నోరూరించే జ్యూసీ జ్యూసీ "బాదుషాలు" - డీప్ ఫ్రై లేకుండా 'పొంగనాల పాన్'లో ఈజీగా చేసుకోండిలా!
- స్వీట్ షాప్ స్టైల్ జ్యూసీ అండ్ టేస్టీ 'బాదుషాలు' - ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోండి!

Published : October 17, 2025 at 4:05 PM IST
Simple Process to Make Badusha : స్వీట్ రెసిపీలలో బాదుషాకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. బయట క్రిస్పీగా, లోపల జ్యూసీ జ్యూసీగా ఉండే వీటిని పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టంగా తింటుంటారు. అలాగే, పెళ్లిళ్లు, ఫంక్షన్స్, ఇతర స్పెషల్ అకేషన్స్ టైమ్‌లో ఏదైనా స్వీట్ పెట్టాలనుకుంటే ఇవి ముందు వరుసలో ఉంటాయి. అయితే, బాదుషాలు తినాలనిపించినప్పుడు చాలా మంది బయట స్వీట్ షాప్స్ నుంచి కొనుగోలు చేస్తుంటారు. ఎందుకంటే వీటిని ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడం టైమ్ టేకింగ్ ప్రాసెస్‌గా భావిస్తుంటారు.
కానీ, మీకు తెలుసా? నూనెలో డీప్ ఫ్రై చేసే అవసరం లేకుండా పొంగనాల పాన్‌లో ఇంట్లోనే సింపుల్‌గా "బాదుషాలు" చేసుకోవచ్చు. ఇవి టేస్ట్‌లోనూ స్వీట్ షాప్స్‌లో దొరికే వాటికి ఏమాత్రం తీసిపోకుండా జ్యూసీ జ్యూసీగా, భలే రుచికరంగా ఉంటాయి. మరి, లేట్ చేయకుండా పొంగనాల పాన్‌లో బాదుషాలను ప్రిపేర్ చేసుకోవడం ఎలాగో ఇప్పుడు చూసేద్దాం.

కావాల్సిన పదార్థాలు :
- నెయ్యి - అరకప్పు (100 గ్రాములు)
- చక్కెర - రెండు టీస్పూన్లు(పిండి కోసం)
- వంటసోడా - అరటీస్పూన్
- మైదా - రెండున్నర కప్పులు(300 గ్రాములు)
- పంచదార - రెండు కప్పులు(400 గ్రాములు)
- యాలకుల పొడి - కొద్దిగా
- నిమ్మరసం - ఒకటీస్పూన్
- నెయ్యి - కొద్దిగా(పాన్‌లో వేసుకోవడానికి)
- సన్నని డ్రైఫ్రూట్స్ తరుగు - గార్నిష్ కోసం
దీపావళి "బూరెలు" ఇలా చేయండి - చక్కగా పొంగుతాయి, సూపర్ టేస్ట్!

తయారీ విధానం :
- ఈ సింపుల్ అండ్ టేస్టీ స్వీట్ రెసిపీ కోసం ముందుగా ఒక గిన్నెలో నెయ్యి, చక్కెర, వంటసోడా తీసుకుని అన్నీ కలిసేలా బీటర్‌తో ఐదు నిమిషాల పాటు బాగా బీట్ చేసుకోవాలి.
- బీటర్ లేనట్లయితే అడుగు ప్లాట్‌గా ఉండే గ్లాసుతో అయినా బీట్ చేసుకోవచ్చు.
- నెయ్యి మిశ్రమం నురగలు నురగలు వచ్చేంత వరకు మంచిగా బీట్ చేసుకున్నాక అందులో మైదాపిండిని వేసుకుని అదంతా పిండికి పట్టేలా లైట్‌గా రబ్ చేస్తూ కలుపుకోవాలి.
- ఆ విధంగా కలిపిన తర్వాత తగినన్ని నీళ్లను కొద్దికొద్దిగా యాడ్ చేసుకుంటూ పిండిని కొంచెం సాఫ్ట్‌గా ఉండేలా కలుపుకోవాలి.

