ETV Bharat / offbeat

రాగిపిండితో కరకరలాడే "గవ్వలు" - నూనె తక్కువ, రుచి ఎక్కువ!

ఇంటిల్లిపాదీ ఇష్టంగా తినే గవ్వలు - తక్కువ నూనెతోనే కరకరలాడుతాయి!

Ragi Gavvalu
Ragi Gavvalu (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : January 10, 2026 at 1:28 PM IST

2 Min Read
Choose ETV Bharat

Ragi Gavvalu Prepare in Telugu : సంక్రాంతి సెలవులు కావడంతో పిల్లలందరూ ఇంట్లోనే ఉంటారు. వారి కోసం ఇండ్లలో వివిధ రకాల తినుబండరాలు చేస్తుంటారు. అయినా చిన్నారులు కొత్తగా తినడానికి ఏదైనా కావాలని అడుగుతుంటారు. అందుకే ఇవాళ ఓ కొత్త రెసిపీని తీసుకొచ్చాం. అదే కరకరలాడే రాగి గవ్వలు. ఈ పద్ధతిలో వీటిని చేశారంటే టేస్ట్ అద్దిరిపోతుంది. నిమిషాల్లోనే ఇవి రెడీ అవుతాయి. అంతేకాక ఆయిల్ కూడా తక్కువగానే పీల్చుతాయి! వీటిని ఒక్కసారి చేసి డబ్బాలో వేసి ఉంచితే 15 రోజుల పాటు నిల్వ ఉంటాయి! మరి క్రిస్పీ, క్రంచీ రాగి గవ్వలు ఎలా చేయాలో ఇప్పుడు ఓ లుక్కేయండి.

"సేమియా ఉప్మా" పిల్లలు నచ్చట్లేదా? - ఓ సారిలా మార్చి చేశారంటే ఇష్టంగా తింటారు!

Ragi Gavvalu
రాగిపిండి (Getty Images)

కావాల్సిన పదార్థాలు :

  • రాగిపిండి - పావు కిలో (250 గ్రాములు)
  • గోధుమపిండి - పావు కిలో (250 గ్రాములు)
  • ఉప్పు - రుచికి సరిపడా
  • వాము - అర టేబుల్ స్పూన్
  • నువ్వులు - 2 టేబుల్ స్పూన్లు
  • ఆయిల్ - సరిపడా
Ragi Gavvalu
ఉప్పు (Getty Images)

తయారీ విధానం :

  • ఈ రెసిపీ కోసం ముందుగా మిక్సింగ్ బౌల్లో పావు కిలో రాగిపిండి, పావు కిలో గోధుమపిండి వేయాలి. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు, అర టేబుల్ స్పూన్ వాము, రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు వేసి కలపాలి.
  • ఆ తర్వాత నాలుగు టేబుల్ స్పూన్ల వేడి నూనె యాడ్ చేసి మిక్స్ చేయాలి. అనంతరం సరిపడా నీళ్లు పోసి పిండిని కాస్త గట్టిగా మిక్స్ చేసి 10 నిమిషాల పాటు పక్కనుంచాలి.
Ragi Gavvalu
నువ్వులు (Getty Images)
  • 10 నిమిషాల అనంతరం పిండిని మరో రెండు నిమిషాల పాటు బాగా కలపాలి. ఆ తర్వాత పిండిని చిన్నచిన్న బాల్స్​లాగా చేసుకోవాలి.
  • ఇప్పుడు గవ్వల చెక్కపై మైదాపిండి చల్లి పిండి బాల్స్​ను గవ్వల షేప్ వచ్చే విధంగా చేతితో వత్తుకోవాలి. లేదంటే ఫోర్క్​ మీద పిండి పెట్టి చేసుకోవచ్చు. లేదంటే కొత్త దువ్వెనతోనూ గవ్వల షేప్ వచ్చేలా చేయోచ్చు.
Ragi Gavvalu
గోధుమపిండి (Getty Images)
  • అదేవిధంగా స్టవ్ ఆన్ చేసి కడాయిలో నూనె పోయాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత రెడీ చేసుకున్న గవ్వలను కడాయికి సరిపడా వేయాలి. ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్​లో ఉంచి మూడు నిమిషాల పాటు అలాగే వదిలేయాలి.
  • ఆ తర్వాత రెండు వైపులా టర్న్ చేస్తూ దోరగా వేగనివ్వాలి. అనంతరం ప్లేట్​లో వేయాలి.
  • ఇక అంతే టేస్టీటేస్టీ క్రిస్పీక్రిస్పీ రాగి గవ్వలు సిద్ధమైనట్లే!
Ragi Gavvalu
వాము (Getty Images)
  • ఇవి చల్లారిన తర్వాత ఎయిర్​టైట్ డబ్బాలో ఉంచినట్లయితే 15 రోజుల వరకు నిల్వ ఉంటాయి!
  • ఇలా చేసి పెడితే పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ చాలా చాలా ఇష్టంగా తింటారు.
  • మరి ఆలస్యం చేయకుండా క్రిస్పీ, టేస్టీ రాగి గవ్వలను ఈ పద్ధతిలో ఓసారి ఇంట్లో ట్రై చేసి చూడండి!

నోటికి కొత్త రుచినిచ్చే "పాలక్ సోయా బుర్జీ" - కొత్తవాళ్లైనా ఇలా సింపుల్​గా చేసేయొచ్చు!

సంక్రాంతి స్పెషల్ "మినప జంతికలు" - ఆయిల్ తక్కువ, క్రంచీ ఎక్కువ!