ETV Bharat / offbeat

కుక్కర్​లో స్పైసీ స్పైసీగా అద్దిరిపోయే "చికెన్ కర్రీ" - సండే ఇలా వండితే ఇంటిల్లిపాదీ ఫిదా!

- సరికొత్త పద్ధతిలో నోరూరించే 'చికెన్ కర్రీ' - ఎన్నడూ తినని రుచిని ఎంజాయ్ చేస్తారు!

Chicken Curry in Cooker
Chicken Curry in Cooker (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : February 7, 2026 at 2:44 PM IST

3 Min Read
Choose ETV Bharat

Chicken Curry in Cooker : పిల్లల నుంచి పెద్దల వరకు ఇష్టంగా తినే నాన్​వెజ్ ఐటమ్స్​లో "చికెన్" ముందు వరుసలో ఉంటుంది. ఎంత ఇష్టమైనప్పటికీ ప్రతిసారి ఒకటే తరహాలో వండితే ఏం బాగుంటుంది. అందుకే, మీకోసం ఈ సండే ఒక అద్దిరిపోయే రెసిపీని తీసుకొచ్చాం. రెగ్యులర్​కు భిన్నంగా కుక్కర్​లో క్విక్ అండ్ ఈజీగా చేసుకునే ఈ "చికెన్ కర్రీ" టేస్ట్​ నెక్ట్స్ లెవల్​లో ఉంటుంది. ఇంటిల్లిపాదీ లొట్టలేసుకుంటూ కమ్మగా తినేస్తారు. బ్యాచిలర్స్ కూడా సింపుల్​గా ప్రిపేర్ చేసుకోవచ్చు. తక్కువ పదార్థాలతో స్పైసీ స్పైసీగా, కమ్మగా నిమిషాల్లోనే రెడీ అవుతుంది. మరి, అందుకు కావాల్సిన పదార్థాలు, తయారీ విధానంపై ఇప్పుడు ఓ లుక్కేద్దాం.

Chicken Curry in Cooker
చికెన్ (Getty Images)

కావాల్సిన పదార్థాలు :

మారినేషన్ కోసం :

  • చికెన్ - అర కిలో
  • చికెన్ మసాలా - ఒక టేబుల్​స్పూన్
  • పసుపు - పావు చెంచా
  • ఉప్పు - కొద్దిగా
  • పెరుగు - పావు కప్పు
  • అల్లంవెల్లుల్లి పేస్ట్ - ఒక టేబుల్​స్పూన్
  • నిమ్మరసం - కొద్దిగా
Chicken Curry in Cooker
అల్లం (Getty Images)

కర్రీ కోసం :

  • నూనె - మూడు టేబుల్​స్పూన్లు
  • ఉల్లిపాయ - ఒకటి (పెద్దసైజ్​ది)
  • టమాటాలు - రెండు
  • పచ్చిమిర్చి - మూడ్నాలుగు
  • కరివేపాకు - కొద్దిగా
  • చికెన్ మసాలా - రెండు టేబుల్​స్పూన్లు
  • కొత్తిమీర తరుగు - కొద్దిగా

తక్కువ మసాలాలతో "తోటకూర చికెన్ కర్రీ" - అల్టిమేట్ టేస్ట్​తో అద్దిరిపోతుంది!

Chicken Curry in Cooker
ఉల్లిపాయలు (Getty Images)

తయారీ విధానం :

