ETV Bharat / offbeat

బండి మీద అమ్మే రుచితో కరకరలాడే "పకోడీ" - పిండి కలపడంలోనే అసలు సీక్రెట్!

ఈ పద్ధతిలో "ఆనియన్ పకోడీ" చేయండి - తక్కువ నూనెతో కరకరలాడిపోద్ది!

Street Style Onion Pakoda Recipe
Street Style Onion Pakoda Recipe (Getty Images)
author img

By ETV Bharat Telangana Team

Published : February 24, 2026 at 2:47 PM IST

3 Min Read
Choose ETV Bharat

Street Style Onion Pakoda Recipe : సాయంత్రం టైమ్​లో పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ కరకరలాడుతూ మంచి రుచికరంగా ఉండే స్నాక్స్ తినడానికి ఎక్కువ ఇష్టపడుతుంటారు. అలాంటి టైమ్​లో మెజార్టీ పీపుల్​కు ముందుగా గుర్తొచ్చేది "పకోడీ". అయితే, దీన్ని బయట మిర్చి బండ్లు, స్వీట్ షాపుల్లో తిన్నప్పుడు క్రిస్పీగా, టేస్టీగా ఉంటుంది. అదే, ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే ఏదో మిస్ అయిన ఫీలింగ్ కలుగుతుంది. అలాంటివారు ఓసారి ఈ పద్ధతిలో "ఆనియన్ పకోడీ" ట్రై చేయండి. ముఖ్యంగా పిండి కలిపేటప్పుడు ఈ ఒక్క సీక్రెట్ టిప్ పాటించారంటే చాలు! పకోడీ స్ట్రీట్ స్టైల్​లో కరకరలాడుతూ టేస్ట్ అద్దిరిపోతుంది. మరి, లేట్ చేయకుండా ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం.

Street Style Onion Pakoda Recipe
శనగపిండి (Getty Images)

అవసరమైన పదార్థాలు :

  • రెండు కప్పులు - శనగపిండి
  • అర కప్పు - బియ్యప్పిండి
  • మీడియ సైజ్ ఉల్లిపాయలు - నాలుగు
  • నాలుగైదు - పచ్చిమిర్చి
  • ఒక టీస్పూన్ - వాము
  • రుచికి తగినంత - ఉప్పు
  • ఒక చెంచా - కారం
  • కొద్దిగా - కరివేపాకు
  • నాలుగు చెంచాలు - కొత్తిమీర తరుగు
  • ఒక టీస్పూన్ - ధనియాలపొడి
  • అర చెంచా - వంటసోడా
  • వేయించేందుకు సరిపడా - నూనె

జొన్నలు, మినప్పప్పు కాంబోలో "వడలు" - చాలా టేస్టీగా ఉంటాయి - తయారీ ఈజీ!

Street Style Onion Pakoda Recipe
ఉల్లిపాయలు (Getty Images)

ఆనియన్ పకోడీ తయారీ విధానం :

