"సింపుల్, టేస్టీ కేక్ రెసిపీ" - ఇంట్లోనే ఇలా చేస్తే "బేకరీ కేక్" దండగ అంటారు!
మైదా ఎగ్ లేకుండా కేక్ ఇలా చేసేయండి! - ఓవెన్ లేకుండానే చేసుకోవచ్చు!

By ETV Bharat Andhra Pradesh Team
Published : December 31, 2025 at 12:05 PM IST
Simple and easy cake recipe : న్యూ ఇయర్, బర్త్ డే, వెడ్డింగ్ డే! ఇలా చెప్పుకుంటూ పోతే వేడకలు అనగానే ముందుగా గుర్తొచ్చేది కేక్ మాత్రమే. అప్పటికప్పుడు కేక్ కావాలనుకుంటే బేకరీకి వెళ్లి తెచ్చుకోవడం తెలిసిందే. కానీ, తయారీ విధానం, హానికర రసాయనాలు, పరిశుభ్రత గురించి ఆలోచిస్తే ఇంట్లో చేసుకోవడమే బెటర్ అనుకుంటాం. సరిగ్గా ఇంట్లో కూడా ఈజీగా, చాలా సింపుల్‌గా బేకరీ స్టైల్ కేక్ ఎలా తయారు చేయలో ఇపుడు తెలుసుకుందాం. ఈ కేక్ తయారీకి మైదా అవసరం లేదు. ఓవెన్ లేకున్నా గిన్నెల్లోనే సింపుల్‌గా చేసేయొచ్చు.
న్యూ ఇయర్ వేడుకల్లో "సింపుల్ స్వీట్" ట్రై చేయండి - ఫ్రెండ్స్, ఫ్యామిలీతో షేర్ చేసుకోండి!

కావల్సిన పదార్థాలు :
- రవ్వ - కప్పు
- చక్కెర - అర కప్పు
- కప్పున్నర - పాలు
- యాలకుల పొడి
- వెనీలా ఎసెన్స్ - అర టీ స్పూన్
- గోధుమ పిండి లేదా మైదా - 2 టేబుల్ స్పూన్లు
- నెయ్యి - 3 టేబుల్ స్పూన్లు
- లేదా బటర్, నూనె
- బేకింగ్ సోడా - అర టీ స్పూన్
- బేకింగ్ పౌడర్ - అర టీ స్పూన్
- లేదా ఈనో పౌడర్
- అర చెక్క నిమ్మరసం
- లేదా కొద్దిగా చిక్కటి పెరుగు

క్రీమ్ కోసం :
- పాలు - 2 కప్పులు
- బియ్యం పిండి - 2 టేబుల్ స్పూన్లు
- పంచదార - అర కప్పు
- వెనీలా ఎసెన్స్ - పావు స్పూన్
- పాలపొడి - 1 టేబుల్ స్పూన్

అలంకరణ కోసం :
- కొబ్బరి తురుము - 1 టేబుల్ స్పూన్
- డ్రై ఫ్రూట్స్ మిక్స్ - 1 టేబుల్ స్పూన్
- టూటీ ఫ్రూటీ - - 1 టేబుల్ స్పూన్

తయారీ విధానం :
- ముందుగా ఓ గిన్నెలోకి ఓ కప్పు లేదా గ్లాసు కొలతల్లో పదార్థాలు తీసుకోవాలి. రవ్వ, చక్కెరతో పాటు గోరు వెచ్చని పాలు ముప్పావు కప్పు కలపాలి. గట్టిగా అనిపిస్తే మరో అర కప్పు పాలు కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలపాలి. వెచ్చని పాలలో రవ్వ తొందరగా నానుతుంది. ఇపుడు ఇపుడు కేక్ తయారీ కోసం అడుగు మందం ఉన్న స్టీల్ గిన్నె తీసుకోవాలి. అడుగున బటర్ పేపర్ పెట్టుకుని కొద్దిగా నూనె రాసి పెట్టుకోవాలి.

