ఫారం చికెన్‌తో "నాటు కోడి టేస్ట్" - మసాలా ఇలా ప్రిపేర్ చేసుకుంటే చాలు!
చికెన్ ఇలా కుక్ చేయండి - టేస్ట్ అద్దిరిపోతుంది!
natu_kodi_recipe (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team
Published : January 3, 2026 at 11:22 AM IST
NATU KODI RECIPE : నాటుకోడి టేస్ట్ చాలా బాగుంటుంది. అందుకే చాలా మంది నాటు కోడి దొరికితే పులుసు పెట్టుకుని రుచిని ఆస్వాదిస్తుంటారు. ప్రస్తుతం నాటు కోళ్లు కరువైన నేపథ్యంలో ఫారం కోడిని సైతం నాటు కోడి రుచి వచ్చేలా కుక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇచ్చి విధంగా ఓ సారి ట్రై చేసి చూడండి.

కావల్సిన పదార్థాలు :
- చికెన్ - అర కేజీ
- ఉప్పు - రుచికి సరిపడా
- నిమ్మకాయ - 1
- ధనియాల పొడి- 1 టేబుల్ స్పూన్
- మిరియాలు - అర స్పూన్
- షాజీరా - 1 స్పూన్
- సోంపు - 1 స్పూన్
- లవంగాలు - 3
- యాలకులు - 4
- దాల్చిన చెక్క - 1 ఇంచు ముక్క
- వెల్లుల్లి రెబ్బలు - 12
- అల్లం ముక్క - ఇంచు ముక్క
- నూనె - 4 టేబుల్ స్పూన్లు
- కరివేపాకు - 1 రెమ్మ
- ఉల్లిపాయ - 1
- టమోటాలు - 2
- కారం - 2 స్పూన్లు
- పసుపు - అర స్పూన్
- పచ్చిమిర్చి - 4
- కొత్తిమీర తరుగు - కొద్దిగా

తయారీ విధానం :
- చికెన్ శుభ్రం చేసుకుని ఉప్పు నీటిలో నానబెట్టుకోవాలి. అందులోనే నిమ్మకాయ ముక్కలు వేసుకుని కనీసం 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. ఈ లోగా కర్రీలోకి అవసరమైన మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. మసాలా కోసం మిక్సీ లేదా రోట్లోకి మిరియాలు, షాజీరా, సోంపు, 2 లవంగాలు, 3 యాలకులు, దాల్చిన చెక్క, ఐదారు వెల్లుల్లి రెబ్బలు వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ మసాలాను పక్కన పెట్టుకుని అర ఇంచు అల్లం ముక్క, వెల్లుల్లి రెబ్బలు కూడా మిక్సీ పట్టుకుని తీసుకోవాలి.

- ఇపుడు స్టవ్ పై కడాయి పెట్టుకుని నూనె వేసుకోవాలి. వేడెక్కగానే 1 లవంగా, 2 యాలకులు, కరివేపాకు వేసుకోవాలి. ఆ తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ తరుగు వేసుకుని దోరగా వేయించాలి. మూత పెట్టి 3 నిమిషాలు ఉడికిస్తే చాలు. ఆ తర్వాత టమోటా ముక్కలు వేసుకుని బాగా కలిపి ఐదు నిమిషాలు మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి.

- ఆ తర్వాత అల్లం, వెల్లుల్లి పేస్ట్ వేసుకుని బాగా కలిపి వాసన పోయే వరకు ఉడికించాలి. ఇపుడు నానబెట్టుకున్న చికెన్ లో నీళ్లు తీసేసి కడాయిలో వేసుకుని ముక్కలు బాగా కలపాలి. ఐదారు నిమిషాలు మూతపెట్టి మీడియం ఫ్లేమ్‌లో ఉడికిస్తే చికెన్‌లో ఉన్న నీళ్లు కూడా బయటకు వచ్చేస్తాయి.

- ఇపుడు కారం, ధనియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు, పసుపు వేసుకోవాలి. బాగా కలిపి రెండు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత నీళ్లు పోసి 10 నిమిషాల పాటు సన్నటి మంటపై ఉడికించాలి. ఆ తర్వాత పచ్చిమిర్చి చీలికలు, ముందుగా రెడీ చేసి పెట్టుకున్న గరం మసాలా కూడా వేసి మరో ఐదు నిమిషాలు ఉడికించాలి. చివరగా కొత్తిమీర తరుగు వేసి దించేసుకుంటే ఎంతో రుచిగా ఉంటుంది.
న్యూ ఇయర్ స్పెషల్ "పెప్పర్ చికెన్ ఫ్రై" - 20 నిమిషాల్లో ఇలా ట్రై చేయండి!
బిహారీ స్టైల్ "చికెన్ మసాలా కర్రీ" - ఇలా చేస్తే ఇంట్లో పండగే!
"న్యూ ఇయర్ స్పెషల్ చికెన్ ఫ్రై" - రెస్టారెంట్ స్టైల్ టేస్ట్ ఇంట్లోనే, ఈజీగా!

