ETV Bharat / offbeat

మండుటెండల్లో మజానిచ్చే "లెమన్​ పంచ్​" - ఒక్కో సిప్​ తాగుతుంటే ఆ కిక్కే వేరు!

నోరూరించే రుచితో లెమన్​ జ్యూస్​ - ఇంట్లోనే సింపుల్​గా ప్రిపేర్ చేసుకోండిలా!

Lemon Punch
Lemon Punch (Getty Images)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : April 27, 2026 at 11:33 AM IST

2 Min Read
Choose ETV Bharat

Lemon Punch Making : రోజు రోజుకు ఎండలు దంచికొడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మెజార్టీ పీపుల్​ ఎండ వేడిమి, ఉక్కపోత నుంచి ఉపశమనం పొందేందుకు రకరకాల కూల్​డ్రింక్స్​, జ్యూస్​లు, ఐస్​క్రీమ్స్, లస్సీ, కుల్ఫీ వంటివి తీసుకుంటుంటారు. ఇవి మాత్రమే కాకుండా సమ్మర్​లో చాలా మంది ఇష్టంగా తాగే వాటిలో నిమ్మరసం కూడా ముందు వరుసలో ఉంటుంది. తియ్యగా, పుల్లగా, ఉప్పగా ఉండే దీనిని చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ఇష్టంగా తాగుతారు.

ఇంట్లో కూడా నిమ్మకాయలతో చాలా మంది ఈ డ్రింక్​ తయారు చేస్తుంటారు. అయితే ఎప్పుడూ తాగినట్లు నిమ్మరసం పిండి, పంచదార, ఉప్పు కలిపి తాగితే ఏం బాగుంటుంది? అందుకే ఈసారి కాస్త వెరైటీగా లెమన్​ పంచ్ ట్రై చేయండి​. కేవల నిమిషాల్లో తయారయ్యే ఈ డ్రింక్​ను ఒక్కొక్క సిప్​ తాగుతుంటే ఫుల్​ కిక్​ వస్తుంది. బిగినర్స్ కూడా ఈ స్టెప్స్​ పాటిస్తూ ఈజీగా చేసుకోవచ్చు. మరి లేట్​ చేయకుండా ఈ లెమన్​ పంచ్​ ఎలా చేయాలి? ఇందుకు కావాల్సిన పదార్థాలేంటో ఇప్పుడు చూద్దాం.

ఎండల్లో హాయినిచ్చే "బెల్లం లస్సీ" - ఒక్క గ్లాస్​ తాగారంటే ఫుల్​ రిఫ్రెష్​!

Lemon Punch
నిమ్మరసం (Getty Images)

కావాల్సిన పదార్థాలు :

  • నిమ్మకాయలు - 4
  • ఉప్పు - అర స్పూన్
  • పంచదార - 6 టేబుల్ స్పూన్లు
  • పచ్చిమిర్చి - 2
Lemon Punch
పచ్చిమిర్చి (Getty Images)

తయారీ విధానం :

  • ఈ రెసిపీ కోసం ముందుగా నాలుగు నిమ్మకాయలను కట్ చేసి రసం తీసి పక్కనుంచాలి. అలాగే రెండు పచ్చిమిర్చిని వీలైనంత సన్నగా, రౌండ్​గా కట్​ చేసుకోవాలి.
  • ఇప్పుడు వెడల్పు మూత కలిగిన బాటిల్​ తీసుకొని నిమ్మరసం, అర స్పూన్ ఉప్పు, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు, ఆరు టేబుల్ స్పూన్ల పంచదార వేయాలి. ఇందులోనే 10 ఐస్​క్యూబ్స్, 600 ఎంఎల్​ చల్లటి నీళ్లు​ పోసి మూతపెట్టాలి. ఆ తర్వాత ఓ మూడు నిమిషాల పాటు బాగా షేక్ చేయాలి.
Lemon Punch
ఉప్పు (Getty Images)
  • ఆ తర్వాత ఓ గాజు గ్లాస్​లోకి మరో 3 ఐస్​క్యూబ్స్​ వేసి మిక్స్​ చేసుకున్న లెమన్​ మిశ్రమాన్ని పోసి సర్వ్​ చేసుకోవాలి.
  • అంతే మండుటెండల్లో కూల్ కూల్​గా కమ్మని లెమన్​ పంచ్​ సిద్ధంగా ఉంటుంది.
Lemon Punch
పంచదార (Getty Images)
  • మరి మీకు ఈ రెసిపీ నచ్చితే బయట దొరికే జ్యూస్​లు, పానీయాలకు బదులుగా ఇంట్లోనే ఇలా దీన్ని చేసి ఇవ్వండి. పిల్లల నుంచి పెద్దల వరకు ఒకటికి రెండు గ్లాసులు ఇష్టంగా తాగుతారు.
  • మీరు ఈ రెసిపీని ఎక్కువ మోతాదులో చేసుకోవాలనుకుంటే నిమ్మకాయలు, పంచదారతో పాటు ఇతర పదార్థాలను అందుకనుగుణంగా పెంచి తీసుకోవాలి.

చిట్కాలు ​:

  • లెమన్​ పంచ్​ చేయడానికి బాటిల్​కి బదులు బయట మార్కెట్​లో షేకర్​ బాటిల్స్​ అని సెపరేట్​గా దొరుకుతాయి. వాటిని ఉపయోగించవచ్చు.
  • నిమ్మకాయలు మరీ దొరగా, మరీ పండినవి కాకుండా తీసుకోవాలి. అప్పుడే టేస్ట్​ బాగుంటుంది.
  • ఇందులో ఉపయోగించిన పచ్చిమిర్చిని తింటూ ఈ డ్రింక్​ తాగాలి. అప్పుడే దీని రుచి​ అద్దిరిపోతుంది.

చిటికెలో "మ్యాంగో జ్యూస్" - మండుటెండల్లో కూల్​ కూల్​గా తాగేయండి!

వీకెండ్ స్పెషల్ "చింతచిగురు మటన్ కర్రీ" - ఇలా చేస్తే ఇంటిల్లిపాదీ రుచికి ఫిదా!