- 15నిమిషాల తర్వాత నానబెట్టుకున్న మిశ్రమాన్ని మిక్సీ జార్‌లోకి తీసుకోవాలి. అందులో యాలకుల పొడి లేదా అర టీ స్పూన్ వెనీలా ఎసెన్స్ వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల గోధుమ పిండి లేదా మైదా వేసుకోవాలి. ఇంకా 3 టేబుల్ స్పూన్ల నెయ్యి, బటర్, నూనె ఏదైనా వేసుకోవచ్చు. ఇపుడు బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత మిక్సింగ్ బౌల్లోకి తీసుకుని అర టీ స్పూన్ బేకింగ్ సోడా, అర టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. అవి అందుబాటులో లేకపోతే ఈనో పౌడర్ వేసుకోవచ్చు. ఆ తర్వాత అర చెక్క నిమ్మరసం పిండుకోవాలి. ఇపుడు పిండి కలుపుకోవాలి. గట్టిగా అనిపిస్తే కాచి చల్లార్చిన పాలు పోసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న పిండిని ముుందుగా బటర్ పేపర్ పెట్టి రెడీ చేసుకున్న కేక్ గిన్నెలోకి తీసుకోవాలి. మొత్తం సర్దుకునేలా ట్యాప్ చేసి పెట్టుకోవాలి.
- ఇపుడు స్టవ్‌పై ఓ మందపాటి గిన్నె, అందులో స్టాండ్ పెట్టుకోవాలి. స్టాండ్ లేకపోతే కాస్త ఇసుక పోసుకోవాలి. 5నిమిషాల పాటు గిన్నె లో ఫ్లేమ్‌లో వేడి చేసి ఆ తర్వాత కేక్ మిశ్రమం వేసుకున్న గిన్నె పెట్టుకోవాలి. స్టవ్ పైన్ గిన్నె కవర్ చేసేలా మూత పెట్టాలి. మంట లో టు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకుని అర గంట కుక్ చేసుకుంటే చాలు. టూత్ పిక్ లేదా కత్తితో గుచ్చి చూసి తడిగా అనిపిస్తే మరో 10 నిమిషాలు కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇపుడు కేక్ పక్కన పెట్టుకుని చల్లారనివ్వాలి. పైన డెకరేషన్ కోసం క్రీమ్ చేసుకోవాలి.

- క్రీమ్ తయారీ కోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్‌లో 2 కప్పుల పాలు పోసుకోవాలి. బాగా మరిగించాక మరో పావు కప్పు పాలలో 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి వేసుకుని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. మరుగుతున్న పాలలో కొద్ది కొద్దిగా పోస్తూ కలుపుకోవాలి. ఇపుడు పాలు బాగా చిక్కబడతాయి. స్వీట్ కోసం పంచదార పొడి లేదా పంచదార వేసుకోవాలి. అర స్పూన్ వెనీలా ఎసెన్స్ వేసుకుని 2 నిమిషాల తర్వాత దించుకుంటే చాలు.ఇపుడు చల్లారిన మిశ్రమాన్ని మిక్సీలో వేసుకుని కొద్దిగా పాలపొడి వేసుకుని బాగా గ్రైండ్ చేస్తే క్రీమ్ రెడీగా వస్తుంది.
- ఇపుడు కేక్ డీ మౌల్డ్ చేసుకోవాలి. రెండు లేయర్లుగా కట్ చేసుకుని ఒక ప్లేట్లో రెడీ చేసుకున్న క్రీమ్ వేసుకుని మరో బ్రెడ్ లేయర్ పెట్టి మళ్లీ క్రీమ్ వేసుకోవాలి. పైన కొబ్బరి తురుము, డ్రై ఫ్రూట్స్ పౌడర్ చల్లుకోవాలి. ఆ తర్వాత అర గంట సేపు డీప్ ఫ్రిజ్‌లో పెట్టి టూటీ ఫ్రూటీ చల్లుకుంటే కేక్ రెడీ!
అరటిపండ్లతో "సింపుల్, ఈజీ డెజర్ట్" - ఒక్కసారి ఇలా తయారు చేయండి!
కొత్త సంవత్సరాన్ని తియ్యగా ప్రారంభిద్దాం - మీ కోసం సింపుల్ స్వీట్ రెసిపీ!

