ETV Bharat / offbeat

నోరూరించే "పెసరపప్పు చెక్కలు" - సంక్రాంతి పండక్కి కరకరలాడించండి!

- నూనె పీల్చకుండానే క్రిస్పీ అండ్ టేస్టీ 'చెక్కలు' - ఇంటిల్లిపాదీ ఇష్టంగా తింటారు!

Sankranti Special Chekkalu Recipe
Sankranti Special Chekkalu Recipe (Eenadu)
author img

By ETV Bharat Telangana Team

Published : January 5, 2026 at 5:06 PM IST

3 Min Read
Choose ETV Bharat

Sankranti Special Chekkalu Recipe : తెలుగు ప్రజలు ఘనంగా చేసుకునే పెద్ద పండగల్లో ఒకటి "సంక్రాంతి". ఈ పండగ వస్తోందంటేనే చాలు పల్లెల నుంచి పట్టణాల వరకు వారం పదిరోజుల ముందునుంచే హడావుడి మొదలవుతుంది. మరో మూడ్నాలుగు రోజుల్లో పిల్లలకూ పొంగల్ సెలవులు ఇవ్వనున్నారు. ఈ క్రమంలోనే ఇంట్లో ఉండే పిల్లల కోసం అమ్మలూ, అమ్మమ్మలూ ఏదో ఒకటి పిండి వంటకం చేసి పెడుతుంటారు. అందులో మెజార్టీ పీపుల్ చేసుకునే వాటిల్లో 'పప్పు చెక్కలు' తప్పకుండా ఉంటాయి.

అయితే, నార్మల్​గా చాలా మంది మినపప్పు, బియ్యప్పిండి వంటి వాటితో చెక్కలు తయారు చేస్తుంటారు. అలాకాకుండా ఈ సంక్రాంతికి "పెసరపప్పు చెక్కలు" ట్రై చేయండి. ఇవి సరికొత్త రుచిలో భలే కమ్మగా ఉంటాయి. అలాగే, వీటిని చాలా తక్కువ పదార్థాలతో మరొకరితో పని లేకుండా ఒక్కరే సింపుల్​గా రెడీ చేసుకోవచ్చు. పైగా, ఈ చెక్కల తయారీకి నూనె కూడా అంతగా పట్టదు! మరి, పెసరపప్పుతో నోరూరించే ఈ క్రిస్పీ అండ్ టేస్టీ చెక్కలను ఎలా చేసుకోవాలి? అందుకు కావాల్సిన పదార్థాలేంటో ఇప్పుడు చూద్దాం.

Sankranti Special Chekkalu Recipe
బియ్యప్పిండి (Getty Images)

కావాల్సిన పదార్థాలు :

  • మూడు కప్పులు - బియ్యప్పిండి
  • పావు కప్పు - పెసరపప్పు
  • రెండు చెంచాలు - కారం
  • రుచికి తగినంత - ఉప్పు
  • చిన్న ముక్క - అల్లం
  • ఒక చెంచా - జీలకర్ర
  • మూడు - పచ్చిమిర్చి
  • రెండు రెబ్బలు - కరివేపాకు
  • వేయించేందుకు సరిపడా - ఆయిల్

కరకరలాడే "సొరకాయ గారెలు" - నూనె పీల్చవు! - భలే రుచిగా ఉంటాయి!

Sankranti Special Chekkalu Recipe
పెసరపప్పు (Getty Images)

తయారీ విధానం :

