'సిలికాన్ గిన్నెలు' ఎంత క్లీన్ చేసినా జిడ్డు పోవట్లేదా? - ఈ సూపర్ ట్రిక్స్ మీకోసమే!
సిలికాన్ గిన్నెలు వాసన వస్తున్నాయా? - ఇలా క్లీన్ చేస్తే ప్రాబ్లమ్ సాల్వ్ అంటున్న నిపుణులు!

By ETV Bharat Andhra Pradesh Team
Published : October 11, 2026 at 5:08 PM IST
Silicone Bowls Cleaning Hacks : నేటి ఆధునిక వంటగదిలో సిలికాన్ పాత్రలు ఒక ట్రెండ్ సెట్టర్. ప్లాస్టిక్‌లా ముక్కలవ్వవు, గాజులా పగిలిపోవు! అలాగే, చూడటానికి బాగుంటాయని, గీతలు పడవని చాలా మంది ఈ పాత్రలంటే ఇష్టపడుతుంటారు. అయితే, సిలికాన్‌తో తయారైన పాత్రల వాడకం ఒకెత్తయితే, వాటి క్లీనింగ్ మరో ఎత్తు. ఎందుకంటే వీటికి ఒక వింత అలవాటు ఉంటుంది. ఇవి ఆహారంలోని నూనె జిడ్డును, మసాలా వాసనలను స్పాంజ్‌లాగా పీల్చేసుకుని గట్టిగా పట్టుకుంటాయి. సరిగ్గా క్లీన్ చేయకపోతే వాటిపై ఒక తెల్లటి జిడ్డు పొర పేరుకుపోయి, చూడటానికే నచ్చవు. మీరు సిలికాన్ బౌల్స్ క్లీనింగ్ విషయంలో ఇలాంటి ఇబ్బందే ఎదుర్కొంటున్నారా? అయితే, ఓసారి నిపుణులు సూచిస్తున్న ఈ టిప్స్ ట్రై చేసి చూడండి.
మనలో చాలా మంది పిండి కలపడానికైనా, పాన్‌కి నూనె రాయడానికైనా సిలికాన్‌తో తయారైన స్పాచ్యులా, బ్రష్, బౌల్స్ వంటివి ఉపయోగిస్తుంటారు. అయితే, ఇవి మొదట్లో కొత్తగా, శుభ్రంగానే కనిపిస్తాయి. కానీ, కొన్ని రోజులు వాడిన తర్వాత ఎంత కడిగినా జిడ్డు వదలకుండా ఒకరకమైన వాసన వస్తుంటాయి. వీటిని క్లీన్ చేయడానికి డిష్‌వాష్ లిక్విడ్, సబ్బులు వాడితే ఆ రోజుకి బానే అనిపించినా తర్వాత మళ్లీ మామూలే. అందుకే, మీ కోసం కొన్ని సూపర్ టిప్స్ తీసుకొచ్చాం. ఇవి ప్రయత్నించారంటే సిలికాన్ పాత్రలు వాసనలు పోయి తళతళా మెరుస్తాయంటున్నారు నిపుణులు.
కాఫీ పొడి :
ఇది చెడు వాసనల్ని పోగొట్టడంలో చాలా బాగా సహాయపడుతుంది. కాబట్టి, సిలికాన్ గిన్నెల విషయంలో ఈ టిప్ మంచి ఫలితాన్ని ఇస్తుందంటున్నారు నిపుణులు. దీనికోసం ముందుగా ఒక పెద్ద సంచి లేదా డబ్బాలో సిలికాన్ గిన్నెలు, చెంచాలను ఉంచాలి. తర్వాత అందులో కాఫీ పౌడర్, కాఫీగింజలు వేసి రాత్రి మొత్తం అలాగే వదిలేయాలి. కాఫీలోని సువాసనలు సిలికాన్ రంధ్రాల్లో మిగిలిన చెడువాసనల్ని పీల్చుకుని పాత్రల్ని తాజాగా ఉంచుతాయని చెబుతున్నారు.
మంటను బట్టే 'స్టవ్' సరిగా పనిచేస్తుందో లేదో చెప్పేయొచ్చు! - ఏ రంగు దేనికి సూచికంటే?
బేకింగ్ సోడా :
ఈ టిప్ కూడా సిలికాన్ పాత్రల వాసనలను పోగొట్టడంలో ఎఫెక్టివ్‌గా పనిచేస్తుందంటున్నారు నిపుణులు. దీనికోసం ఒక గిన్నెలో కొద్దిగా బేకింగ్ సోడా తీసుకుని, కాస్త వాటర్ వేసి కలిపి చిక్కని పేస్టులా రెడీ చేసుకోవాలి. అనంతరం దాన్ని సిలికాన్ పాత్రలకు పట్టించి రెండు మూడు గంటలు వదిలేయాలి. ఆ తర్వాత శుభ్రమైన వాటర్‌తో క్లీన్ చేసుకుంటే చాలు. మొండి జిడ్డు, చెడు వాసన పోవడమే కాకుండా కొత్త వాటిలా మెరుస్తాయంటున్నారు.
వెనిగర్ :
వైట్ వెనిగర్ కూడా సిలికాన్ పాత్రల జిడ్డు, వాసనల్నీ బాగా వదిలిస్తుందంటున్నారు. ఇందుకోసం అరకప్పు వెనిగర్‌ను బకెట్ నీటిలో కలపాలి. తర్వాత అందులో పాత్రలను ఓ అరగంట పాటు నానబెట్టాలి. తర్వాత మంచినీటితో కడిగి గాలికి ఆరనిస్తే సరిపోతుందంటున్నారు.
టీపొడి :
చాలా మంది టీపొడిని వాడిన తర్వాత బయట పడేస్తుంటారు. కానీ, మీకు తెలుసా? వాడిన టీపొడి సిలికాన్ పాత్రల క్లీనింగ్‌కు చాలా బాగా యూజ్ అవుతుందంటున్నారు నిపుణులు. ఇందుకోసం వాడిన టీపొడిని బాగా ఎండబెట్టి టిష్యూ లేదా పేపరులో చుట్టి సిలికాన్ పాత్రల్లో ఉంచాలి. అది గిన్నెల్లో ఉండే తేమను, దుర్వాసనను పీల్చుకుని ఫ్రెష్‌గా ఉంచుతుందంటున్నారు. ఇవి మాత్రమే కాకుండా నిమ్మరసంలో కొద్దిగా ఉప్పు కలిపి ఆ మిశ్రమంతో సిలికాన్ గిన్నెలను క్లీన్ చేసినా, పాత్రలు తళతళా మెరుస్తాయంటన్నారు నిపుణులు.
పాత ఇంటికి కొత్త 'లగ్జరీ' లుక్! - ఈ చిన్న మార్పులు ట్రై చేయండి!
స్వచ్ఛమైన బెల్లం ఎలా ఉంటుంది? - ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలి?

