ETV Bharat / offbeat

పండక్కి పసందైన "రవ్వ జిలేబీ" - తక్కువ పదార్థాలతో సింపుల్​గా రెడీ!

జ్యూసీ జ్యూసీగా నోరూరించే 'జిలేబీ' - బిగినర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు!

Jalebi Recipe with Rava
Jalebi Recipe with Rava (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : January 8, 2026 at 5:05 PM IST

3 Min Read
Choose ETV Bharat

Jalebi Recipe with Rava : జ్యూసీ జ్యూసీగా, తియ్యగా ఉండే 'జిలేబీలు' అంటే పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ ఇష్టమే. అయితే, నార్మల్​గా జిలేబీ తినాలనిపించినప్పుడు చాలా మంది బయట కొనుగోలు చేసి టేస్ట్ చేస్తుంటారు. అలాకాకుండా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకునే ఒక సూపర్ రెసిపీ ఉంది. అదే, రవ్వతో నోరూరించే "జిలేబీ". దీని కోసం ఎక్కువ కష్టపడాల్సిన పని లేదు. చాలా తక్కువ పదార్థాలతో అప్పటికప్పుడు ఇన్​స్టంట్​గా రెడీ అవుతుంది. బిగినర్స్ కూడా సింపుల్​గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎన్నడూ తినని సరికొత్త రుచిలో భలే కమ్మగా ఉండి ఇంటిల్లిపాదీకి చాలా బాగా నచ్చుతుంది. మరి, మీరూ ఈ సంక్రాంతికి ఓసారి ఇలా 'రవ్వ జిలేబీ' ట్రై చేయండి.

Jalebi Recipe with Rava
Jalebi Recipe with Rava (Getty Images)

కావాల్సిన పదార్థాలు :

  • బొంబాయి రవ్వ - అర కప్పు
  • మైదా - రెండు కప్పులు
  • చక్కెర - రెండు కప్పులు
  • పెరుగు - రెండు కప్పులు
  • ఆరెంజ్ ఫుడ్ కలర్ - కొద్దిగా
  • యాలకుల పొడి - అర టీస్పూన్
  • బేకింగ్ సోడా - ఒక టీస్పూన్

నోరూరించే "బెల్లం గవ్వలు, బూందీ లడ్డూ" - పండక్కి ఇవి చేస్తే ఇంటిల్లిపాదీ ఫుల్ ఖుష్!

Jalebi Recipe with Rava
Jalebi Recipe with Rava (Getty Images)

తయారీ విధానం :

  • ఈ సింపుల్ అండ్ టేస్టీ స్వీట్ రెసిపీ కోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో మైదా పిండి, బొంబాయి రవ్వ, ఆరెంజ్ ఫుడ్ కలర్, పెరుగు వేసుకోవాలి.
  • ఆపై, కొద్దికొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ గరిటెతో పదార్థాలన్నీ చక్కగా కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత బౌల్​పై మూత ఉంచి అరగంట పాటు నాననివ్వాలి.
  • ఇక్కడ పిండి కన్సిస్టెన్సీ అనేది మరీ పలుచగా, గట్టిగా కాకుండా మీడియంగా ఉండేలా కలుపుకోవాలి.
Jalebi Recipe with Rava
Jalebi Recipe with Rava (Getty Images)
  • అది నానేలోపు రెసిపీలోకి కావాల్సిన పాకాన్ని సిద్ధం చేసుకోవాలి.
  • ఇందుకోసం స్టవ్ మీద పాన్ పెట్టి చక్కెర, తగినన్ని నీళ్లు(రెండు కప్పుల వరకు) పోసుకుని గరిటెతో కలుపుతూ లేత తీగ పాకం వచ్చే వరకు మరిగించుకోవాలి. అంతేకానీ, ముదురు పాకం వచ్చే వరకు మరిగించుకుంటే జిలేబీలు గట్టిగా వస్తాయని గుర్తుంచుకోవాలి.
  • పంచదార పూర్తిగా కరిగి బంకలా లేత తీగ పాకం వచ్చిందనుకున్నాక అందులో మంచి ఫ్లేవర్​ కోసం యాలకులపొడి, రెండు టీస్పూన్ల నిమ్మరసాన్ని వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పాకాన్ని దింపి పక్కనుంచాలి.
  • ఇలా పాకంలో నిమ్మరసం వేసుకోవడం ద్వారా చల్లారిన కూడా గట్టిగా అవ్వకుండా ఉంటుంది. అలాగే, జిలేబీలు కూడా జ్యూసీ జ్యూసీగా వస్తాయి.
Jalebi Recipe with Rava
Jalebi Recipe with Rava (Getty Images)
  • ఇప్పుడు అరగంట పాటు నానిన రవ్వ మిశ్రమాన్ని తీసుకుని అందులో బేకింగ్ సోడా వేసుకుని మిశ్రమం అంతా కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.
  • అనంతరం జిలేబీ ప్రిపరేషన్ కోసం పైపింగ్ బ్యాగ్ లేదా సాస్ బాటిల్ వాడుకోవచ్చు. అవి లేనట్లయితే పాల ప్యాకెట్ తీసుకొని శుభ్రంగా కడిగి ఒక వైపు పెద్దగా కట్ చేసుకోవాలి.
  • ఆపై కట్ చేసిన పాల ప్యాకెట్​ని ఒక గ్లాసులో ఉంచి దానిలో ముందుగా రెడీ చేసుకున్న రవ్వ మిశ్రమాన్ని తగినంత వేసుకోవాలి.
  • తర్వాత దాన్ని మూటలా కట్టి చివర్లో పిండి బయటకు వచ్చేలా ఒక చిన్న హోల్ చేసుకోవాలి.
Jalebi Recipe with Rava
Jalebi Recipe with Rava (ETV Bharat)
  • ఇప్పుడు జిలేబీలు వేయించడానికి స్టవ్ మీద కడాయిలో తగినంత నూనె పోసి వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక స్టవ్​ను లో ఫ్లేమ్​లో ఉంచి పాల ప్యాకెట్​లో ఉన్న పిండిని జిలేబీల్లా వత్తుకోవాలి.
  • పాన్​లో వేయించడానికి సరిపడా వత్తుకున్నాక వెంటనే కదపకుండా కాసేపు కాలనిచ్చి ఆపై గరిటెతో మరో వైపునకు టర్న్ చేసుకుని ఎర్రగా కాల్చుకోవాలి.
  • అవి మంచిగా కాలిన తర్వాత బయటకు తీసి కాస్త వేడి ఉండగానే ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పంచదార పాకంలో వేసి రెండు మూడు నిమిషాలు ఉండనివ్వాలి.
  • ఆపై సర్వింగ్ ప్లేట్​లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే చాలు. అంతే, జ్యూసీ జ్యూసీగా నోరూరించే "రవ్వ జిలేబీలు" రెడీ అవుతాయి!

శనగపిండి లేకుండానే కరకరలాడే "జంతికలు" - నూనె తక్కువ, రుచి ఎక్కువ!

నోరూరించే "పెసరపప్పు చెక్కలు" - సంక్రాంతి పండక్కి కరకరలాడించండి!