ETV Bharat / offbeat

రెండ్రోజుల పాటు 'తిరుపతి-రక్సల్' రైలు రద్దు! - 'దక్షిణ మధ్య రైల్వే' కీలక ప్రకటన

రైల్వే ప్రయాణికులకు అలర్ట్ - నాన్-ఇంటర్‌లాకింగ్ పనులే కారణం!

SCR Cancelled Trains List
ఈ రైలు రద్దు (Getty Images)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : September 1, 2026 at 5:15 PM IST

3 Min Read
Choose ETV Bharat

SCR Cancelled Trains List : దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు కీలక అలర్ట్ జారీ చేసింది. ముఖ్యంగా తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరే వారు ఈ విషయాన్ని గమనించాలి. సౌత్ ఈస్టర్న్ రైల్వే పరిధిలో నాన్-ఇంటర్‌లాకింగ్(NI) పనుల కారణంగా తిరుపతి-రక్సౌల్​ జంక్షన్ మార్గంలో ప్రయాణించే ట్రైన్​ను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. మరి, ఎందుకు రద్దు చేశారు? ఏ ఏ తేదీల్లో ఇది ప్రయాణికులకు అందుబాటులో ఉండదో ఇక్కడ చూద్దాం.

తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి నడిచే 'తిరుపతి-రక్సౌల్ ఎక్స్‌ప్రెస్' రైలు ప్రయాణానికి సంబంధించి దక్షిణ మధ్య రైల్వే కీలక ప్రకటన చేసింది. సౌత్ ఈస్టర్న్ రైల్వేలోని చక్రధర్‌పూర్ డివిజన్ పరిధిలో యార్డ్ పునర్నిర్మాణం, బాగ్దేహి - ఝార్సుగూడ మధ్య 4వ లైన్ ప్రారంభోత్సవానికి సంబంధించి బాగ్దేహి స్టేషన్‌లో జరుగుతున్న నాన్-ఇంటర్‌లాకింగ్ పనుల కారణంగా ఈ రైళ్లు రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు.

రద్దైన రైళ్ల వివరాలు :

  • తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి రక్సౌల్ వెళ్లే వీక్లీ ఎక్స్​ప్రెస్ రైలు(ట్రైన్ నంబర్.17433) 'నవంబర్ 2, 2026'వ తేదీన రద్దు చేశారు.
  • అలాగే, రక్సౌల్ జంక్షన్ నుంచి తిరుపతికి బయలుదేరే రైలును(ట్రైన్ నంబర్.17434) 'నవంబర్ 05, 2026' నాడు రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.
  • ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించి ఆయా రోజుల్లో తమ జర్నీకి సంబంధించి మార్పులు, చేర్పులు చేసుకోవాల్సిందిగా సూచించారు.

ఇటీవలే రెగ్యులర్ సర్వీసుగా మార్పు!

గతంలో ప్రత్యేక సర్వీస్​గా ఉన్న తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరే 'తిరుపతి-రక్సౌల్' వీక్లీ ఎక్స్‌ప్రెస్​ను ఇటీవలే రెగ్యులర్ సర్వీసుగా మార్చింది దక్షిణ మధ్య రైల్వే. ఈ రైలు ద్వారా తిరుపతి నుంచి బీహార్​లోని రక్సౌల్ జంక్షన్ వరకు కనెక్టివిటీ ఉంటుంది. తిరుపతి నుంచి ప్రారంభమయ్యే ఈ ట్రైన్ రేణిగుంట, కడప, గుంతకల్లు, రాయచూరు, తెలంగాణలోని వికారాబాద్, సికింద్రాబాద్, కాజీపేట, మంచిర్యాల, బిలాస్‌పూర్, రాంచీ, చిత్తరంజన్ మార్గాల గుండా ప్రయాణించి బీహార్​లోని రక్సౌల్ జంక్షన్​కు చేరుకుంటుంది. మొత్తంగా ఈ తిరుపతి-రక్సౌల్ ట్రైన్ తిరుపతిని ఏపీ, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, బీహార్‌లోని ప్రధాన గమ్యస్థానాలతో కనెక్ట్ చేస్తుంది. ఆయా ప్రాంతాల్లోని ప్రజలు తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి ఈ వీక్లీ ఎక్స్​ప్రెస్ ఎంతో అనుకూలంగా ఉంటుంది.

రైలు ప్రయాణం పెట్టుకున్నారా? - భారీగా రైళ్ల దారి మళ్లింపు, వేళల్లో మార్పులు!

ఈ రైళ్లు దారి మళ్లింపు :

సెంట్రల్ రైల్వే పరిధిలోని 'పూణే-హడప్సర్' యార్డుల్లో 3వ లైన్ ఏర్పాటుకు సంబంధించి 'నాన్-ఇంటర్‌లాకింగ్' పనులు జరుగుతున్నాయి. ఆ కారణంగా పలు రైళ్లను దారి మళ్లిస్తున్నట్లు ప్రకటించింది దక్షిణ మధ్య రైల్వే. ఆ వివరాలిలా ఉన్నాయి.

  • ట్రైన్ నంబర్ 11302 : KSR బెంగళూరు సిటీ - ముంబయి CSM టెర్మినస్ ఎక్స్‌ప్రెస్
  • ఈ రైలును సెప్టెంబర్ 22న దారి మళ్లించారు. ఆ రోజు సోలాపూర్ - కుర్దువాడి -మిరాజ్ జంక్షన్ - సతారా రైల్వే స్టేషన్ - పూణే మీదుగా నడుస్తుంది.
  • ట్రైన్ నంబర్ 22159 : ముంబై CSM టెర్మినస్ - MGR చెన్నై సెంట్రల్ ఎక్స్‌ప్రెస్ రైలు
  • సెప్టెంబర్ 19 నుంచి 23వ తేదీ వరకు, మళ్లీ అక్టోబర్ 4న రెగ్యులర్ రూట్​లో కాకుండా మరో రూట్​లో ప్రయాణిస్తుంది. కళ్యాణ్ - ఇగత్‌పురి - మన్మాడ్ - దౌండ్ మీదుగా నడుస్తోంది.
  • ట్రైన్ నంబర్ 11019 : ముంబై CSM టెర్మినస్ - భువనేశ్వర్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్
  • సెప్టెంబర్ 20వ తేదీన పూణే -సతారా రైల్వే స్టేషన్ - మిరాజ్ జంక్షన్ -పంధర్‌పూర్-కుర్దువాడి- సోలాపూర్ మీదుగా ప్రయాణించనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.
  • ట్రైన్ నంబర్ 16340 : నాగర్‌కోయిల్ - ముంబై LTT ఎక్స్‌ప్రెస్​ను సెప్టెంబర్ 22, అక్టోబర్ 2న దారి మళ్లించారు. ఈ తేదీల్లో సోలాపూర్ - కుర్దువాడి - దౌండ్ -అహల్యానగర్ -మన్మాడ్ - నాసిక్ - కళ్యాణ్ మీదుగా ప్రయాణిస్తుంది.
  • ఇవి మాత్రమే కాకుండా మరికొన్ని రైళ్లను రద్దు చేసింది దక్షిణ మధ్య రైల్వే. ఆ వివరాల కోసం ఈ లింక్​పై క్లిక్ చేయండి.

'కాశీ తీర్థ యాత్ర' వెళ్లాలనుకుంటున్నారా? - విజయవాడ మీదుగా 'భారత్​ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్'

'సికింద్రాబాద్ మీదుగా బెంగళూరు' - మరో వీక్లీ ఎక్స్​ప్రెస్ ట్రైన్ రెగ్యులర్!