  • ఈ సింపుల్ అండ్ టేస్టీ చెక్కల తయారీ కోసం ముందుగా ఒక చిన్న గిన్నెలో పెసరపప్పుని తీసుకుని శుభ్రంగా కడిగి పది నిమిషాలు నానబెట్టుకోవాలి.
  • ఆలోపు రెసిపీలోకి కావాల్సిన పచ్చిమిర్చి పేస్ట్​ను సిద్ధం చేసుకోవాలి. ఇందుకోసం మిక్సీ జార్ తీసుకుని అందులో పచ్చిమిర్చి, అల్లం ముక్కలు వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుని పక్కనుంచాలి.
Sankranti Special Chekkalu Recipe
పచ్చిమిర్చి (Getty Images)
  • ఇప్పుడు ఒక వెడల్పాటి మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో బియ్యప్పిండి, నానబెట్టుకున్న పెసరపప్పు, ముందుగా గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి-అల్లంపేస్టు వేసుకోవాలి.
  • అలాగే, కరివేపాకు తరుగు, రుచికి తగినంత ఉప్పు, కారం, జీలకర్ర, రెండు చెంచాల వేడి నూనె వేసి గరిటెతో ఒకసారి మిశ్రమం మొత్తం మంచిగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి.
  • తర్వాత అందులో అవసరం మేరకు తగినన్ని నీళ్లను కొద్దికొద్దిగా యాడ్ చేసుకుంటూ పిండిని గట్టిగా చపాతీపిండిలా కలుపుకోవాలి.
Sankranti Special Chekkalu Recipe
జీలకర్ర (Getty Images)
  • అనంతరం ఆ మిశ్రమంలో నుంచి కొద్దికొద్దిగా పిండిని తీసుకుంటూ చిన్న చిన్న ఉండల మాదిరిగా చేసుకుని పూరీ ప్రెస్​పైన పల్చగా మీకు కావాల్సిన సైజులో చెక్కల్లా వత్తుకుని ఒక వెడల్పాటి ప్లేట్​ లేదా క్లాత్​పైన ఉంచాలి.
  • ఒకవేళ మీ వద్ద పూరీ ప్రెస్ లేనట్లయితే చపాతీ పీటపై బటర్ పేపర్ లేదా ఆయిల్ కవర్ తీసుకుని కాస్త నూనె రాసి దానిపై ఒక పిండి ఉండ ఉంచి దానిపై మరో బటర్ పేపర్ లేదా ఆయిల్ కవర్ పెట్టి ఫ్లాట్​గా ఉండే గిన్నె లేదా బాక్స్​తో వీలైనంత పల్చగా చెక్కల షేప్​లో వత్తుకోవాలి. అలా పిండి మొత్తాన్ని చెక్కల్లా ప్రిపేర్ చేసుకుని పక్కనుంచాలి.
Sankranti Special Chekkalu Recipe
కరివేపాకు (Getty Images)
  • అనంతరం స్టవ్ మీద కడాయిలో వేయించడానికి సరిపడా నూనె వేసుకుని హీట్ చేసుకోవాలి.
  • ఆయిల్ వేడయ్యాక మంటను తగ్గించి ముందుగా రెడీ చేసుకున్న చెక్కలను కాగుతున్న నూనెలో నెమ్మదిగా పాన్​లో వేయించడానికి తగినన్ని వేసుకోవాలి.
  • తర్వాత వెంటనే కదపకుండా కాసేపు వేగనిచ్చి ఆపై అటు ఇటు తిప్పేస్తూ మంచి కలర్ వచ్చేంతవరకూ వేయించుకోవాలి.
  • అలా వేయించుకున్నాక జల్లిగిన్నెలోకి తీసుకుని అదనపు నూనె తొలగిపోయేలా కాసేపు పక్కనుంచి ఆపై సర్వ్ చేసుకోండి.
  • అంతే, పెసరపప్పుతో కరకరలాడే మంచి రుచికరమైన "చెక్కలు" మీ ముందు ఉంటాయి!
  • ఇవి చల్లారిన తర్వాత ఏదైనా స్టీల్ డబ్బాలో స్టోర్ చేసుకున్నారంటే కనీసం రెండు వారాలు తాజాగా నిల్వ ఉంటాయి!

చిలగడదుంపలతో అద్దిరిపోయే "కట్​లెట్స్​" - మూడేమూడు పదార్థాలతో రెడీ!

కజ్జికాయలు కాదు "పాకం కజ్జికాయలు" చేసుకోండి - జ్యూసీజ్యూసీగా ఉంటాయి!