  • ఈ స్ట్రీట్ స్టైల్ క్రిస్పీ పకోడీ తయారీ కోసం ముందుగా ఉల్లిపాయలను పొడుగ్గా, సన్నని ముక్కలుగా కట్ చేసుకోవాలి.
  • అలాగని మరీ సన్నగా కట్ చేసుకోవద్దు. అలా కట్ చేసుకుంటే పకోడీ ఫ్రై అయ్యే సరికి ఉల్లిపాయ కాస్త మాడిపోయినట్లుగా అయి రుచి మారిపోతుందని గుర్తుంచుకోవాలి.
  • అదేవిధంగా, పచ్చిమిర్చి, కొత్తిమీరను వీలైనంత సన్నగా తరుక్కుని రెడీగా ఉంచుకోవాలి.
Street Style Onion Pakoda Recipe
పచ్చిమిర్చి (Getty Images)
  • ఇప్పుడు ఒక వెడల్పాటి మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న సన్నని ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, పచ్చిమిర్చి, కరివేపాకు తరుగు వేసుకోవాలి.
  • అలాగే, వాము, టేస్ట్​కి సరిపడా ఉప్పు, కారం, ధనియాలపొడి వేసుకుని అవన్నీ ఉల్లిపాయ ముక్కలకు పట్టేలా చేతితో కొంచెం పిండినట్లు చేస్తూ బాగా మిక్స్ చేసుకోవాలి.
  • ఇలా మూడ్నాలుగు నిమిషాలు కలపగానే ఉల్లిపాయల నుంచి కొద్దిగా నీళ్లు ఊరి ఆ మిశ్రమం తడి తడిగా మారుతుంది.
  • అప్పుడు అందులో శనగపిండి, బియ్యప్పిండి, వంటసోడా వేసుకుని మరోసారి ఆ మిశ్రమం మొత్తాన్ని బాగా కలిసేలా కాస్త ప్రెస్ చేసినట్లు చేస్తూ కలుపుకోవాలి.
Street Style Onion Pakoda Recipe
వాము (Getty Images)
  • ఇక్కడ నీళ్లు యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఉల్లిపాయల్లో ఉన్న తడికే పిండి అనేది బైండింగ్​లా తయారవుతుంది.
  • ఒకవేళ అలా కలిపినా మీకు పిండి మిశ్రమం అనేది పొడిపొడిగా అనిపిస్తే ఐదు నిమిషాల పాటు పిండి మిశ్రమాన్ని మూతపెట్టి పక్కనుంచాలి.
  • ఐదు నిమిషాల తర్వాత ఉల్లిపాయల నుంచి కొద్దిగా నీరు ఊరుతుంది. అప్పుడు మరోసారి చేతితో ప్రెస్ చేస్తూ పిండిని బాగా కలిపితే సరిపోతుంది.
Street Style Onion Pakoda Recipe
బియ్యప్పిండి (Getty Images)
  • "నీళ్లు యాడ్ చేయకుండా పిండి కలిపే" ఈ సీక్రెట్ టిప్ ఫాలో అవ్వడం ద్వారా బండి మీద అమ్మేదానిలా పకోడీ కరకరలాడుతూ రావడమే కాకుండా మంచి టేస్టీగానూ ఉంటుంది.
  • అనంతరం స్టవ్ మీద కడాయిలో నూనె వేసి హీట్ చేసుకోవాలి. నూనె వేడయ్యాక మంటను తగ్గించి కలిపి పెట్టుకున్న పిండి ముద్దలో నుంచి కొద్దిగా తీసుకుని కాగుతున్న నూనెలో చేతి వేళ్లతో కొద్దికొద్దిగా డ్రాప్ చేస్తూ పకోడీలా వేసుకోవాలి.
  • పకోడీని వేసుకునేటప్పుడు మరీ ముద్దముద్దలా కాకుండా పల్చగా వేసుకోవాలి. అప్పుడే మంచిగా వేగి క్రిస్పీగా వస్తుంది.
  • అలా పాన్​లో​ వేయించడానికి సరిపడా వేసుకున్నాక వెంటనే కదపకుండా కాసేపు కాలనివ్వాలి.
Street Style Onion Pakoda Recipe
ధనియాలు (Getty Images)
  • ఆపై గరిటెతో అటు ఇటు తిప్పేస్తూ మీడియం ఫ్లేమ్​లో మంచి కలర్ వచ్చేంత వరకు వేయించాలి.
  • అనంతరం టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్​లోకి తీసుకుని కాసేపు ఉంచి ఆపై వేడి వేడిగా సర్వ్ చేసుకోండి.
  • అంతే, బండి మీద అమ్మే రుచిలో కరకరలాడే "ఆనియన్ పకోడీ" సింపుల్​గా ఇంట్లోనే తయారవుతుంది!

చల్లని వేళ నోరూరించే "చంద్రముఖి చికెన్ ఫ్రై" - తిన్నారంటే లక లక లక అనాల్సిందే!

మరమరాలు, ఎగ్స్​తో టేస్టీ "ఆమ్లెట్​" -10 నిమిషాల్లోనే సూపర్ బ్రేక్​ఫాస్ట్ రెడీ!