ETV Bharat / offbeat

కరకరలాడే "బెల్లం కొమ్ములు" - స్వీట్ షాప్ స్టైల్లో సింపుల్​గా చేసుకోవచ్చు!

సంక్రాంతి స్పెషల్ స్వీట్ బెల్లం కొమ్ములు - మంచి ఫ్లేవర్​ ఇలా జోడించండి!

bellam_kommulu
bellam_kommulu (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : January 2, 2026 at 10:57 AM IST

2 Min Read
Choose ETV Bharat

Bellam Kommulu : సంక్రాంతి వచ్చేస్తోంది. నోరూరించే పిండి వంటలకు ఇప్పటి నుంచే అంతా రెడీ అవుతున్నారు. అరిసెలు చేయడానికంటే ముందుగా ఇలా స్వీట్ షాప్ స్టైల్​లో బెల్లం కొమ్ములు తయారు చేసి పెట్టుకోండి. ఇవి నెలరోజులైనా చక్కగా ఉంటాయి. తయారీ కూడా చాలా సింపుల్​. ఇక్కడ ఇచ్చిన పద్ధతిలో ఓ సారి ట్రై చేసి చూడండి. కరకరలాడుతూ తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది.

పాలు, పంచదార కాంబోలో "మగ్జీ లడ్డూలు" - నోట్లో వేసుకోగానే కరిగిపోతాయి!

bellam_kommulu
bellam_kommulu (Getty images)

కావల్సిన పదార్థాలు :

  • మైదా - 1 కప్పు
  • గోధుమపిండి - 1 కప్పు
  • ఉప్మా రవ్వ - పావు కప్పు
  • ఉప్పు - కొద్దిగా
  • వంట సోడా - కొద్దిగా
  • యాలకుల పొడి - అర స్పూన్
  • నెయ్యి - 4 టేబుల్ స్పూన్లు
  • నూనె - డీప్ ఫ్రైకి సరిపడా
  • బెల్లం - 2 కప్పులు
bellam_kommulu
bellam_kommulu (Getty images)

తయారీ విధానం :

స్టెప్ 1 : ముందుగా పిండిని రెడీ చేసుకోవాలి.

స్టెప్ 2 : రెడీ చేసుకున్న కొమ్ములను డీప్ ఫ్రై చేసుకోవాలి.

స్టెప్ 3 : డీప్ ఫ్రై చేసుకున్న వాటికి బెల్లం కోటింగ్ ఇవ్వాలి.

bellam_kommulu
bellam_kommulu (Getty images)

తయారీ విధానం :

  • ముందుగా ఓ గిన్నెలోకి మైదా, గోధుమపిండి తీసుకోవాలి. మీకు నచ్చితే పూర్తిగా మైదా వాడుకోవచ్చు. పూర్తిగా గోధుమపిండితో కూడా చేసుకోవచ్చు. పిండిని ఓ గిన్నెలోకి తీసుకున్నాక అందులోనే పావు కప్పు ఉప్మా రవ్వ, ఉప్పుతో పాటు కొద్దిగా వంట సోడా, యాలకుల పొడి వేసుకుని కలపాలి. రవ్వ వేసుకోవడం వల్ల కొమ్ములు కాస్త క్రంచీగా వస్తాయి. యాలకుల పొడి మంచి ఫ్లేవర్ ఇస్తుంది.
  • పిండిలోకి నెయ్యి లేదా నూనె లేదా బటర్ మీకు నచ్చింది వేసుకుని మర్దనా చేస్తూ పిండికి బాగా పట్టించాలి. ఆ తర్వాత కొద్ది కొద్దిగా నీళ్లు పోస్తూ సాఫ్ట్ గా కలుపుకోవాలి. ఇపుడు మూత పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. మళ్లీ 10 నిమిషాల తర్వాత మూత తీసుకుని మరో సారి బాగా కలుపుకోవాలి.
bellam_kommulu
bellam_kommulu (Getty images)
  • ఇపుడు పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని రోల్ చేసుకోవాలి. మరీ పల్చగా కాకుండా కాస్త మందంగా ఉండేలా రోల్ చేయాలి. ఆ తర్వాత మీకు నచ్చిన షేప్​లో కట్ చేసుకోవాలి. ఇవి సన్నగా, 2 ఇంచుల పొడవుగా కట్ చేసుకుంటే చూడడానికి బాగుంటాయి. ఇలా అన్ని పిండి ముద్దలు రోల్ చేసుకుని ఆ తర్వాత కొమ్ముల షేప్​లో కట్ చేసుకుని ప్లేట్​లోకి తీసుకోవాలి.
  • ఇపుడు స్టవ్ పై కడాయి పెట్టుకుని నూనె వేడెక్కగానే ముందుగా కట్ చేసి పెట్టుకున్న పిండి కొమ్ములను వేసుకుని మీడియం ఫ్లేమ్​లో వేయించాలి. మంచి రంగు వచ్చాక ఒక ప్లేట్​లోకి తీసుకోవాలి.
bellam_kommulu
bellam_kommulu (Getty images)
  • ఇపుడు స్టవ్​పై మరో కడాయి పెట్టుకుని స్వీట్​కు సరిపడా బెల్లం తరుగు వేసుకుని కొద్దిగా నీళ్లు పోసుకుని కరిగించాలి. రెండు కప్పుల పిండిలోకి అంతే మొత్తంలో బెల్లం అవసరం ఉంటుంది. బెల్లం పూర్తిగా కరిగిపోయి తీగ పాకం వచ్చే వరకు కలుపుతూ ఉండాలి. పాకం తొందరగా రావాలంటే నీళ్లు తక్కువగా పోసుకుంటే సరిపోతుంది.
  • పాకం వచ్చిన తర్వాత యాలకుల పొడి, నెయ్యి వేసి కలిపి డీప్ ఫ్రై చేసిన కొమ్ములు వేసుకుని కలిపితే చాలు! గోరు వెచ్చగా చల్లారే వరకు పక్కన పట్టుకుని అతుక్కుపోయిన కొమ్మలను వేరు చేసుకుని పూర్తిగా చల్లారిన తర్వాత స్టోర్ చేసి పెట్టుకోండి.

ఆంధ్రా స్పెషల్ "ముల్లంగి మజ్జిగ పులుసు"- ఈ సరికొత్త రుచికి ఫిదా అయిపోతారు!

నిమిషాల్లోనే స్వీట్​కార్న్​తో "ఊతప్పం" - పప్పులు నానబెట్టకుండానే సరికొత్తగా, రుచికరంగా!