ETV Bharat / offbeat

కరకరలాడుతూ నోరూరించే "బీరకాయ గారెలు" - అద్భుతమైన రుచిని ఎంజాయ్ చేస్తారు!

బీరకాయతో సింపుల్​గా చేసుకునే రెసిపీ - ఇంటిల్లిపాదీ ఇష్టంగా తింటారు!

Beerakaya Garelu
Beerakaya Garelu (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : February 24, 2026 at 12:47 PM IST

2 Min Read
Choose ETV Bharat

Beerakaya Garelu Making : బీరకాయతో వివిధ రకాల రెసిపీలు చేస్తుంటారు. మరి వీటితో నోరూరించే గారెలు చేసుకోవచ్చని మీకు తెలుసా? లేదంటే మాత్రం ఇప్పుడు చెప్పబోయే పద్ధతిలో ఓసారి చేశారంటే మంచి రుచికరంగా వస్తాయి. అంతేకాక వీటిని ఎన్ని తిన్నా ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది. ముఖ్యంగా పిల్లలైతే ఒకటికి రెండు ఇష్టంగా తింటారు. బిగినర్స్ కూడా ఈస్టెప్స్ పాటిస్తూ ఈజీగా చేయొచ్చు. మరి ఇక లేట్ చేయకుండా బీరకాయ గారెలను ఎలా చేయాలి? ఇందుకు కావాల్సిన పదార్థాలేంటో ఇప్పుడు చూద్దాం.

రెస్టారెంట్ స్టైల్ "బెండకాయ మసాలా కర్రీ" - ఇంటిల్లిపాదీకి తెగ నచ్చేస్తుంది!

Beerakaya Garelu
బీరకాయలు (Getty Images)

కావాల్సిన పదార్థాలు :

  • బీరకాయ - 1
  • మినపప్పు - ఒక కప్పు
  • పచ్చిమిర్చి - 5
  • ఉల్లిపాయ - ఒకటి
  • నువ్వులు - 2 స్పూన్లు
  • అల్లం - అంగుళం ముక్క
  • కరివేపాకు - కొద్దిగా
  • ఉప్పు - రుచికి సరిపడా
  • నూనె - తగినంత
Beerakaya Garelu
ఉల్లిపాయ ముక్కలు (Getty Images)

తయారీ విధానం :

  • ఈ రెసిపీ కోసం ముందుగా గిన్నెలో కప్పు మినపప్పు వేసి శుభ్రంగా కడగాలి. ఆ తర్వాత ఇందులో సరిపడా నీళ్లు పోసి 7 గంటల పాటు నానబెట్టాలి.
  • ఏడు గంటల అనంతరం పప్పును మిక్సీ జార్​లో వేసి, కొద్దిగా నీళ్లు పోసి పిండిని కాస్త గట్టిగా ఉండేలా గ్రైండ్ చేసి పక్కనుంచాలి.
Beerakaya Garelu
పచ్చిమిర్చి (Getty Images)
  • అలాగే ఒక బీరకాయను కడిగి పొట్టుతీసి గ్రేటర్​ సన్నగా తురుముకోవాలి. ఆ తర్వాత బీరకాయ తురుమును గట్టిగా పిండి వాటర్​ను వడకట్టాలి. అదేవిధంగా ఒక ఉల్లిపాయ, కొద్దిగా కరివేపాకు, అంగుళం ముక్క అల్లం, ఆరు పచ్చిమిర్చిని వీలైనంత సన్నగా తరిగి ఉంచాలి.
  • ఇప్పుడు మిక్సింగ్ బౌల్లో గ్రైండ్ చేసుకున్న మినప్పిండి, తరిగి ఉంచిన బీరకాయ, పచ్చిమిర్చి తరుగు వేయాలి. అలాగే సన్నని అల్లం, ఉల్లిపాయ, కరివేపాకు తరుగు యాడ్ చేసి కలపాలి. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు, రెండు స్పూన్ల నువ్వులు వేసి బాగా మిక్స్ చేయాలి.
Beerakaya Garelu
నువ్వులు (Getty Images)
  • అదేవిధంగా స్టవ్ ఆన్ చేసి కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసి వేడి చేయాలి. ఆయిల్ కాగిన తర్వాత మంటను లో ఫ్లేమ్​లో ఉంచాలి. ఇప్పుడు చేతిని తడి చేసి ముందుగా కలిపి పెట్టుకున్న మినప్పిండిలో నుంచి పిండిని కొద్దికొద్దిగా తీసుకుంటూ గారెల్లా వత్తుకుని కాగుతున్న నూనెలో నెమ్మదిగా వేయాలి.
Beerakaya Garelu
మినపప్పు (Getty Images)
  • కడాయికి సరిపడా గారెలను వేసి రెండు నిమిషాల పాటు అలాగే వదిలేయాలి. ఆ తర్వాత మంటను మీడియం ఫ్లేమ్​లో ఉంచి గారెలను గరిటెతో రెండు వైపులా టర్న్ చేస్తూ గోల్డెన్​ కలర్ వచ్చేంత వరకు వేయించి ప్లేట్​లో వేయాలి.
  • అంతే కరకరలాడే బీరకాయ గారెలు సిద్ధంగా ఉంటాయి!
  • ఈ గారెలను అల్లం లేదా కొబ్బరి చట్నీతో కలిపి సర్వ్ చేసి తిన్నారంటే సూపర్ అనాల్సిందే. నచ్చితే మీరూ ఓసారి ఈ విధంగా ట్రై చేయండి.
  • మీరు ఈ గారెలను ఎక్కువ మోతాదులో చేసుకోవాలనుకుంటే మినపప్పు, బీరకాయతో పాటు ఇతర పదార్థాలను అందుకనుగుణంగా పెంచి తీసుకోవాలి.

టమోటా ధర తగ్గింది - "పండు మిర్చితో నిల్వ పచ్చడి" ఇలా పెట్టేయండి!

ఘుమఘుమలాడే "వంకాయ జీడిపప్పు మసాలా" - ఇలాంటి కర్రీ అద్భుతంగా ఉంటుంది!