ETV Bharat / offbeat

'డీప్ ఫ్రిజ్' గడ్డకడితే మీరేం చేస్తారు? - టెక్నీషియన్లు సూచిస్తున్న సింపుల్ టిప్స్!

డీప్ ఫ్రిజ్​లో ఐస్ - కత్తులు, పదునైన ఆయుధాలు వాడితే మూల్యం చెల్లించుకోవాల్సిందే!

డీప్ ఫ్రీజర్ ఐస్
deep freezer (Getty images)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : August 26, 2026 at 10:23 AM IST

2 Min Read
Choose ETV Bharat

Fridge Cleaning : చాలా మంది డీప్ ఫ్రిజ్ లో ఐస్ గడ్డకట్టినపుడు కత్తులు, స్క్రూ డ్రైవర్ల లాంటి పదునైన ఆయుధాలతో తొలగించే ప్రయత్నం చేస్తుంటారు. ఆ తర్వాత దానిని మెకానిక్ దగ్గరికి తీసుకెళ్లే పరిస్థితి తీసుకొస్తారు. ఫ్రిజ్ విషయంలో చాలా మందికి ఇలాంటి అనుభవాలు సహజమే. పదునైన ఆయుధాలతో క్లీన్ చేయడం వల్ల లోపల ఉన్న కూలెంట్ లైన్లు దెబ్బతిని ఫ్రిజ్ రిపేర్​కు వస్తుందని నిపుణులు చెప్తున్నారు. దాదాపు అందరి ఇళ్లలో డీప్ ఫ్రిజ్​ మొత్తం మంచు పేరుకుపోయి ఉంటుంది. దానిని తొలగించడం గృహిణులకు తలకు మించిన భారమైపోతుంది. సురక్షితమైన మార్గాలు తెలుసుకుంటే మీ ఐస్ తొలగించడం పెద్ద కష్టమేమీ కాదు!

డీప్​ ఫ్రీజర్ గడ్డకట్టడం వల్ల లోపల కూలింగ్ సామర్థ్యం తగ్గిపోతుందని నిపుణులు చెప్తున్నారు. ఫ్రీజర్ కాయిల్స్‌పై మంచు పేరుకుపోవడం వల్ల శీతలీకరణ సామర్థ్యం 15 నుంచి 25 శాతం వరకు తగ్గుతుందని పరిశోధనలు నిరూపించాయి. అందుకే డీప్​ ఫ్రిజ్ గడ్డ కట్టకుండా చూసుకోవాలని సూచిస్తున్నారు. అలాగని కత్తులు లేదా వేడి నీళ్లు ఉపయోగించి మంచు తొలగించే ప్రయత్నం చేయడం ఏ మాత్రం సురక్షితం కాదు.

'మారుతున్న వంటగది రూపురేఖలు' - మోడ్రన్ కిచెన్ ఎలా ఉంటున్నాయంటే!

ఐస్ పేరుకుపోతే విద్యుత్ బిల్లుపై ప్రభావం

ఐస్ పేరుకుపోవడం వల్ల ఇతర సెల్ఫ్​ల్లో ఉన్న ఆహార పదార్థాలు చల్లబడటానికి ఎక్కువ సమయం పడుతుంది. దీనికి తోడు విద్యుత్ బిల్లు పెరుగుతుంది. అందుకే మంచు పేరుకుపోవడం మొదలైనప్పుడు, కత్తి తీసుకోవాలని, లేదా దానిపై వేడినీళ్లు పోయాలని అనిపించడం సహజం. వాస్తవానికి ఈ రెండు పనులూ మీ ఫ్రీజర్‌కు హాని కలిగిస్తాయని టెక్నీషియన్లు చెబుతున్నారు. పదునైన పనిముట్లు ఫ్రీజర్ లోపలి పొరను డ్యామేజ్ చేసే అవకాశం ఉంది. లేదా వెనుక అమర్చిన కూలెంట్ లైన్లను దెబ్బతీసే ప్రమాదం ఉంది. ఇటువంటి నష్టం ఖరీదైన మరమ్మతుకు దారి తీస్తుంది. అలాగని మరుగుతున్న వేడి నీరు పోయడం సురక్షితం కాదు. ఆకస్మిక వేడి ప్లాస్టిక్ షెల్ఫ్‌లను వంకరగా మార్చేస్తుంది. లేదా ప్యానెళ్లు, డోర్ సీల్స్‌ను దెబ్బతీస్తుంది. ఒకసారి సీల్ పోయిందంటే! కూలింగ్ కావడానికి చాలా సమయం పడుతుంది.

టెక్నీషియన్లు సిఫార్సు చేసే పద్ధతి

డీప్​ ఫ్రీజర్​లో ఐస్ తొలగించడానికి టెక్నీషియన్లు రెండు మార్గాలను సూచిస్తున్నారు. ముందుగా ఫ్రిజ్​ స్విచ్ ఆఫ్ చేసి ప్లగ్ తీసేయాలి. ఫ్రిజ్ డోర్ ఓపెన్ చేసి పెట్టాలి. ఫ్రీజర్ దగ్గర ఒక చిన్న ఫ్యాన్‌ను ఉంచడం వల్ల మంచు కరిగే ప్రక్రియ వేగవంతమవుతుంది.

లేదంటే గోరువెచ్చని నీటిని లోతు తక్కువ గిన్నెలలో తీసుకుని కొన్ని నిమిషాల పాటు ఫ్రీజర్ తలుపు మూసి పెట్టాలి. వేడి నీటి ఆవిరి ప్లాస్టిక్‌ను నేరుగా తాకకుండా, గోడలకు అంటుకున్న మంచును కరిగిస్తుంది. మంచు మెత్తబడిన తర్వాత దానిని ప్లాస్టిక్ స్క్రాపర్ లేదా గరిటెతో సులభంగా గీకి తీసివేయవచ్చు.

'అల్యూమినియం Vs స్టెయిన్‌లెస్ స్టీల్' - రోజువారీ వంటకు ఏ కుక్కర్ బెటర్?

కడాయి మాడిపోయిందా?! - ఇలా ఈజీగా చిటికెలో క్లీన్ చేసేయండి - కొత్తవాటిలా మెరిసిపోతాయి!