ETV Bharat / offbeat

ఇలా చేస్తే "జొన్న రొట్టెలు" పూరీల్లా పొంగుతాయి - గంటల పాటు సూపర్​ సాఫ్ట్​!

జొన్న రొట్టెలు చేయడానికి ఎక్కువ టైమ్ పడుతోందా? - ఈ స్టెప్స్ పాటిస్తే నిమిషాల్లో రెడీ​!

Jowar Roti
Jowar Roti (Getty Images)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : December 28, 2025 at 3:06 PM IST

2 Min Read
Choose ETV Bharat

Jowar Roti Prepare in Telugu : నేటి కాలంలో ఎక్కువ మంది వివిధ రకాల రొట్టెలను ఆహారంలో భాగంగా చేసుకుంటున్నారు. అన్నం కంటే వీటిని ఎక్కువగా తినేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఇందులో జొన్న రొట్టెలు కూడా ఒకటి. అయితే కొంతమందికి వీటిని ప్రిపేర్ చేయడం సరిగ్గా రాదు! ఒకవేళ ఇంట్లో తయారు చేసినా అవి పర్ఫెక్ట్​గా రావని చేసినా కొద్దిసేపటికే గట్టి పడి విరిగిపోతుంటాయని మదనపడుతుంటారు. ఈ నేపథ్యంలోనే బయట నుంచి కొని తెచ్చుకుంటారు.

అలాంటి వారు ఇప్పుడు చెప్పబోయే పద్ధతిని పాటిస్తూ జొన్న రొట్టెలు చేశారంటే మెత్తగా వస్తాయి. ఇవి తినని వారు కూడా కూడా ఎంతో ఇష్టంగా తింటారు. ఈ స్టెప్స్​ పాటిస్తే ఫస్ట్​ టైమ్ చేసే వారు సులభంగా చేసేయచ్చు!అంతేకాదు ఇందులోకి సైడ్ డిష్ లేకుండానే హ్యాపీగా తినేయొచ్చు. ఒకవేళ వెజ్, నాన్​వెజ్ కర్రీలోకి సూపర్​గా ఉంటుంది. పైగా ఇవి తయారు చేయడం చాలా తేలిక! మరి టేస్టీ జొన్న రొట్టెలను ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందామా?

ఘుమఘుమలాడే "హైదరాబాదీ చికెన్ కుర్మా" - ఎన్నడూ తినని టేస్ట్​ని ఎంజాయ్ చేస్తారు!

Jowar Roti
జొన్నపిండి (Getty Images)

కావాల్సిన పదార్థాలు :

  • జొన్నపిండి - 1 కప్పు
  • ఉప్పు- రుచికి సరిపడా

తయారీ విధానం :

  • ముందుగా స్టవ్​ ఆన్​ చేసి గిన్నెలో ముప్పావు కప్పు నీరు, రుచికి సరిపడా ఉప్పు వేసి మరిగించాలి. వాటర్ బాయిల్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేయాలి. ఇందులో కప్పు జొన్నపిండి వేసి బాగా కలిపి మూతపెట్టాలి. జొన్నపిండిని వేడి నీటిలో ఉడికించడం వల్ల పిండి చక్కగా మగ్గి రొట్టెలు మెత్తగా, పొంగుతూ వస్తాయి.
  • ఈ మిశ్రమం కాస్త వేడిగా ఉన్నప్పుడే గిన్నెలో వేసి పది నిమిషాల పాటు బాగా మిక్స్ చేయాలి. ఇలా చేయడం వల్ల రొట్టెలు విరగకుండా సాఫ్ట్​గా వస్తాయి. ఆ తర్వాత పిండిని చిన్నచిన్న ముద్దలుగా చేసుకోవాలి.
  • ఇప్పుడు ఒక్కొ పిండి ముద్దను చపాతీ పీటపై పొడి పిండి చల్లి చేతితో లేదా చపాతీ కర్రతో రొట్టె ఆకారంలో చేసి పక్కనుంచాలి.
Jowar Roti
గిన్నెలో జొన్నపిండి మిశ్రమాన్ని వేసి కలపాలి (ETV Bharat)
  • మరోవైపు స్టవ్ ఆఫ్ చేసి పెనంపై తయారు చేసుకున్న రొట్టెను వేసి రెండు నిమిషాల పాటు అలాగే వదిలేయాలి.
  • జొన్న రొట్టెలు కాలడానికి కొంత సమయం పడుతుంది. అలాగని త్వరగా కాల్చితే రంగు వస్తాయి కానీ, లోపల పిండి ఉడకదు. కాబట్టి నెమ్మదిగా కాల్చుకోవాలి. ఈ రొట్టెలు సరిగ్గా కాలితే పొంగు వస్తాయి.
  • అనంతరం కాల్చిన వైపు కాస్త వాటర్​ చిలకరించాలి. ఆ తర్వాత మరోవైపు టర్న్ చేస్తూ మూడు నిమిషాల పాటు కాల్చుకోవాలి.
Jowar Roti
ఉప్పు (Getty Images)
  • ఇక అంతే వేడివేడి జొన్న రొట్టెలు సిద్ధంగా ఉంటాయి! అనంతరం వీటిని హాట్‌ బాక్స్‌లో పెట్టుకుంటే సరిపోతుంది. ఈ పద్ధతిలో చేయం ఎంత సమయమైనా రొట్టెలు మెత్తగా ఉంటాయి!
  • ఈ జొన్న రొట్టెలను ఏదైనా వెజ్ లేదా నాన్​వెజ్ కర్రీతో తిన్నారంటే వావ్​ అనాల్సిందే!
  • ఇలా ఇంట్లో చేసి పెట్టారంటే పిల్లలు, పెద్దలూ ఎంతో ఇష్టంగా తింటారు.

కమ్మని "కొబ్బరి కారం పొడి" - కర్రీస్​ బోర్ కొడితే ఇదొక్కటి చాలు!

ఇంటిల్లిపాదీకి నచ్చే వెడ్డింగ్ స్టైల్ "సాంబార్" - ఒక్కసారి తింటే 'వన్స్​మోర్' అంటారంతే!