ETV Bharat / offbeat

"పిలిస్తే పలికే ఉడతలు" - ఆ ఇంట్లో అవే అతిథులు!

ఉడతలకు కేరాఫ్ అడ్రస్​గా మారిన ఇల్లు - 27 పిల్లలతో సందడే సందడి!

squirrels_in_home
squirrels_in_home (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 20, 2026 at 11:09 AM IST

2 Min Read
Choose ETV Bharat

Squirrels in Home : చెట్ల కొమ్మలపై చాకచక్యంగా పరిగెత్తే ఉడుతలు చూడముచ్చటగా అనిపిస్తాయి. పిల్లలకు వాటిని పట్టుకుని ఆడుకోవాలనిపిస్తుంది. మీకూ అలాగే అనిపిస్తే పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా బురుదవోలుకు వెళ్లండి. అక్కడ అనిత అనే మహిళ ఇంట్లో ఒకటీ రెండు కాదు! ఏకంగా 27 ఉడతలు పసిపాపల్లా పరుగులు పెడుతూ కనిపిస్తాయి. ఉడత పిల్లలకు ఆమె డబ్బాతో పాలు పడుతూ, వాటితో ఆడుకుంటూ మురిసిపోతుంటుంది. అనిత ఇంట్లో ఉడతల సందడికి కారణమేంటో తెలుకుందాం పదండి!

ఊరు మొత్తానికి ఒక్కటే వంటశాల - కరోనా మహమ్మారి ఆ గ్రామాన్ని మర్చిపోయింది!

తనకు ఉడతలను పెంచడం ఇష్టమని అనిత చెప్తోంది. ఒక్కసారి చేరదీస్తే అవి ఇల్లు వదిలి వెళ్లవని, పిల్లలకు గంట గంటకూ ఓఆర్‌ఎస్‌ నీళ్లు, పాలు తాగిస్తానని తెలిపింది. ఇల్లు మొత్తం ఉడతలు సందడి చేస్తూ కనిపిస్తాయి. ఇలాంటి ఘటన చాలా అరుదు అని చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఒక హృద్యమైన సంఘటనకు అనిత ప్రత్యక్ష సాక్షి. 27 ఉడుతలను ప్రేమగా రక్షించి పెంచుతున్న అనిత వాటికి తల్లిలాంటి ప్రేమను అందిస్తూ ఎంతో జాగ్రత్తగా చూసుకుంటోంది.

అలా మొదలైందట!

మా ఇంట్లో చాలా ఉడతలున్నాయి. అవి ఆడుకోవడం, పరిగెత్తడం చూసి ఎంతో మంది ఆనందిస్తున్నారు. అవి ఇంటి మూలలు ఎక్కుతాయి, ఇంట్లోకి ప్రవేశిస్తాయి, ఫర్నిచర్‌పైకి ఎక్కుతాయి, కుటుంబంలో ఒకరిలాగా ఇంట్లో స్వేచ్ఛగా తిరుగుతాయి. వాటిని అడవి జంతువుల్లా చూడకుండా, ప్రేమగా పెంచుకుంటున్నాను అని అనిత వెల్లడించారు.

"ఓ రోజు గాయపడిన తన పిల్లను ఉడత చాలా జాగ్రత్తగా కాపాడడం నేను చూశాను. జంతువులలో కూడా తల్లి ప్రేమను చూడటం నాకు ఆశ్చర్యం కలిగించింది. అక్కడి నుంచే ఈ హాబీ మొదలైంది. మొదట్లో ఒకటి రెండు ఉడతలు వచ్చేవి. వాటికి ప్రేమగా ఆహారం పెట్టేవాళ్లం. వాటిని ఆప్యాయంగా చూసుకునేవాళ్లం. అవి ఏ భయం లేకుండా స్వేచ్ఛగా తిరిగేవి. కాలక్రమేణా, మరిన్ని ఉడతలు మా ఇంట్లో ఆశ్రయం పొందాయి. ఇప్పుడు 27 ఉడతలు ఒక కుటుంబంగా పెరిగాయి. నేనే స్వయంగా పిల్ల ఉడతలకు బాటిల్‌తో పాలు పట్టిస్తాను. వాటికి క్రమం తప్పకుండా ఓఆర్ఎస్ నీళ్లు ఇస్తూ వాటి ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకుంటాను. చిన్న ఉడత పిల్లలకు నిరంతర శ్రద్ధ అవసరం. ముఖ్యంగా వాటి తొలి దశలలో, వాటిని జాగ్రత్తగా చూసుకోవాలి. అవి కోలుకుని ఆరోగ్యంగా పెరగడానికి ప్రతి గంటకు వాటికి ఆహారం పెడతాము. ఉడతలు మా దగ్గర సంరక్షణకు, ఆప్యాయతకు అలవాటు పడ్డాయి. చాలా వరకు అడవికి వెళ్లకుండా శాశ్వతంగా ఇక్కడే తిష్ఠవేశాయి. మా ఇంటి చుట్టూ ఉడతలు నిర్భయంగా తిరగడం, నేను వాటితో సంతోషంగా సమయం గడపడం చూసి ఇరుగుపొరుగు వారు ఆశ్చర్యపోతున్నారు" అని అనిత తెలిపారు.

చిన్న జంతువుల పట్ల అనితకు ఉన్న ప్రేమ, ఆప్యాయత నిజంగా ప్రశంసనీయం. ఆమె జంతు ప్రేమికులకు స్ఫూర్తి. బలహీనమైన జీవులను రక్షించడంలో చూపించే చొరవను ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారు.

"mAadhaar Appకు రిటైర్మెంట్ ప్రకటించిన "UIDAI" - ఇపుడు QR స్కాన్ చేస్తే చాలు!

"హైదరాబాద్ టు విశాఖ, అరకు" - బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో IRCTC టూర్ ప్యాకేజీ