ETV Bharat / offbeat

శ్రీకాకుళం స్పెషల్ "గూన పులుసు" - నోటికి పుల్లగా, తియ్యగా, కారంగా!

ఘుమఘుమలాడే గూన పులుసు - ఈ పద్ధతిలో చేస్తే ఇష్టంగా తింటారు!

Guna Pulusu
Guna Pulusu (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : January 8, 2026 at 5:08 PM IST

2 Min Read
Choose ETV Bharat

Guna Pulusu Recipe : రోజూ ఒకే రకమైన కర్రీలు, పులుసు, చారు తిన్నా బోర్ కొడుతుంది. అలాంటి వారికోసమే అద్భుతమైన రుచితో నోరూరించే ఒక స్పెషల్ రెసిపీని ఈరోజు తీసుకొచ్చాం. దీన్ని ఒక్కసారి రుచి చూశారంటే మళ్లీమళ్లీ చేసుకోవాలనిపిస్తుంది. ఇది నోటికి పుల్లగా, తియ్యగా, కారంగా ఉంటుంది. అదే శ్రీకాకుళం స్పెషల్ గూన పులుసు. మరి ఈ రెసిపీ తయారీకి కావాల్సిన పదార్థాలేంటి? ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూద్దాం.

నోటికి కొత్త రుచినిచ్చే "పాలక్ సోయా బుర్జీ" - కొత్తవాళ్లైనా ఇలా సింపుల్​గా చేసేయొచ్చు!

Guna Pulusu
పనస ముక్కలు (Getty Images)

కావాల్సిన పదార్థాలు :

  • వంకాయలు - 5
  • మునగాకు - ఒక కప్పు
  • మునక్కాయలు - 2
  • ఉల్లిపాయలు - 2
  • టమోటా - 1
  • పనసకాయ ముక్కలు - 1 కప్పు
  • ఉప్పు - రుచికి సరిపడా
  • కారం - 3 టేబుల్ స్పూన్లు
  • పసుపు - అర టీ స్పూన్
  • బెల్లం తురుము - అర కప్పు
  • కరివేపాకు - కొద్దిగా
  • చింతపండు - 30 గ్రాములు
  • బియ్యం - 2 టేబుల్​ స్పూన్లు
  • ధనియాలు - 3 టేబుల్ స్పూన్లు
  • జీలకర్ర - 1 టీ స్పూన్
Guna Pulusu
బెల్లం (Getty Images)

తయారీ విధానం :

  • ముందుగా కావాల్సిన పరిమాణంలో మునగాకులను తుంచి పెట్టుకోవాలి. అలాగే ఐదు వంకాయలు, రెండు ఉల్లిపాయలు, ఒక టమోటా, రెండు మునక్కాయలను తరిగి ఉంచాలి.
  • అలాగే గిన్నెలో 30 గ్రాముల చింతపండు, సరిపడా నీళ్లు పోసి 15 నిమిషాల పాటు నానబెట్టాలి. పదిహేను నిమిషాల తర్వాత చింతపండు రసం తీసి పక్కనుంచాలి.
Guna Pulusu
ఉల్లిపాయ ముక్కలు (Getty Images)
  • మరోవైపు మసాలా పొడి కోసం స్టవ్ ఆన్ చేసి కడాయిలో రెండు టేబుల్ స్పూన్ల బియ్యం వేసి వేయించాలి. బియ్యం​ వేగాక మూడు టేబుల్ స్పూన్ల ధనియాలు, ఒక టీ స్పూన్​ జీలకర్ర యాడ్ చేసి ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ మిశ్రమం చల్లారాక మిక్సీజార్​లోకి తీసుకొని మెత్తని పొడి గ్రైండ్ చేయాలి.
  • ఇంకోవైపు గిన్నెలో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, వంకాయ, టమోటా ముక్కలు వేయాలి. అలాగే కప్పు పనసకాయ ముక్కలు, కప్పు మునగాకు, కొద్దిగా ఉప్పు, అర టీ స్పూన్ పసుపు, మూడు టేబుల్ స్పూన్ల కారం, అర కప్పు బెల్లం తురుము వేసి బాగా మిక్స్ చేయాలి.
  • చివరగా కరివేపాకు, రెండు కప్పుల వాటర్ పోసి కలిపి మూతపెట్టాలి. ఇప్పుడు స్టవ్​పై గిన్నెను ఉంచి మంటను లో ఫ్లేమ్​లో ఉంచి కలుపుతూ ఉడికించాలి.
Guna Pulusu
మునగాకు (Getty Images)
  • కూరగాయ ముక్కలు బాగా ఉడికిన తర్వాత తీసిపెట్టుకున్నచింతపండు రసం యాడ్ చేసి కలపాలి. అదేవిధంగా గ్రైండ్ చేసుకున్న మసాలా పొడిని వేసి మిక్స్ చేసి మూతపెట్టాలి. ఇప్పుడు మంటను లో ఫ్లేమ్ ఉంచి 10 నిమిషాల పాటు ఉడికించాలి.
  • అదేవిధంగా తాలింపు కోసం నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ పోయాలి. నూనె వేడైన తర్వాత ఒక టీ స్పూన్ ఆవాలు, పావు టీ స్పూన్ మెంతులు, అర టీ స్పూన్ జీలకర్ర వేసి వేయించాలి. అలాగే ఒక టీ స్పూన్ ధనియాలు, మూడు ఎండుమిర్చి, ఆరు వెల్లుల్లి రెబ్బలు, కొన్ని ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా కరివేపాకు యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి.
Guna Pulusu
కారం (Getty Images)
  • అనంతరం ఈ తాలింపును రెడీ చేసుకున్న పులుసులో వేసి కలపాలి.
  • అంతే ఘుమఘుమలాడే కమ్మని శ్రీకాకుళం స్పెషల్ గూన పులుసు తయారైనట్లే!

'వావ్' అనిపించే "ఉలవల కారం పొడి" - ఇడ్లీ, దోసెలతో పాటు వేడి వేడి అన్నంలోకి అద్దిరిపోతుంది!

"కరకరలాడే గారెలు, చెక్కలు" - పక్కా కొలతల్లో చేస్తే క్రిస్పీగా వస్తాయి!