- తర్వాత కలిపిన పిండిముద్దకు రెండు వైపులా కొద్దిగా నెయ్యి అప్లై చేసి అది ఆరిపోకుండా ఏదైనా గిన్నెలోకి తీసుకుని మూత పెట్టి అరగంటపాటు నాననివ్వాలి.
- పిండి నానేలోపు స్టవ్ మీద ఒక పాన్‌లో పంచదార, రెండు కప్పుల నీళ్లు తీసుకుని మీడియం ఫ్లేమ్‌లో కలుపుతూ మరిగించాలి.
- చక్కెర పూర్తిగా కరిగాక స్టవ్‌ను మీడియం ఫ్లేమ్‌లోనే ఉంచి ఆ మిశ్రమం కాస్త జిగురు జిగురు అయ్యేంత వరకు మరగనివ్వాలి. అంటే, తీగ పాకం రాకుండా స్టిక్కీ స్టిక్కీగా ఉండేలా చూసుకోవాలి.
- ఆ కన్సిస్టెన్సీలో మరిగించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకుని అందులో మంచి ఫ్లేవర్ కోసం యాలకుల పొడి, నిమ్మరసం వేసుకుని ఒకసారి కలిపి మూతపెట్టి పక్కనుంచాలి.
దీపావళికి శ్రీలంకన్ "లవారియా" స్వీట్ - ఈ మిఠాయితో పండగ చేసుకుంటారు!

- అనంతరం అరగంట పాటు పక్కనుంచిన పిండి ముద్దను తీసుకుని దానిలో నుంచి కొద్దికొద్దిగా పిండిని తీసుకుంటూ ముందుగా చిన్న ఉండలా చేసుకోవాలి.
- తర్వాత దాన్ని వడలా ఒత్తుకుని మధ్యలో హోల్ పెట్టుకోవాలి. అయితే, వాటిని మరీ పెద్దవిగా కాకుండా పొంగనాల పాన్ గుంతలకు సరిపడా సైజ్‌లో చేసుకోవాలి. ఇలానే, పిండి మొత్తాన్ని చేసుకుని అవి ఆరిపోకుండా వాటిపై క్లాత్ కప్పి పక్కనుంచాలి.
- అనంతరం స్టవ్ మీద పొంగనాల పాన్ పెట్టుకుని గుంతలలో ఒక్కో టీస్పూన్ నెయ్యి వేసుకుని అంతటా స్ప్రెడ్ చేసుకోవాలి.
- పాన్ వేడయ్యాక స్టవ్‌ను లో-ఫ్లేమ్‌లో ఉంచి ముందుగా రెడీ చేసుకున్న బాదుషాలను ఒక్కొక్కటిగా నెయ్యి అప్లై చేసిన గుంతలలో పెట్టుకోవాలి.
- తర్వాత పాన్‌పై మూత ఉంచి అంచులు బాగా ఎర్రగా మారేంత వరకు కాలనివ్వాలి.
- అవి వన్‌సైడ్ మంచిగా కాలిన తర్వాత గరిటెతో మరో వైపునకు తిప్పేసుకుని అటు వైపు కూడా ఎర్రగా కాలనివ్వాలి.

- ఇవి కాలేలోపు ముందుగా చేసుకున్న పాకాన్ని స్టవ్‌పై ఉంచి హీట్ చేసుకోవాలి. హీట్ అయ్యాక ఒక టీస్పూన్ నెయ్యి వేసి కలిపి దింపి పక్కనుంచాలి.
- బాదుషాలు రెండు వైపులా మంచిగా కాలిన తర్వాత బయటకు తీసి వెంటనే వేడి చేసి పెట్టుకున్న పాకంలో వేసి 20 నిమిషాల పాటు నాననివ్వాలి.
- ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయమేమిటంటే, బాదుషాలు, పాకం రెండు వేడిగా ఉండేలా చూసుకోవాలి. అప్పుడే, పాకం బాదుషా లోపలి వరకు వెళ్లి జ్యూసీ జ్యూసీగా ఉంటాయి.
- బాదుషాలు పాకంలో బాగా నానిన తర్వాత పాకం రాకుండా ఒక ప్లేట్లోకి తీసుకుని డ్రైఫ్రూట్స్ తరుగుతో గార్నిష్ చేసుకుని, పైన కొద్దిగా పాకం పోసి సర్వ్ చేసుకోండి.
- అంతే, పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా నోరూరించే "బటన్ బాదుషాలు" రెడీ అవుతాయి!
స్వీట్ షాప్‌కి వెళ్లకుండా - ఇంట్లోనే ఈజీగా చేసుకునే "స్వీట్"! - దీపావళికి పర్ఫెక్ట్!

