ETV Bharat / offbeat

శనగపిండి లేకుండానే కరకరలాడే "జంతికలు" - నూనె తక్కువ, రుచి ఎక్కువ!

ఇంటిల్లిపాదీ ఇష్టంగా తినే "సగ్గుబియ్యం మురుకులు" - తక్కువ నూనెతోనే కరకరలాడుతాయి!

Crispy Janthikalu Recipe
Crispy Janthikalu Recipe (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : January 8, 2026 at 9:50 AM IST

3 Min Read
Choose ETV Bharat

Crispy Janthikalu Recipe in Telugu : సరదాల సంక్రాంతి వచ్చేస్తోంది. ఈ క్రమంలోనే అందరూ రకరకాల పిండి వంటకాలను చేయడానికి రెడీ అయిపోతుంటారు. అందులో మెజార్టీ పీపుల్ చేసుకునే వాటిల్లో జంతికలు/మురుకులు తప్పకుండా ఉంటాయి. అయితే, ఈ పండక్కి ఎప్పుడూ చేసుకునే విధంగా కాకుండా కాస్త డిఫరెంట్​గా ట్రై చేయండి. అదే, సగ్గుబియ్యంతో కరకరలాడే "జంతికలు". శనగపిండి వాడకుండా చేసుకునే ఇవి గుల్లగా వచ్చి చాలా క్రిస్పీగా, టేస్టీగా ఉంటాయి. నూనెనూ తక్కువగానే పీల్చుకుంటాయి! పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ చాలా చాలా ఇష్టంగా తింటారు. మరి, లేట్ చేయకుండా ఈ క్రిస్పీ అండ్ టేస్టీ సగ్గుబియ్యం జంతికలను ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం.

Crispy Janthikalu Recipe
సగ్గుబియ్యం (Getty Images)

కావాల్సిన పదార్థాలు :

  • అర కప్పు - సగ్గుబియ్యం
  • ఒక కప్పు - పెసరపప్పు
  • మూడు కప్పులు - బియ్యప్పిండి
  • ఒకటిన్నర టీస్పూన్లు - వాము
  • రెండు టేబుల్​స్పూన్లు - తెల్ల నువ్వులు
  • రుచికి తగినంత - కారం
  • టేస్ట్​కి సరిపడా - ఉప్పు
  • రెండు టేబుల్​స్పూన్లు - వేడి నూనె/నెయ్యి
  • డీప్​ ఫ్రైకి తగినంత - నూనె

నోరూరించే "పెసరపప్పు చెక్కలు" - సంక్రాంతి పండక్కి కరకరలాడించండి!

Crispy Janthikalu Recipe
పెసరపప్పు (Getty Images)

తయారీ విధానం :

