నోట్లో వేసుకోగానే కరిగిపోయే "అరిసెలు" - ఈ సంక్రాంతికి ఇంట్లోనే తియ్యని వేడుక చేసుకోండి! !
అరిసెలను ఇలా ట్రై చేయండి - ఇంటిల్లిపాదీ వన్స్‌మోర్ అంటారంతే!

By ETV Bharat Andhra Pradesh Team
Published : January 8, 2026 at 12:11 PM IST
Ariselu Prepare in Telugu : సంక్రాంతి అనగానే ముందుగా అందరికి గుర్తొచ్చేది. అందమైన రంగవళ్లులు, గొబ్బెమ్మలతో పాటు ప్రతి ఇంట్లోనూ ఘుమఘుమలాడే పిండి వంటలు. ఇందులోనూ అరిసెలు తప్పనిసరి! ఇవి మెత్తగా నోట్లో వేసుకోగానే కరిగిపోతాయి. సాధారణంగా ఈ పండగ సమయంలో అరిసెలు లేని ఇళ్లు ఉండదంటే అతిశయోక్తి కాదు! చాలా మందికి వీటిని చేయడం రాదు. ఇవి ప్రిపేర్ చేయాలంటే కొందరు కష్టమని భావిస్తుంటారు.
ఎందుకంటే పాకం పట్టి అనంతరం వీటిని చేయాలి. కొన్నిసార్లు పాకం సరిగ్గా కుదరకపోతే అరిసెలు గట్టిగా వస్తాయి. అలాంటి వారు ఇక్కడ చెప్పిన విధంగా వీటిని ఓసారి చేశారంటే పొంగుతూ, ఎంతో మెత్తగా వస్తాయి. బిగినర్స్ కూడా ఈ స్టెప్స్ పాటిస్తూ ఈజీగా చేసేయోచ్చు. ఇలా ఇంట్లో చేసి పెట్టారంటే పిల్లలు భలే ఇష్టంగా తింటారు. మరి నోరూరించే అరిసెలు ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందామా?
సంక్రాంతి స్పెషల్ "మినప జంతికలు" - ఆయిల్ తక్కువ, క్రంచీ ఎక్కువ!

కావాల్సిన పదార్థాలు :
- రేషన్ బియ్యం - 400 గ్రాములు
- బెల్లం తురుము - పావు కిలో (250 గ్రాములు)
- పంచదార - 2 టేబుల్ స్పూన్లు
- నువ్వులు - పావు కప్పు
- ఆయిల్ - డీప్ ఫ్రైకి సరిపడా
- నెయ్యి - 1 టేబుల్ స్పూన్

తయారీ విధానం :
- ముందుగా గిన్నెలో 400 గ్రాముల రేషన్ బియ్యం వేసి కడగాలి. ఆ తర్వాత సరిపడా నీళ్లు పోసి 12 గంటల పాటు నానబెట్టాలి. 12 గంటల తర్వాత బియ్యాన్ని మిక్సీజార్‌లో వేసి గ్రైండ్ చేయాలి. ఆ తర్వాత పిండిని జల్లెడలో వేసి జల్లించాలి.
- అలాగే స్టవ్ ఆన్ చేసి పాన్‌లో పావు కిలో బెల్లం తురుము, రెండు టేబుల్ స్పూన్ల పంచదార, సరిపడా నీళ్లు పోసి కరిగించాలి. బెల్లం కరిగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి మిక్స్ చేయాలి.
- ఇప్పుడు సరిగ్గా పాకం వచ్చిందో లేదో తెలుసుకోవడానికి కొద్దిగా పాకాన్ని నీటిలో వేయాలి. అప్పుడు పాకం జారకుండా ఉండలెక్క వస్తే సరిపోయిందని గ్రహించాలి.

- ఆ తర్వాత మంటను లో ఫ్లేమ్‌లో ఉంచి పావు కప్పు నువ్వులు, పావు కిలో గ్రైండ్ చేసుకున్న బియ్యప్పిండి వేసి బాగా మిక్స్ చేయాలి. అనంతరం స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి.
- ఈ మిశ్రమం చల్లారిన తర్వాత పిండిని చిన్నచిన్న ముద్దలుగా చేసుకోవాలి. ఇప్పుడు పాలిథీన్ కవర్ మీద ఆయిల్ అప్లై చేసి ఒక్కొ పిండి ముద్దను అరిసెల మాదిరిగా చేసి పక్కనుంచాలి.

- అదేవిధంగా కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోయాలి. నూనె వేడైన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్‌లో ఉంచి కడాయికి సరిపడా అరిసెలను వేయాలి.
- ఆ తర్వాత రెండు వైపులా టర్న్ చేస్తూ దోరగా కాల్చుకోవాలి. ఆ తర్వాత వీటిని ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి.

- అంతే టేస్టీటేస్టీ అరిసెలు మీ ముందుంటాయి!
- మీకు ఈ రెసిపీ నచ్చితే ఓసారి ట్రై చేయండి.
అన్నం, కర్రీ చేయాల్సిన అవసరం లేదు - ఇలా చేస్తే లంచ్ బాక్స్ కళకళ!
రోజూ అవే దోసెలు, ఇడ్లీలు ఏం తింటారు? - కాస్త వెరైటీగా "ఇడియప్పం" ట్రై చేయండి!

