ETV Bharat / offbeat

దీపావళికి శ్రీలంకన్ "లవారియా" స్వీట్ - ఈ మిఠాయితో పండగ చేసుకుంటారు!

- బియ్యప్పిండి, బెల్లంతో నోరూరించే స్వీట్ - రుచితో పాటు ఆరోగ్యం కూడా!

Srilankan Famous Lavariya Recipe
Lavariya Recipe (Eenadu)
author img

By ETV Bharat Telangana Team

Published : October 17, 2025 at 2:05 PM IST

3 Min Read
Choose ETV Bharat

Srilankan Famous Lavariya Recipe : పిల్లల నుంచి పెద్దల వరకు ఎవరికైనా ఎప్పుడూ ఒకే రకమైన పిండి వంటకాలు, స్వీట్ రెసిపీలు చేసి పెడితే నచ్చదు. ఎంత ఇష్టమైనవి అయినా తరుచూ అవే తినాలంటే బోరింగ్ ఫీల్ కలుగుతుంది. ఈ క్రమంలోనే అప్పుడప్పుడు కొత్తరకం స్వీట్స్ రుచి చూడాలని కోరుకుంటారు చాలా మంది. అందుకే, మీకోసం దీపావళి వేళ మీరు ఇప్పటివరకు ట్రై చేయని ఒక సరికొత్త రెసిపీని తీసుకొచ్చాం. అదే, శ్రీలంక ఫేమస్ "లవారియా స్వీట్".

ఇది శ్రీలంకవారి వంటల్లో చాలా ప్రత్యేకమైంది. ఈ స్వీట్ చూడటానికి ఎంత ఆకర్షణీయంగా ఉంటుందో రుచిలో అంత అద్భుతంగా ఉంటుంది. పైగా దీన్ని తక్కువ పదార్థాలతో అప్పటికప్పుడు సింపుల్​గా తయారు చేసుకోవచ్చు. లోపల స్టఫింగ్​తో సూపర్ టేస్టీగా ఉండే దీన్ని పిల్లలైతే భలే ఇష్టంగా తింటారు. మరి, ఇంటిల్లిపాదీ మెచ్చే ఈ వెరైటీ శ్రీలంక స్వీట్​ తయారీకి కావాల్సిన పదార్థాలేంటి? ఎలా రెడీ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం.

Srilankan Famous Lavariya Recipe
బియ్యప్పిండి (Getty Images)

లవారియాకు కావాల్సిన పదార్థాలు :

  • ఒక కప్పు - బియ్యప్పిండి
  • అర కప్పు - బెల్లం తురుము
  • మూడు టేబుల్​స్పూన్లు - పెసరపప్పు
  • అర కప్పు - కొబ్బరితురుము
  • చిటికెడు - ఉప్పు
  • పావు చెంచా - యాలకుల పొడి
  • ఒక చెంచా - నువ్వుల నూనె

పండక్కి పెద్ద కష్టపడకుండా - సేమియాతో అప్పటికప్పుడు చేసుకునే కమ్మని "స్వీట్"!

Srilankan Famous Lavariya Recipe
బెల్లం (Getty Images)

తయారీ విధానం :