  • కరకరలాడే ఈ జంతికల తయారీ కోసం ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టుకుని అందులో సగ్గుబియ్యం, పెసరపప్పు వేసి సన్నని సెగ మీద ఐదారు నిమిషాలు కలుపుతూ వేయించాలి. ఆపై వాటిని ఒక ప్లేట్​లోకి తీసుకుని చల్లారనివ్వాలి.
  • అనంతరం మిక్సీ జార్ తీసుకుని అందులో చల్లారిన సగ్గుబియ్యం మిశ్రమాన్ని వేసి మెత్తని పొడిలా మిక్సీ పట్టుకోవాలి.
  • ఇప్పడు ఒక వెడల్పాటి మిక్సింగ్ బౌల్​ లేదా బేషన్ తీసుకుని అందులో మిక్సీ పట్టుకున్న సగ్గుబియ్యం పొడిని జల్లెడలో వేసి జల్లించుకోవాలి. పిండి అనేది మెత్తగా ఉండేలా చూసుకోవాలి.
  • తర్వాత జల్లించుకున్న సగ్గుబియ్యం పొడిలో బియ్యప్పిండిని వేసి కలుపుకోవాలి. ఆపై ఆ మిశ్రమంలో చేతితో వామును బాగా నలిపి వేసుకోవాలి.
Crispy Janthikalu Recipe
బియ్యప్పిండి (Getty Images)
  • అలాగే రుచికి తగినంత ఉప్పు, కారం, తెల్ల నువ్వులు కూడా వేసుకుని ఒకసారి అవన్నీ పిండిలో కలిసేలా బాగా కలుపుకోవాలి.
  • ఇక్కడ మీరు ఒకవేళ నువ్వులు వద్దనుకుంటే స్కిప్ చేయొచ్చు. అలాగే, ఈ స్టేజ్​లో ఒకసారి చేతిలోకి కొద్దిగా పిండిని తీసుకుని ఉప్పు, కారం సరిపోయిందా? లేదా? చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ సరిపోలేదనిపిస్తే కాస్త యాడ్ చేసుకుని కలుపుకోవాలి.
  • అనంతరం పిండి మిశ్రమంలో వేడి వేడి నూనె లేదా నెయ్యిని వేసుకుని ముందుగా గరిటెతో కలుపుకోవాలి.
  • అది కాస్త చల్లారాక చేతితో రబ్ చేస్తూ పిండి మొత్తం కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా చేయడం ద్వారా జంతికలు గుల్లగా, క్రిస్పీగా వస్తాయని గుర్తుంచుకోవాలి.
Crispy Janthikalu Recipe
వాము (Getty Images)
  • ఆ తర్వాత అవసరం మేరకు తగినన్ని నీళ్లను కొద్దికొద్దిగా పోసుకుంటూ పిండిని చపాతీ ముద్దలా కలుపుకోవాలి. అయితే, పిండి కన్సిస్టెన్సీ మరీ గట్టిగా కాకుండా కాస్త లూజ్​గానే ఉండేటట్లు చూసుకోవాలి.
  • నెక్ట్స్ జంతికల గొట్టం తీసుకుని దాని లోపల కొద్దిగా నూనె రాయాలి. ఆపై ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని అందులో సరిపడా నింపి ఒక పొడి క్లాత్​పై మురుకుల్లా వత్తుకోవాలి.
  • అనంతరం స్టవ్ మీద కడాయి ఉంచి వేయించడానికి సరిపడా నూనె పోసి వేడి చేసుకోవాలి.
  • నూనె హీట్ అయ్యాక ముందుగా వత్తుకున్న మురుకులను గరిటెతో ఒక్కొక్కటిగా వేసుకోవాలి.
Crispy Janthikalu Recipe
నువ్వులు (Getty Images)
  • పాన్​లో వేయించడానికి సరిపడా వేసుకున్నాక వెంటనే కదపకుండా కాసేపు కాలనిచ్చి ఆపై అటు ఇటు తిప్పేసుకుంటూ మీడియం ఫ్లేమ్​లో ఎర్రగా కాల్చుకోవాలి.
  • నూనెలో నురగలు తగ్గి జంతికలు క్రిస్పీగా కాలాక వాటిని ఒక ప్లేట్​లోకి తీసుకుంటే చాలు. అలానే పిండి మొత్తాన్ని రెడీ చేసుకోవాలి.
  • ఇవి చల్లారాక ఏదైనా ఒక గాలి చొరబడని డబ్బాలో స్టోర్ చేసుకుంటే చాలు. అంతే, సగ్గుబియ్యంతో కరకరలాడే "జంతికలు" తయారవుతాయి!
  • మరి, ఈ సంక్రాంతికి మీరూ ఇలా ఓసారి ఇలా ట్రై చేయండి. కరకరలాడుతూ మంచి రుచికరంగా ఉండే వీటిని ఇంటిల్లిపాదీ హ్యాపీగా తింటారు.

అరటికాయలతో అద్దిరిపోయే "స్నాక్ రెసిపీ" - పిల్లలైతే భలే ఇష్టంగా తింటారు!

సంక్రాంతి స్పెషల్ : జొన్నపిండి "రిబ్బన్ పకోడీ" - తక్కువ నూనెతోనే కరకరలాడిపోద్ది!