యి రాసుకుని బొబ్బట్లు రెండు వైపులా దోరగా కాల్చుకోవాలి. ఇలాంటి బొబ్బట్లు ఎప్పుడూ తెలియని రుచిలో అద్భుతంగా ఉంటాయి.

పల్లెటూరు "కాకా హోటల్ చట్నీ రెసిపీ" సీక్రెట్ ఇదే! - ఇడ్లీ, దోసెల్లోకి ఇది కమ్మగా ఉంటుంది!

ఇడ్లీ, దోసె ఏదైనా సరే - అద్దిరిపోయే "పల్లీ, టమోటా చట్నీ"!