ETV Bharat / offbeat

పక్కా కొలతల్లో "చిక్కటి షోర్వా" - చపాతీ, బగారా రైస్​లోకి అద్దిరిపోతుంది!

రోడ్ సైడ్ బండ్లపై షోర్వా ఇలా చేయండి - ఎంతో స్పైసీగా ఘుమఘుమలాడుతుంది

shorba_recipe
shorba_recipe (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : January 4, 2026 at 3:50 PM IST

2 Min Read
Choose ETV Bharat

Shorba Recipe : చికెన్, మటన్ కర్రీల్లో షోర్వా చాలా బాగుంటుంది. కానీ, కొన్ని హోటళ్లలో చపాతీలోకి, బగారా రైస్​లోకి ఇచ్చే వెజ్ షోర్వా తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది. సరిగ్గా అలాంటి రోడ్ సైడ్ షోర్వా మీరు ఇక్కడ ఇచ్చిన పదార్థాలు ఉపయోగించి సింపుల్​గా తయారు చేసుకోండి.

"ఉడిపి స్టైల్ ఆలూ బిర్యానీ" - ఇలా ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు!

shorba_recipe
shorba_recipe (Getty images)

కావల్సిన పదార్థాలు :

  • నూనె - 5 టీ స్పూన్ల
  • ఉల్లిపాయలు - 3
  • ఉప్పు - రుచికి సరిపడా
  • సోంపు - 1 స్పూన్
  • దాల్చిన చెక్క - 1 ఇంచు
  • రాతి పువ్వు - కొద్దిగా
  • యాలకులు - 3
  • లవంగాలు - 3
  • కొబ్బరి - 2 టేబుల్ స్పూన్లు
  • జీడిపప్పు - 15
  • టమోటాలు - 2
  • బిర్యానీ ఆకులు - 2
  • పచ్చిమిర్చి - 2
  • కరివేపాకు - 1 రెమ్మ
  • పసుపు - పావు స్పూన్
  • కారం - 2 స్పూన్లు
  • కొత్తిమీర - కొద్దిగా
  • పుదీనా - కొద్దిగా
  • కసూరి మేతి - కొద్దిగా
shorba_recipe
shorba_recipe (Getty images)

తయారీ విధానం :

  • ముందుగా స్టవ్​పై ప్యాన్ పెట్టుకుని 3 టీ స్పూన్ల నూనె వేసుకుని వేడి కాగానే అర కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకోవాలి. త్వరగా వేగేలా పావు టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. ఇపుడు అర స్పూన్ సోంపు, దాల్చిన చెక్క, రాతి పువ్వు, యాలకులు, లవంగాలు, 2 టేబుల్ స్పూన్ల పచ్చి కొబ్బరి, లేదా ఎండు కొబ్బరి, 15 జీడిపప్పు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. మీడియం ప్లేమ్​లో ఫ్రై చేయడం వల్ల మసాలా దినుసులు మాడిపోకుండా చక్కగా వేగుతాయి. స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత మిక్సీలోకి తీసుకోవాలి. ముందుగా గ్రైండ్ చేసి ఆ తర్వాత నీళ్లు పోసుకుని గ్రైండ్ చేసి తీసుకోవాలి.
shorba_recipe
shorba_recipe (Getty images)
  • ఇపుడు టమోటాలు ముక్కలు కూడా గ్రైండ్ చేసి తీసుకోవాలి.
  • ఇపుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని నూనె వేసి బిర్యానీ ఆకులు, సోంపు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఒక ఉల్లిపాయ సన్నగా తరిగి వేయించాలి. ఆ తర్వాత 2 పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు వేసుకుని ఫ్రై చేయాలి
shorba_recipe
shorba_recipe (Getty images)
  • ఆ తర్వాత టమోటా ప్యూరీ వేసుకుని వేయించాలి. నూనె వేరవుతున్న టైంలో పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, రుచికి సరిపడా ఉప్పు వేసుకుని లో ఫ్లేమ్​లో ఫ్రై చేయాలి. ఇపుడు గ్రైండ్ చేసిన మసాలా పేస్ట్ వేసుకుని నూనెలోవేయించాలి.
shorba_recipe
shorba_recipe (Getty images)
  • 2 నిమిషాల తర్వాత నీళ్లు పోసుకోవాలి. బాగా కలుపుతూ ఉడికించుకోవాలి. మరుగుతున్న టైంలో కొత్తిమీర, పుదీనా వేసుకుని కలపాలి. మంట తగ్గించుకుని 10 నిమిషాల పాుట మరిగించాలి. మధ్య మధ్యలో కలుపుతూ అడుగుపట్టకుండా చూసుకోవాలి. కొబ్బరి, జీడిపప్పులోనూ కలిసిన నూనె కూడా బయటకు వచ్చేసి షోర్వా ఘుమఘుమలాడుతుంది.
  • ఇపుడు కొద్దిగా కసూరి మేతి వేసుకుని కలిపితే చాలు! ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఈ షేర్వా బగారా రైస్​లో అద్భుతంగా ఉంటుంది.

సండే స్పెషల్ "కాజు రైస్, ప్రాన్స్ కోకోనట్ పులావ్" - టమోటా కెచప్​తో ఇలా ట్రై చేయండి!

"చేపల కర్రీ" బాగా కుదరాలంటే ఈ టిప్స్ పాటించండి - మరుసటి రోజు ఘుమఘుమలాడుతుంది!