  • సూపర్ టేస్టీగా ఉండే శ్రీలంక ఫేమస్ 'స్వీట్ రెసిపీ' కోసం ముందుగా ఒక గిన్నెలో పెసరపప్పును తీసుకుని శుభ్రంగా కడగాలి. ఆపై అందులో తగినన్ని నీళ్లు పోసి అరగంటపాటు నాననివ్వాలి.
  • పెసరపప్పు మంచిగా నానిన తర్వాత వాటర్ వడకట్టి దాన్ని మరో గిన్నెలోకి తీసుకోవాలి. తర్వాత అందులో ముప్పావు కప్పు మంచి నీళ్లు పోసి మెత్తగా ఉడికించుకోవాలి.
  • పప్పు మెత్తగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని మిగిలిన వేడి నీళ్లు వంపేసి పక్కనుంచాలి.
Srilankan Famous Lavariya Recipe
కొబ్బరి తురుము (Getty Images)
  • అనంతరం స్టవ్ మీద మరో గిన్నెలో బెల్లం తురుము, తగినన్ని నీళ్లు తీసుకుని మరిగించాలి.
  • బెల్లం పూర్తిగా కరిగే వరకు మరిగించుకున్నాక దింపి కాస్త చల్లారనివ్వాలి. ఆపై బెల్లం సిరప్​ను వడకట్టి మళ్లీ సన్నని సెగ మీద ఉంచాలి.
  • తర్వాత అందులో సన్నని కొబ్బరి తురుము, ఉడికించి పక్కన పెట్టుకున్న పెసరపప్పు, యాలకుల పొడి యాడ్ చేసుకుని ఒకసారి అన్నీ కలిసేలా కలపాలి.
  • ఆపై మీడియం ఫ్లేమ్​లో కలియబెడుతూ మెత్తగా ఉడికించుకోవాలి. అలా ఉడికించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసి దింపి చల్లారనివ్వాలి.
  • అది చల్లారే లోపు స్టవ్ మీద సాన్ పాన్​లో తగినన్ని నీళ్లు తీసుకుని అందులో ఉప్పు, నూనె వేసి కలిపి వేడి చేసుకోవాలి. ఆ మిశ్రమం వేడెక్కి మరుగుతున్నప్పుడు స్టఫ్ ఆఫ్ చేసి దింపేసుకోవాలి.

స్వీట్ షాప్​కి వెళ్లకుండా - ఇంట్లోనే ఈజీగా చేసుకునే "స్వీట్"! - దీపావళికి పర్ఫెక్ట్​!

Srilankan Famous Lavariya Recipe
పెసరపప్పు (Getty Images)
  • తర్వాత అందులో బియ్యప్పిండిని కొద్దికొద్దిగా యాడ్ చేసుకుంటూ ఉండలు కట్టకుండా కలపాలి. అది కాస్త గోరువెచ్చగా మారిన తర్వాత చేతితో ప్రెస్ చేస్తూ కలుపుతూ మెత్తని పిండి ముద్దలా రెడీ చేసుకోవాలి.
  • అనంతరం చక్రాల గిద్దలో (ఇడియప్పమ్ మేకర్​) కారప్పూస బిళ్ల సెట్ చేసుకుని అందులో కలిపి పెట్టుకున్న పిండిని తగినంత తీసుకోవాలి.
  • తర్వాత పిండి కూరుకున్న జంతికల గొట్టంతో అరిటాకు మీద కారప్పూసలా ఒత్తుకోవాలి.
  • అలా ఒత్తుకున్నాక దాని మీద ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి-పెసరపప్పు మిశ్రమాన్ని రెండు చెంచాలు ఉంచి ఆపై అరిటాకు రెండు అంచులను పట్టుకుని దగ్గరగా చేర్చాలి.
Srilankan Famous Lavariya Recipe
యాలకులు (Getty Images)
  • ఆవిధంగా చేసినప్పుడు ఇడియప్పమ్ అంచులు కలిసిపోయి, ఫిల్లింగ్ లోపల ఉండిపోతుంది. తర్వాత దాన్ని ఒక ప్లేట్​లోకి తీసుకుని పక్కనుంచాలి. ఇదే ప్రాసెస్​లో పిండి మొత్తాన్ని రెడీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి.
  • అన్నీ రెడీ చేసుకున్నాక ఆవిరి మీద ఏడెనిమిది నిమిషాలు ఉడికించి తీసుకుంటే చాలు. అంతే, నోరూరించే శ్రీలంక ఫేమస్ "లవారియా స్వీట్" రెసిపీ రెడీ అవుతుంది!
  • ఈ స్వీట్ రుచిలో వహ్వా అనిపించటమే కాదు ఆవిరి మీద ఉడుకుతాయి కాబట్టి ఆరోగ్యానికీ ఎంతో మంచిది!
  • మరి, నచ్చితే మీరు ఎప్పుడు రెగ్యులర్ రెసిపీలు కాకుండా ఓసారి వెరైటీగా లవారియాను ట్రై చేయండి. ఇంటిల్లిపాదీ సరికొత్త రుచిని ఆస్వాదించామన్నా ఫీలింగ్ పొందుతారు.

బూందీ గరిటె లేకుండా "మోతీచూర్​ లడ్డూలు" - దీపావళికి చేసుకోండి, ఇట్టే నచ్చేస్తాయి!