కరకరలాడే "నువ్వుల చెగోడీలు" - పిల్లలైతే భలే ఇష్టంగా తింటారు!
చెగోడీలు ఇలా చేసి చూడండి - నోటికి కొత్త రుచినిస్తాయి!

By ETV Bharat Andhra Pradesh Team
Published : February 28, 2026 at 12:12 PM IST
Nuvvula Chegodilu Making : పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి రాగానే స్నాక్స్ కావాలని అడుగుతుంటారు. ఈ నేపథ్యంలోనే చాలా మంది బయట స్నాక్స్ కొనుగోలు చేసి చిన్నారులకు ఇస్తుంటారు. ఇక అలా చేయకుండా ఓసారి ఇలా నువ్వుల చెగోడీలు చేసి పెట్టారంటే కరకరలాడుతూ నోటికి ఎంతో రుచినిస్తాయి. అంతేకాక నెల రోజుల పాటు నిల్వ ఉంటాయి! బిగినర్స్ కూడా ఈ స్టెప్స్ పాటిస్తూ ఈజీగా చేసుకోవచ్చు. ఇంటికి బంధువులు లేదా స్నేహితులు వచ్చినప్పుడు, పండగల సమయాల్లో చేసుకునేందుకు బెస్ట్ ఆప్షన్. మరి ఆలస్యం చేయకుండా నువ్వుల చెగోడీలు ఎలా ప్రిపేర్ చేయాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
పుల్లగా, కమ్మగా "మెంతి ఆకు, టమోటా పచ్చడి" - వారం రోజులు నిల్వ ఉంటుంది!

కావాల్సిన పదార్థాలు :
- బియ్యప్పిండి - 3 కప్పులు
- ఉప్పు - రుచికి సరిపడా
- జీలకర్ర - 1 టేబుల్ స్పూన్
- వాము - 1 టీ స్పూన్
- పసుపు - అర టీ స్పూన్
- నూనె - తగినంత
- నువ్వులు - సరిపడా

తయారీ విధానం :
- ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్‌లో మూడు కప్పుల నీళ్లు, రుచికి సరిపడా ఉప్పు వేయాలి. అలాగే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక టీ స్పూన్ వాము, అర టీ స్పూన్ పసుపు, మూడు టీ స్పూన్ల ఆయిల్ వేసి మరిగించాలి. ఇలా ఆయిల్ వేయడం వల్ల చెగోడీలు గుల్లగా ఎక్కువగా నూనె పీల్చకుండా వస్తాయి.
- ఈ మిశ్రమం బాయిల్ అవుతున్నప్పుడు మూడు కప్పుల బియ్యప్పిండి వేసి బాగా మిక్స్ చేయాలి. అనంతరం స్టవ్ ఆఫ్ చేసి మూతపెట్టి ఐదు నిమిషాల పాటు పక్కనుంచాలి.
- 5 నిమిషాల తర్వాత చేతులను చల్లని నీళ్లలో ముంచి పిండిని చపాతీ పిండి మాదిరిగా బాగా మిక్స్ చేయాలి. ఆ తర్వాత పిండిని చిన్నచిన్న బాల్స్ లాగా చేసి పక్కనుంచాలి.

- ఇప్పుడు ఒక్కొ పిండి ముద్దను చపాతీ పీటపై తీసుకొని ఆ తర్వాత సన్నగా రోల్ చేయాలి. ఆపైన నువ్వులు వేసి పిండికి అంటుకునే విధంగా అటూఇటూ తిప్పుతూ రెండు చివర్లు కలిపి రౌండ్ షేప్‌లో చేసుకోవాలి. ఇలా అన్ని చెగోడీలను తయారు చేసుకుని ఓ ప్లేట్‌లోకి తీసుకోవాలి.
- అనంతరం స్టవ్ ఆన్ చేసి కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోయాలి. నూనె వేడైన తర్వాత చిల్లుల గరిటెపై చెగోడీలు ఉంచి నూనెలో 30 సెకన్ల పాటు ఉంచాలి.

- ఆ తర్వాత మంటను మీడియం ఫ్లేమ్‌లో ఉంచి చెగోడీలను కడాయిలో వేసి 30 సెకన్ల పాటు అలాగే వదిలేయాలి. అనంతరం రెండు వైపులా టర్న్ చేస్తూ కాల్చుకోవాలి.
- అనంతరం చెగోడీలను ప్లేట్‌లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి.
- అంతే కరకరలాడే నువ్వుల చెగోడీలు మీ ముందుంటాయి!
- ఈ చెగోడీలను ఎయిర్‌టైట్ డబ్బాలో స్టోర్ చేసుకుంటే నెల రోజుల పాటు నిల్వ ఉంటాయి!
- ఈ పద్ధతిని పాటిస్తూ ఓసారి ఇంట్లో చేశారంటే ఇంటిల్లిపాదీకి ఫేవరెట్ రెసిపీగా మారుతుంది.
కేరళ స్టైల్ "కొబ్బరి చికెన్ కర్రీ" - ముద్దకో ముక్క అద్దిరిపోద్ది!
బ్రేక్‌ఫాస్ట్‌లోకి, సాయంత్రం స్నాక్ కోసం - మీల్మేకర్తో కరకరలాడించండి!

