ETV Bharat / offbeat

టిఫిన్ ఏదైనా సరే టమోటా కారంతో కమ్మగా తినేయొచ్చు - చట్నీ, పల్లీలు అవసరమే లేదు!

ఇడ్లీ, దోసె, వడ ఏ టిఫిన్ అయినా సరే - చట్నీ ఈజీగా ఇలా చేసుకోవచ్చు!

tomato_chutney
tomato_chutney (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : December 17, 2025 at 9:46 AM IST

2 Min Read
Choose ETV Bharat

TOMATO CHUTNEY : ఉదయం అల్పాహారంలో దాదాపు ప్రతి ఇంట్లో ఇడ్లీ, దోసె, గుంతపొంగనాలు సహజమే. అయితే, ఎప్పుడూ పల్లీ చట్నీ కాకుండా ఓ సారి ఇలా టమోటా కారం చేసి పెట్టుకుంటే చాలు! టిఫిన్ ఏదైనా సరే ఎంతో టేస్టీగా తినేయొచ్చు. ఒక్కసారి చేసి ఫ్రిజ్​లో పెట్టుకోవడం వల్ల ఎంతో టైం ఆదా చేసుకోవచ్చు. అత్యవసర పనులు ఉన్నపుడు, టైం లేనపుడు ఇలాంటి చట్నీతో కమ్మగా తినేయొచ్చు. ఇక్కడ ఇచ్చిన విధంగా ఓ సారి టమోటా కారం ట్రై చేసి చూడండి.

సాయంత్రం వేడివేడిగా తినాలనిపిస్తే ఇలా చేసుకోండి! - సింపుల్​గా అప్పటికప్పుడు తయారు చేసుకోవచ్చు!

tomato_chutney
టమోటాలు (Getty images)

కావల్సిన పదార్థాలు :

  • ఎండుమిర్చి - 8
  • వెల్లుల్లి రెబ్బలు - 10
  • ఉల్లిపాయలు - 2
  • టమోటాలు - 4
  • కొత్తిమీర - కొద్దిగా
  • పుదీనా - కొద్దిగా
  • నూనె - 2 టేబుల్ స్పూన్లు
  • ఆవాలు - అర స్పూన్
  • మినప గుండ్లు - అర స్పూన్
  • శనగపప్పు - 1 స్పూన్
  • జీలకర్ర - అర స్పూన్
  • కరివేపాకు - 1 రెమ్మ
  • ఇంగువ - చిటికెడు
tomato_chutney
ఎండు మిర్చి (Getty images)

ఇలా చేయండి

  1. ముందుగా టమోటాలు శుభ్రం చేసి ముక్కలు కట్ చేసి పెట్టుకోండి
  2. పచ్చిమిర్చి కాకుండా ఎండుమిర్చి వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది.
  3. పోపులోకి కొద్దిగా నూనె ఎక్కువగా వేసుకుంటే బాగుంటుంది.
  4. నూనె తేలే వరకు అడుగు మాడకుండా మీడియం ఫ్లేమ్​లో ఉడికించండి.
tomato_chutney
ఆవాలు (Getty images)

తయారీ విధానం :

  • మిక్సీ జార్​లో 8 ఎండుమిర్చి, 10 వెల్లుల్లి రెబ్బలు, 2 ఉల్లిపాయ ముక్కలు వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత శుభ్రం చేసిన టమోటాలను ముక్కలు, కొత్తిమీర, కొద్దిగా పుదీనా కట్ చేసుకుని వేసుకోవాలి. మెత్తగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి.
  • ఇపుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల నూనె పోసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత ఆవాలు, మినప గుండ్లు, శనగపప్పు, జీలకర్ర వేసుకోవాలి. సన్నటి మంటపై వేయించిన తర్వాత కరివేపాకు, కొద్దిగా ఇంగువ వేసుకుని కలపాలి.
tomato_chutney
ఉల్లిపాయలు (Getty images)
  • ఇపుడు కడాయిలోకి గ్రైండ్ చేసిన టమోటా, ఉల్లిపాయ మిశ్రమం వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా పసుపు వేసుకుని కలుపుతూ 5 నిమిషాలు ఉడికించుకోవాలి. మంట మీడియం ఫ్లేమ్​లో పెట్టుకుని ఉడికించుకుంటే టమోటాల్లో నీరు ఇంకి పోయి నూనె తేలుతుంది. ఇలా నూనె తేలే వరకు మూతపెట్టుకుని మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి.
tomato_chutney
వెల్లుల్లి (Getty images)
  • ఇలా రెడీ చేసుకున్న టమోటా కారం ఓ గాజు సీసాలో భద్రం చేసుకుంటే వారం రోజులు నిల్వ ఉంటుంది. ఎప్పుడు కావాలనుకుంటే అపుడు వాడుకోవచ్చు. ఇడ్లీ, దోసెల్లాంటి టిఫిన్లతో పాటు వేడి వేడిగా అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటుంటే అద్భుతంగా ఉంటుంది. ఈ సింపుల్ రెసిపీని ఇదే విధంగా కొత్త వాళ్లైనా సరే ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు.

రాయలసీమ స్టైల్ "చామదుంప కారం పులుసు" - నోటికి కొత్త రుచినిచ్చే ఈ రెసిపీ ఒక్కసారైనా ట్రై చేయాల్సిందే!

నయా స్టైల్ "కరివేపాకు మసాలా ఎగ్ ఫ్రై" - కడుపు నిండా కమ్మగా తినేస్తారు!