ETV Bharat / offbeat

ఘుమఘుమలాడే వాసనతో "ఉల్లి సాంబార్​" - ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ చేసుకుంటారు​!

నోరూరించే సాంబార్ రెసిపీ - ఇలా చేస్తే ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే!

Onion Sambar
Onion Sambar (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : February 17, 2026 at 2:08 PM IST

3 Min Read
Choose ETV Bharat

Onion Sambar Preparation in Telugu : వేడివేడి అన్నంలోకి సాంబార్​ ఉంటే ఇంకో రెండు ముద్దలు ఎక్కువగానే లాగిస్తారు. దీనిని వివిధ రకాలుగా ప్రిపేర్ చేస్తుంటారు. అలాంటి వారి కోసమే ఇవాళ ఉల్లి సాంబార్ రెసిపీని తీసుకొచ్చాం. ఈ స్టెప్స్​ పాటిస్తూ చేశారంటే ఇళ్లంతా ఘుమఘుమలాడాల్సిందే. మరి ఈ రెసిపీ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం.

నోటికి కొత్త రుచినిచ్చే "టమోటా మెంతి సోయా కర్రీ" - కొత్తవాళ్లైనా ఇలా సింపుల్​గా చేసేయొచ్చు!

Onion Sambar
కందిపప్పు (Getty Images)

కావాల్సిన పదార్థాలు :

  • కందిపప్పు - అర కప్పు
  • ధనియాలు - ఒకటిన్నర టీ స్పూన్
  • జీలకర్ర - 1 టీ స్పూన్
  • మెంతులు - చిటికెడు
  • మిరియాలు - అర టీ స్పూన్
  • ఎండుమిర్చి - 6
  • కరివేపాకు - కొద్దిగా
  • ఆయిల్ - 3 టేబుల్ స్పూన్లు
  • ఆవాలు - అర టీ స్పూన్
  • మినపప్పు - అర టీ స్పూన్
  • శనగపప్పు - అర టీ స్పూన్
  • వెల్లుల్లి రెబ్బలు - 5
  • చిన్న ఉల్లిపాయలు - ఒక కప్పు
  • పచ్చిమిర్చి - 2
  • టమోటా - 1
  • చింతపండు - 20 గ్రాములు
  • ఉప్పు - 1 టీ స్పూన్
  • ఇంగువ - పావు టీ స్పూన్
  • కొత్తిమీర - కొంచెం
Onion Sambar
చిన్న ఉల్లిపాయలు (Getty Images)

తయారీ విధానం :

  • ముందుగా కుక్కర్​లో అర కప్పు కందిపప్పు వేసి శుభ్రంగా కడగాలి. ఇందులోనే రెండు కప్పుల నీళ్లు పోసి మూతపెట్టాలి. ఇప్పుడు కుక్కర్​ను స్టవ్​పై పెట్టి మంటను మీడియం ఫ్లేమ్​లో ఉంచి ఐదు విజిల్స్ వచ్చేవరకు ఉడికించాలి. ఐదు విజిల్స్ వచ్చిన అనంతరం పప్పును, పప్పు గుత్తితో మెత్తగా రుబ్బుకోవాలి.
  • అదేవిధంగా ఓ చిన్న గిన్నెలో 20 గ్రాముల చింతపండు, సరిపడా నీళ్లు పోసి 10 నిమిషాల పాటు నానబెట్టాలి. పది నిమిషాల అనంతరం రసం తీసి పక్కనుంచాలి.
Onion Sambar
చింతపండు (Getty Images)
  • ఇంకోవైపు స్టవ్ ఆన్ చేసి పాన్​లో ఒకటిన్నర టీ స్పూన్ ధనియాలు, అర టీ స్పూన్ జీలకర్ర, చిటికెడు మెంతులు వేయాలి. అదేవిధంగా అర టీ స్పూన్ మిరియాలు, నాలుగు ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు యాడ్ చేసి వేయించాలి. ఈ మిశ్రమం వేగిన తర్వాత మిక్సీజార్​లో వేసి మెత్తని పొడిలా గ్రైండ్ చేయాలి.
  • అలాగే స్టవ్ ఆన్ చేసి కడాయిలో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ పోయాలి. నూనె వేడైన తర్వాత అర టీ స్పూన్ ఆవాలు, అర టీ స్పూన్ జీలకర్ర, అర టీ స్పూన్ మినపప్పు వేయాలి. ఇందులోనే అర టీ స్పూన్ శనగపప్పు, రెండు ఎండుమిర్చి, ఐదు వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసి వేయించాలి. అలాగే కప్పు చిన్న ఉల్లిపాయలు, రెండు పచ్చిమిర్చి వేసి వేగనివ్వాలి.
Onion Sambar
ఎండుమిర్చి (Getty Images)
  • ఈ మిశ్రమం వేగిన తర్వాత అర టీ స్పూన్ పసుపు, కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కలు వేసి మిక్స్ చేయాలి. ఇప్పుడు మూతపెట్టి మంటను లో ఫ్లేమ్​లో ఉంచి టమోటా మిశ్రమాన్ని రెండు నిమిషాల పాటు మగ్గించాలి.
  • రెండు నిమిషాల అనంతరం గ్రైండ్ చేసుకున్న మసాలా పొడి వేసి కలపాలి. ఇప్పుడు తీసి పెట్టుకున్న చింతపండు రసం, ఒక టీ స్పూన్ ఉప్పు, ముప్పావు లీటర్ నీళ్లు యాడ్ చేసి మిక్స్ చేయాలి.
Onion Sambar
జీలకర్ర (Getty Images)
  • ఆ తర్వాత ఉడికించిన పప్పు మిశ్రమాన్ని వేసి కలపాలి. అనంతరం మూతపెట్టి మంటను మీడియం ఫ్లేమ్​లో ఉంచి ఆరు నిమిషాల పాటు మరిగించాలి.
  • ఇంకోవైపు తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసి పాన్​లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ పోయాలి. నూనె వేడైన తర్వాత పావు టీ స్పూన్ ఇంగువ, కొద్దిగా కరివేపాకు వేసి వేయించాలి
  • ఈ తాలింపును మరుగుతున్న సాంబార్ మిశ్రమంలో వేసి కలపాలి. ఆపైన కొద్దిగా కొత్తిమీర తరుగు యాడ్ చేసి మిక్స్ చేయాలి.
  • అంతే ఘుమఘుమలాడే ఉల్లి సాంబార్ మీ ముందుంటుంది!
  • ఈ రెసిపీ వేడివేడి అన్నంతో పాటు టిఫిన్స్​లోకి పర్ఫెక్ట్​గా ఉంటుంది!

టిఫిన్ సెంటర్ స్టైల్ "చట్నీ" - ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోండిలా!

లంచ్​లోకి ఏం చేయాలో తోచనపుడు ఇలా ట్రై చేయండి - పిల్లలు, పెద్దలు టేస్టీగా తింటారు!