మైదా లేకుండానే టేస్టీ "స్వీట్ బన్స్" - ఓవెన్ అక్కర్లేదు! - నిమిషాల్లోనే రెడీ!
గోధుమపిండితో రుచికరమైన "స్వీట్ బన్స్" - పిల్లలైతే భలే ఇష్టంగా తింటారు!

Published : April 9, 2026 at 10:18 AM IST
Wheat Flour Sweet Bun Recipe : ఈవెనింగ్ టైమ్ పిల్లల కోసం ఏం స్నాక్స్ చేయాలని ఆలోచిస్తున్నారా? ఎప్పుడూ రెగ్యులర్‌గా చేసి పెట్టే బజ్జీలు, పునుగులు, గారెలు, పకోడీ వంటివి కాకుండా ఏదైనా కొత్త రెసిపీ అయితే బాగుండనుకుంటున్నారా? అయితే, మీకోసమే ఈ అద్దిరిపోయే రెసిపీ. అదే, బేకరీ స్టైల్లో సూపర్ టేస్టీ "స్వీట్ బన్స్". నార్మల్‌గా చాలా మంది మైదా పిండితో బన్నులు ప్రిపేర్ చేస్తుంటారు. కానీ, మైదా ఆరోగ్యానికి అంత మంచిది కాదు.
అందుకే, మీకోసం గోధుమపిండితో సింపుల్‌గా ప్రిపేర్ చేసుకునేలా ఈ స్వీట్ బన్ను రెసిపీని తీసుకొచ్చాం. ఇవి సూపర్ టేస్టీగా ఉండి ఇంటిల్లిపాదీకి చాలా బాగా నచ్చుతాయి. ముఖ్యంగా పిల్లలైతే వీటిని భలే ఇష్టంగా తింటారు. పైగా ఈ బన్నుల తయారీలో గుడ్డు కూడా వేయనవసరం లేదు. అలాగే, ఓవెన్ అవసరం లేదు. చాలా తక్కువ పదార్థాలతో అప్పటికప్పుడు బిగినర్స్ కూడా ఈజీగా తయారు చేసుకోవచ్చు. మరి, లేట్ చేయకుండా ఈ టేస్టీ అండ్ హెల్దీ స్వీట్ బన్నులు ఎలా రెడీ చేసుకోవాలి? అందుకు కావాల్సిన పదార్థాలేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు :
- రెండు కప్పులు - గోధుమపిండి
- నాలుగు స్పూన్లు - పంచదార
- రెండు చిటికెళ్లు - వంటసోడా
- టేస్ట్‌కి సరిపడా - ఉప్పు
- తగినంత - నూనె
- పిస్తా, వాల్నట్స్, బాదం, జీడిపప్పులు - అర కప్పు(అన్నీ కలిపి)
- రెండు స్పూన్లు - తెల్ల నువ్వులు
సమ్మర్లో రుచితోపాటు ఆరోగ్యాన్నిచ్చే "టిఫెన్" - తక్కువ పదార్థాలతో ఇన్‌స్టంట్‌గా రెడీ!

తయారీ విధానం :
- ఈ వెరైటీ అండ్ టేస్టీ బన్నుల తయారీ కోసం ముందుగా డ్రై ఫ్రూట్స్ పౌడర్‌ను రెడీ చేసుకోవాలి.
- ఇందుకోసం ముందుగా స్టవ్ మీద చిన్న కడాయిలో పిస్తా, వాల్నట్స్, బాదం, జీడిపప్పులను వేసి సన్నని సెగ మీద దోరగా వేయించుకోవాలి.
- తర్వాత వాటిని చల్లార్చుకుని మిక్సీ జార్లో వేసుకుని మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. అలాగే, గోధుమపిండిని జల్లించుకుని రెడీగా ఉంచుకోవాలి.

- ఇప్పుడు ఒక వెడల్పాటి మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో జల్లించుకున్న గోధుమపిండి, ముందుగా రెడీ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ పౌడర్, చక్కెర, వంటసోడా, రుచికి తగినంత ఉప్పు, నాలుగు స్పూన్ల నూనె వేసి ఒకసారి పదార్థాలన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.
- అనంతరం ఆ మిశ్రమంలో కొద్దికొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మెత్తగా అయ్యేలా చేతితో మెదుపుతూ మళ్లీ మళ్లీ బాగా కలపాలి.
- ఇక్కడ పిండి కన్సిస్టెన్సీ అనేది మరీ గట్టిగానో, జారుగానో ఉండకుండా మీడియం థిక్‌నెస్‌తో సాఫ్ట్‌గా ఉండేలా కలుపుకోవాలి.
- నెక్ట్స్ కలిపి పెట్టుకున్న ఆ పిండిలో నుంచి పెద్ద నిమ్మకాయంత పిండి ముద్దను తీసుకుని నూనె రాసిన పళ్లెంలో ప్లేట్ మధ్యలో ఉంచాలి.

- తర్వాత దాన్ని చేతితో తడుతూ గుండ్రంగా, కాస్త మందంగా బన్ను షేప్ వచ్చేలా వత్తుకోవాలి. చపాతీ కర్ర అవసరం లేదు.
- అలా రెడీ చేసుకున్నాక దానిపై కొన్ని తెల్ల నువ్వులు చల్లి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలానే మిగిలిన పిండి మొత్తాన్ని చిన్న బన్నుల్లా రెడీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి.
- అనంతరం స్టవ్ మీద పెనం పెట్టి వేడి చేసుకోవాలి. పెనం హీట్ అయ్యాక కొద్దిగా నూనె వేసుకోవాలి.
- ఆ తర్వాత ముందుగా రెడీ చేసుకున్న బన్నులను ఒకట్రెండు వేసుకుని మీడియం ఫ్లేమ్‌లో రెండు వైపులా గోల్డెన్ కలర్లోకి మారేంత వరకు కాల్చుకోవాలి.

- ఆవిధంగా కాల్చుకున్నాక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే చాలు.
- అంతే, గోధుమపిండితో ఓవెన్ అవసరం లేని సూపర్ టేస్టీ "స్వీట్ బన్నులు" అప్పటికప్పుడు సింపుల్‌గా రెడీ అవుతాయి!
- ఈ బన్నులు డ్రై ఫ్రూట్స్ పౌడర్ వేయడం వల్ల చాలా రుచికరంగా ఉంటాయి. పిల్లలైతే ఒకటికి రెండు ఎంతో ఇష్టంగా తింటారు.
- మరి, నచ్చితే మీరూ ఎప్పుడూ రెగ్యులర్ స్నాక్స్ కాకుండా ఓసారి ఇలా స్వీట్ బన్నులు ట్రై చేయండి.
ఎక్కువ నీళ్లున్న "కొబ్బరి బొండం" ఎలా గుర్తించాలి? - ఇలా చెక్ చేయండి!
జ్యూస్ సెంటర్ స్టైల్లో టేస్టీ "పుచ్చకాయ జ్యూస్" - నాలుగు పదార్థాలతో నిమిషాల్లోనే రెడీ!

