ETV Bharat / offbeat

తిరుమల వెళ్లే భక్తులకు గుడ్​న్యూస్ - ఆ తేదీల్లో 'చర్లపల్లి, తిరుచానూరు' మధ్య ప్రత్యేక రైళ్లు!

ప్రత్యేక రైళ్లు ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే - తెలుగు రాష్ట్రాల్లో హాల్ట్ స్టేషన్లు ఇవే!

SCR Special Trains List
ప్రత్యేక రైలు (Getty Images)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : September 2, 2026 at 1:11 PM IST

|

Updated : September 3, 2026 at 9:34 AM IST

3 Min Read
Choose ETV Bharat

SCR Special Trains List : తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లేవారికి గుడ్​న్యూస్. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని చర్లపల్లి నుంచి తిరుచానూర్ మార్గంలో ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు ప్రకటించింది దక్షిణ మధ్య రైల్వే. ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరారు. మరి, ఈ స్పెషల్ ట్రైన్స్ ఏ ఏ తేదీల్లో నడవనున్నాయి? తెలుగు రాష్ట్రాల్లో హాల్ట్ స్టేషన్లు ఎక్కడెక్కడ ఉన్నాయి? వంటి పూర్తి వివరాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం.

ప్రత్యేక రైళ్ల తేదీలు, హాల్ట్ స్టేషన్ల వివరాలిలా :

ట్రైన్ నంబర్ 07025 చర్లపల్లి నుంచి తిరుచానూరు :

ఈ స్పెషల్ ట్రైన్ సెప్టెంబర్ 4, 2026 శుక్రవారం నాడు తెలంగాణలో చర్లపల్లి స్టేషన్ నుంచి తిరుపతి సమీపంలోని తిరుచానూరుకు బయలుదేరుతుంది. ఈ మార్గంలో ఒక సర్వీసును నడపనున్నారు.

ట్రైన్ నంబర్ 07026 తిరుచానూరు నుంచి చర్లపల్లి :

తిరుగు ప్రయాణంలో ఈ స్పెషల్ ట్రైన్ సెప్టెంబర్ 5, 2026 శనివారం నాడు తిరుచానూరు నుంచి చర్లపల్లికి ప్రయాణించనుంది. ఈ రైలూ ఈ మార్గంలో ఒక సర్వీసుగా ప్రయాణికులకు అందుబాటులో ఉండనున్నట్లు తెలిపారు రైల్వే అధికారులు.

ఈ స్పెషల్ ట్రైన్స్ రెండు దిశలలోనూ మార్గమధ్యంలో ప్రయాణికులకు అనువుగా పలు ముఖ్యమైన రైల్వే స్టేషన్లలో ఆగుతాయి. తెలంగాణలోని నల్లగొండ, మిర్యాలగూడ, ఏపీలోని గుంటూరు, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లురూ, రేణిగుంట స్టేషన్లలో ఆగనున్నట్లు అధికారులు తెలిపారు. అంటే, తిరుమలకు వెళ్లాలనుకునేవారు, ఆ మార్గంలో ఉన్న ఇతర ప్రాంతాలకు వెళ్లాలనుకునే ప్రయాణికులు పైన పేర్కొన్న స్టేషన్లలో ఈ ప్రత్యేక రైలు ఎక్కవచ్చు లేదా దిగవచ్చు.

ఈ ప్రత్యేక రైళ్లలో అన్ని వర్గాల ప్రయాణికులను దృష్టిలో ఉంచుకొని కోచ్‌లను ఏర్పాటు చేశారు. ఇందులో 1AC కమ్ 2AC, స్లీపర్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు అందుబాటులో ఉంటాయని ఒక ప్రకటనలో తెలిపింది దక్షిణ మధ్య రైల్వే. ప్రయాణికులు తమ బడ్జెట్​కు తగ్గట్లుగా ఈ సీట్లను రిజర్వ్ చేసుకోవచ్చు. ఈ ప్రత్యేక సర్వీసులు తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్లే భక్తులతో పాటు, కోస్తాంధ్ర ప్రాంతాలకు వెళ్లాలనుకునే వారికి మంచి అవకాశం. కాబట్టి, చర్లపల్లి టు తిరుచానూరు మార్గంలో ప్రయాణించేవారు ఈ అవకాశాన్ని వినియోగించుకుని, తమ ప్రయాణాలను ముందుగానే ప్లాన్ చేసుకోవాలని కోరారు రైల్వే అధికారులు.

రైలు ప్రయాణం పెట్టుకున్నారా? - భారీగా రైళ్ల దారి మళ్లింపు, వేళల్లో మార్పులు!

రెండ్రోజుల పాటు 'తిరుపతి-రక్సల్' రైలు రద్దు!

సౌత్ ఈస్టర్న్ రైల్వే పరిధిలో నాన్-ఇంటర్‌లాకింగ్(NI) పనుల కారణంగా తిరుపతి-రక్సౌల్​ జంక్షన్ మార్గంలో ప్రయాణించే ట్రైన్​ను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది దక్షిణ మధ్య రైల్వే. సౌత్ ఈస్టర్న్ రైల్వేలోని చక్రధర్‌పూర్ డివిజన్ పరిధిలో యార్డ్ పునర్నిర్మాణం, బాగ్దేహి - ఝార్సుగూడ మధ్య 4వ లైన్ ప్రారంభోత్సవానికి సంబంధించి బాగ్దేహి స్టేషన్‌లో నాన్-ఇంటర్‌లాకింగ్ పనులు జరుగుతున్నాయి. ఆ పనుల కారణంగా ఈ రైళ్లు రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు రైల్వే అధికారులు.

రద్దు అయిన రైళ్ల వివరాలు :

  • నవంబర్ 2, 2026వ తేదీన తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి రక్సౌల్ వెళ్లే వీక్లీ ఎక్స్​ప్రెస్ రైలు(ట్రైన్ నంబర్.17433) రద్దు చేశారు.
  • నవంబర్ 05, 2026 నాడు రక్సౌల్ జంక్షన్ నుంచి తిరుపతికి బయలుదేరే రైలును(ట్రైన్ నంబర్.17434) రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.
  • ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించి ఆయా రోజుల్లో తమ ప్రయాణానికి సంబంధించి మార్పులు, చేర్పులు చేసుకోవాల్సిందిగా సూచించారు.

'కాశీ తీర్థ యాత్ర' వెళ్లాలనుకుంటున్నారా? - విజయవాడ మీదుగా 'భారత్​ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్'

'సికింద్రాబాద్ మీదుగా బెంగళూరు' - మరో వీక్లీ ఎక్స్​ప్రెస్ ట్రైన్ రెగ్యులర్!

Last Updated : September 3, 2026 at 9:34 AM IST