  • ఈ రెసిపీ కోసం ముందుగా చికెన్​ను మారినేట్ చేసుకోవాలి. ఇందుకోసం ముందుగా ఒక గిన్నెలో చికెన్​ను తీసుకుని శుభ్రంగా కడగాలి.
  • తర్వాత అందులో చికెన్ మసాలా, పసుపు, కాస్త ఉప్పు, పెరుగు, తాజా అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి.
  • అలాగే, రెండు టేబుల్​స్పూన్ల నూనె, కొద్దిగా నిమ్మరసం కూడా యాడ్ చేసుకుని ఆ పదార్థాలన్నీ చికెన్ ముక్కలకు పట్టేలా బాగా కలుపుకోవాలి.
  • ఆవిధంగా బాగా కలిపిన తర్వాత గిన్నెపై మూత ఉంచి అరగంట పాటు పక్కనుంచాలి.
Chicken Curry in Cooker
పెరుగు (Getty Images)
  • ఆలోపు కర్రీలోకి అవసరమైన ఉల్లిపాయ, టమాటాలను శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. అలాగే, పచ్చిమిర్చీలను చీలికలుగా కట్ చేసుకుని పక్కనుంచాలి.
  • అనంతరం స్టవ్ మీద కర్రీ తయారీకి కుక్కర్ గిన్నె ఉంచి అందులో మూడ్నాలుగు టేబుల్​స్పూన్లు నూనె వేసి వేడి చేసుకోవాలి.
  • ఆయిల్ కాగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ తరుగు, పచ్చిమిర్చి చీలికలు, కరివేపాకు వేసి ఆనియన్స్ రంగు మారి మెత్తబడే వరకు కలుపుతూ బాగా వేయించుకోవాలి.
  • ఉల్లిపాయ ముక్కలు సాఫ్ట్​గా వేగాక టమాటా ముక్కలను యాడ్ చేసుకుని అవి గుజ్జు మారేంత వరకు వేయించాలి. అందుకోసం 10 నుంచి 15 నిమిషాల వరకు సమయం పట్టొచ్చు.
Chicken Curry in Cooker
టమాటాలు (Getty Images)
  • టమాటాలు బాగా మగ్గి గుజ్జుగా అయ్యాక అందులో మారినేట్ చేసి అరగంట పాటు పక్కనుంచిన చికెన్ ముక్కలను వేసి హై-ఫ్లేమ్​లో పది నిమిషాలు కలుపుతూ వేయించుకోవాలి. అలా వేయించడం ద్వారా చికెన్ ముక్కల్లోని నీరంతా ఇగిరిపోతుంది.
  • ఆవిధంగా వేయించుకున్నాక అందులో రెండు టేబుల్​స్పూన్ల చికెన్ మసాలాను జత చేసి ఒకసారి అంతా బాగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి.
  • ఆ తర్వాత ముప్పావు కప్పు వేడి నీళ్లు పోసుకుని మరోసారి బాగా కలిపి కుక్కర్ మూతపెట్టి మీడియం ఫ్లేమ్​లో రెండు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి.
Chicken Curry in Cooker
నిమ్మరసం (Getty Images)
  • రెండు విజిల్స్ పాటు ఉడికించుకున్నాక కుక్కర్​లోని ప్రెషర్ మొత్తం పోయాక మూత తీసి ఒకసారి బాగా కలపాలి.
  • తర్వాత మూత లేకుండా మరో ఐదారు నిమిషాలు హై-ఫ్లేమ్​లో ఉడికించుకోవాలి.
  • అలా ఉడికించిన తర్వాత చివర్లో కొద్దిగా కొత్తిమీర తరుగు వేసుకుని కలిపి దింపేసుకుటే సరి.
  • అంతే, కుక్కర్​లో ఘుమఘుమలాడే "చికెన్ క్రరీ" చాలా క్విక్ అండ్ ఈజీగా రెడీ అవుతుంది!
  • ఒకవేళ మీరు ఎక్కువ క్వాంటిటీలో చికెన్ కర్రీ చేసుకోవాలనుకుంటే చికెన్​తో పాటు ఇతర పదార్థాలను పెంచి తీసుకుంటే సరిపోతుంది.

కరివేపాకుతో కమ్మని "మసాలా ఎగ్​ ఫ్రై" - సూపర్​ టేస్టీగా ఉంటుంది - అన్నంలోకి అదుర్స్​!

ఎప్పుడైనా మెంతికూరతో "ఎగ్ కర్రీ" ట్రై చేశారా? - ఎన్నడూ తినని రుచితో సూపర్​గా​ ఉంటుంది!