ETV Bharat / offbeat

సంక్రాంతి స్పెషల్​: సజ్జపిండితో రుచికరమైన "మురుకులు" - పైన క్రిస్పీగా, లోపల గుల్లగా!

-సజ్జపిండితో చేసుకునే ఆరోగ్యకరమైన వంటకం - అప్పటికప్పుడు చాలా సింపుల్​గా చేసుకోవచ్చు!

Sajja Murukulu Recipe
Sajja Murukulu Recipe (ETV Abhiruchi)
author img

By ETV Bharat Telangana Team

Published : January 9, 2026 at 2:28 PM IST

2 Min Read
Choose ETV Bharat

Sajja Murukulu Recipe: సంక్రాంతి పండగ అంటే పిండి వంటలకు ఫేమస్​. పండుగ వస్తుందంటే రకరకాల రెసిపీలు చేస్తుంటారు. అందులో మెజార్టీ పీపుల్ మురుకులు/జంతికలు చేస్తుంటారు. అయితే చాలా మంది వీటిని శనగపిండి, బియ్యప్పిండి, సగ్గుబియ్యం ఉపయోగించి రకరకాలుగా చేస్తుంటారు. కానీ చిరుధాన్యాల్లో ఒకటైన సజ్జలతో కూడా రుచికరమైన మురుకులు చేసుకోవచ్చు. సూపర్​ టేస్టీగా ఉంటాయి. పైన క్రంచీగా, లోపల గుల్లగా ఉండి నూనె పీల్చకుండా చాలా అంటే చాలా రుచికరంగా ఉంటాయి. తయారు చేసుకోవడం కూడా సులువే. మరి లేట్​ చేయకుండా ఆరోగ్యకరమైన సజ్జలతో రుచికరమైన మురుకులు ఎలా చేసుకోవాలో చూసేయండి.

Sajja Murukulu
సజ్జలు (Getty Images)

కావాల్సిన పదార్థాలు:

  • సజ్జ పిండి - 2 కప్పులు
  • వాము - 1 టీస్పూన్​
  • కారం - 2 టీస్పూన్లు
  • పసుపు - 1 టీస్పూన్​
  • ఇంగువ - పావు టీస్పూన్​
  • బియ్యప్పిండి - 4 టేబుల్​స్పూన్లు
  • ఉప్పు - రుచికి సరిపడా ఉప్పు
  • వెన్న - 4 టేబుల్​స్పూన్లు
Sajja Murukulu
బియ్యప్పిండి (Getty Images)

తయారీ విధానం:

  • ముందుగా ఈ టేస్టీ అండ్​ క్రిస్పీ మురుకుల కోసం సజ్జపిండిని జల్లించి తీసుకోవాలి.
  • మిక్సింగ్​ బౌల్​లోకి సజ్జపిండిని తీసుకోవాలి. అందులోకి వామును నలిపి తీసుకోవాలి.
  • ఆపై అందులోకి కారం, పసుపు, ఇంగువ, బియ్యప్పిండి, ఉప్పు, వెన్న వేసి పిండి మొత్తానికి కలిపేలా మిక్స్​ చేసుకోవాలి.
Sajja Murukulu
వెన్న (Getty Images)
  • వెన్న మొత్తం పిండికి పట్టేలా కలుపుకున్నాక కొద్దిగా తీసుకుని ముద్దలాగా చేసుకోవాలి. పిండి పర్ఫెక్ట్​ ముద్దలాగా రావాలి. ఒకవేళ అలా రాకపోతే మరికొంచెం వెన్న యాడ్​ చేసుకుని కలుపుకోవాలి.
  • ఇలా పిండిని పర్ఫెక్ట్​గా కలుపుకున్నాక కొద్దికొద్దిగా వాటర్​ పోసుకుంటూ మరీ గట్టిగా కాకుండా కాస్త చపాతీ ముద్ద మాదిరి సాఫ్ట్​గా కలుపుకోవాలి.
Sajja Murukulu
ఇంగువ (Getty Images)
  • స్టవ్​ ఆన్​ చేసి కడాయి పెట్టి డీప్​ఫ్రైకి సరిపడా నూనె పోసి వేడి చేసుకోవాలి.
  • ఆయిల్​ కాగేలోపు జంతికల గొట్టం తీసుకుని దాని లోపల కొద్దిగా నూనె రాయాలి. ఆపై ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని అందులో సరిపడా నింపాలి.
  • నూనె హీట్ అయ్యాక పిండిని ఒత్తుకోవాలి. ఈ విధంగా వేసుకున్నాక వెంటనే కదపకుండా కాసేపు కాలనిచ్చి ఆపై అటు ఇటు తిప్పేసుకుంటూ మీడియం ఫ్లేమ్​లో కాల్చుకోవాలి.
Sajja Murukulu
వాము (Getty Images)
  • నూనెలో నురగలు తగ్గి జంతికలు క్రిస్పీగా కాలాక వాటిని ఒక ప్లేట్​లోకి తీసుకుంటే చాలు. అలానే పిండి మొత్తాన్ని రెడీ చేసుకోవాలి.
  • ఇవి చల్లారాక ఏదైనా ఒక గాలి చొరబడని డబ్బాలో స్టోర్ చేసుకుంటే సజ్జపిండితో కరకరలాడే "మురుకులు" తయారవుతాయి!
Sajja Murukulu
సజ్జ మురుకులు (ETV Abhiruchi)

చిట్కాలు:

  • సజ్జల్లో తెల్లవి, పచ్చవి రెండూ ఉంటాయి. అయితే ఈ రెసిపీ కోసం తెల్ల సజ్జలు వాడుకోవచ్చు. పచ్చ సజ్జలు కాస్త చేదుగా ఉంటాయి. ఒకవేళ మీకు కావాలనుకుంటే పచ్చ సజ్జల పిండిని వాడుకోవచ్చు.
  • వెన్న లేకపోతే నూనె లేదా నెయ్యిని వేడి చేసుకుని పిండి మిశ్రమంలో వేసి చేతితో రబ్ చేస్తూ పిండి మొత్తం కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా చేయడం ద్వారా మురుకులు గుల్లగా, క్రిస్పీగా వస్తాయని గుర్తుంచుకోవాలి.
  • పిండిని చపాతీ ముద్దలా కలుపుకోవాలి. అయితే, పిండి కన్సిస్టెన్సీ మరీ గట్టిగా కాకుండా కాస్త లూజ్​గానే ఉండేటట్లు చూసుకోవాలి. అప్పుడే ఈజీగా ప్రెస్​ చేసుకోవడానికి వస్తాయి.

రాగిపిండితో కరకరలాడే "చెక్కలు" - పండక్కి పావుగంటలోనే తయార్!

గోధుమపిండి, మెంతి కాంబోలో "చిప్స్​" - కరకరలాడుతూ నెల రోజుల నిల్వ ఉంటాయి!