ETV Bharat / offbeat

మినపప్పు లేకుండా "ఇడ్లీలు" - అటుకులతో చేసుకోండి - సాఫ్ట్​ ఇంకా టేస్టీ!

- మీ ఇంట్లో అటుకులు ఉన్నాయా? - ఇలా ఇడ్లీలు చేసుకోండి, కిర్రాక్​గా ఉంటాయి!

Soft and Tasty Idli with Poha
Soft and Tasty Idli with Poha (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : December 6, 2025 at 12:41 PM IST

3 Min Read
Choose ETV Bharat

Soft and Tasty Idli with Poha: ఇడ్లీలు తినడానికి ఎంత బాగుంటాయో వాటిని ఇంట్లో ప్రిపేర్​ చేసుకోవాలనుకుంటే అంత కష్టపడాలి. ఎందుకంటే ముందుగానే పప్పు నానబెట్టుకోవాలి. నానిన తర్వాత గ్రైండ్​ చేసి అందులో రవ్వ కలిపి సుమారు 8 గంటల పాటు పులియబెట్టాలి. పిండి పులిసిన తర్వాత మిగిలినా ప్రాసెస్​ చేసుకోవాలి. ఇదంతా లాంగ్​ ప్రాసెస్​ కాబట్టి చాలా మంది ప్రస్తుతం ఇన్​స్టంట్​ ఇడ్లీల వైపు మొగ్గు చూపుతున్నారు. మరి, మీరు కూడా తొందరగా అయిపోయే ఇడ్లీ రెసిపీ కోసం వెయిట్​ చేస్తున్నారా? అయితే ఓ అద్భుతమైన రెసిపీ మీకోసం తీసుకొచ్చాం. అందుకోసం మినప్పప్పు అవసరం లేదు. అటుకులు ఉంటే సరిపోతాయి. అంతేకాకుండా పిండిని గంటల పాటు పులియబెట్టాల్సిన పనిలేదు. మరి, లేట్​ చేయకుండా ఇన్​స్టంట్​ ఇడ్లీలు ఎలా చేసుకోవాలో చూసేయండి.

Idli with Poha
అటుకులు (Getty Images)

కావాల్సిన పదార్థాలు:

  • అటుకులు - 1 కప్పు
  • పెరుగు - 1 కప్పు
  • ఇడ్లీ రవ్వ - ఒకటిన్నర కప్పులు
  • ఉప్పు - రుచికి సరిపడా
  • బేకింగ్​ సోడా - అర టీస్పూన్​
Idli with Poha
పెరుగు (Getty Images)

తయారీ విధానం:

  • మిక్సీజార్​లోకి అటుకులు తీసుకుని మరీ, మెత్తగా కాకుండా కాస్త బరకగా ఉండేలా గ్రైండ్​ చేసుకుని గిన్నెలోకి తీసుకోవాలి.
  • ఇప్పుడు అటుకుల పొడిలోకి పెరుగు వేసి అంతా కలిసేలా మిక్స్​ చేసుకోవాలి.
  • అటుకుల పొడి, పెరుగు బాగా కలిసిన తర్వాత గిన్నెను పక్కన పెట్టాలి.
  • మరో గిన్నెలోకి ఇడ్లీ రవ్వ తీసుకుని నీళ్లు పోసుకుంటూ రెండు మూడు సార్లు శుభ్రంగా కడగాలి.
  • రవ్వను బాగా కడిగినాక కొద్దికొద్దిగా తీసుకుంటూ గట్టిగా పిండుతూ రవ్వలోని ఎక్సెస్​ వాటర్​ను తీసేసుకుని అటుకుల మిక్స్​లోకి వేసుకోవాలి.
Idli with Poha
బొంబాయి రవ్వ (Getty Images)
  • ఇలా రవ్వ మొత్తాన్ని నీళ్లు లేకుండా ప్రెస్​ చేస్తూ అటుకుల పిండిలో వేసుకుని కలుపుకోవాలి.
  • ఇప్పుడు రెండు కప్పుల వాటర్​ పోసి అస్సలు ఉండలు లేకుండా అంతా కలిసేలా మిక్స్​ చేసుకుని మూత పెట్టి ఓ అరగంట సేపు పక్కన పెట్టాలి.
  • ఇడ్లీ రవ్వ నానిన తర్వాత మూత తీసి చూస్తే మిశ్రమం కాస్త గట్టిపడుతుంది.
  • అప్పుడు కొద్దికొద్దిగా వాటర్​ పోసుకుంటూ ఇడ్లీ పిండి కన్సిస్టెన్సీ వచ్చేలా మిక్స్​ చేసుకోవాలి.
  • స్టవ్​ ఆన్​ చేసి ఇడ్లీ పాత్ర పెట్టి రెండు గ్లాసుల నీళ్లు పోసి మూత ఉంచి మరిగించాలి. ఈలోపు ఇడ్లీ పిండిలోకి రుచికి సరిపడా ఉప్పు, బేకింగ్​ సోడా వేసి మిక్స్​ చేసుకోవాలి.
Idli with Poha
అటుకుల ఇడ్లీలు (Getty Images)
  • ఇడ్లీ ప్లేట్స్​కు ఆయిల్​ లేదా నెయ్యి అప్లై చేసి ప్రిపేర్​ చేసుకున్న పిండిని వేసుకోవాలి. ఇడ్లీ పాత్రలోని వాటర్​ బాయిల్​ అవుతున్నప్పుడు ఈ ప్లేట్స్​ ఉంచి మూత పెట్టి ఉడికించుకోవాలి.
  • మీడియం ఫ్లేమ్​లో 15 నిమిషాల పాటు కుక్​ చేసుకున్న తర్వాత మూత తీసి ఇడ్లీలు ఉడికాయో లేదో చెక్​ చేసుకోవాలి. ఇడ్లీలు పర్ఫెక్ట్​గా ఉడికిన తర్వాత స్టవ్​ ఆఫ్​ చేసి ఇడ్లీ ప్లేట్స్​ పక్కన పెట్టాలి.
  • ఓ 5 నిమిషాల తర్వాత స్పూన్​ లేదా చేతిని తడి చేసుకుంటూ తీసేసి మీకు నచ్చిన చట్నీతో సర్వ్​ చేసుకుంటే ఎంతో టేస్టీ అండ్​ మృదువుగా ఉండే ఇడ్లీలు రెడీ. నచ్చితే మీరూ ట్రై చేయండి.
Idli with Poha
అటుకుల ఇడ్లీలు (ETV Bharat)

చిట్కాలు:

  • అటుకులు, పెరుగు, ఇడ్లీ రవ్వ, నీళ్లు ఇలా అన్ని పదార్థాలను ఒకే కప్పు కొలత ప్రకారం తీసుకోవాలి.
  • పుల్లటి పెరుగు అయితే ఇడ్లీలు టేస్టీగా ఉండటంతో పాటు పిండి కూడా పర్ఫెక్ట్​గా పులుస్తుంది.
  • బేకింగ్​ సోడాను ముందే వేయకూడదు. అప్పటికప్పుడు వేసి కలిపి ప్లేట్స్​లో వేసి ఆవిరికి ఉడికించాలి.

ఇంటిల్లిపాదీ ఇష్టంగా తినేలా "ఉప్మా" - రవ్వ లేకుండానే నిమిషాల్లో రెడీ!

ఆంధ్ర స్టైల్​ "దొండకాయ పచ్చడి" - పచ్చిమిర్చి, పల్లీలతో అద్దిరిపోద్ది!