ETV Bharat / offbeat

బియ్యప్పిండితో "మైసూర్ బోండాలు" - ఇలా చేస్తే క్రంచీగా, గుల్లగా వస్తాయి!

బియ్యప్పిండితో బోండాలు - ఒక్కసారి తింటే వన్స్​మోర్ అంటారంతే!

Mysore Bonda
Mysore Bonda (Getty Images)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : February 21, 2026 at 4:27 PM IST

2 Min Read
Choose ETV Bharat

Wheat Flour Mysore Bajji in Telugu : హోటల్స్​ లేదా టిఫిన్ సెంటర్స్​కి వెళ్లినప్పుడు వేడివేడి మైసూర్​ బోండాలు తినాలని చాలా మందికి అనిపిస్తుంది. ఇవి నోటికి కొత్త రుచినిస్తూ తిన్నాకొద్ది తినాలనిపించడమే ఇందుకు కారణం. అయితే వీటిని ఎక్కువగా మైదాపిండితో తయారు చేస్తారు. ఇంట్లో కూడా ఈ బోండాలను ప్రిపేర్ చేసి తింటారు. అయితే రోటీన్​కి భిన్నంగా ఈసారి బియ్యప్పిండితో ఇవి చేశారంటే పర్ఫెక్ట్​ షేప్​ రావడంతో పాటు లోపల పిండి ఉడికి, గుల్లగా వస్తాయి. ఒక్కసారి ఇలా చేసి రుచి చూస్తే మళ్లీమళ్లీ ఇలానే తయారు చేస్తారు. అంతేకాక పిల్లలు, పెద్దలు ఎంతో ఇష్టంగా తింటారు. మరి సింపుల్​గా ఈ మైసూర్​ బోండాలను ఎలా ప్రిపేర్​ చేయాలో ఇప్పుడు తెలుసుకుందామా?

నోటికి ఏమీ తినబుద్ధి కావట్లేదా? - ఇలా "బీట్​రూట్ రసం" ట్రై చేయండి!

Mysore Bonda
బియ్యప్పిండి (Getty Images)

కావాల్సిన పదార్థాలు :

  • గోధుమపిండి - ఒక కప్పు
  • బియ్యప్పిండి - 2 కప్పులు
  • బేకింగ్ సోడా - ఒక టీ స్పూన్
  • పెరుగు - ఒకటిన్నర కప్పు
  • జీలకర్ర - ఒక టీ స్పూన్
  • పచ్చిమిర్చి - 4
  • ఉల్లిపాయలు - 2
  • అల్లం ముక్కలు - కొన్ని
  • కరివేపాకు - కొద్దిగా
Mysore Bonda
గోధుమపిండి (Getty Images)

తయారీ విధానం :

  • ఈ రెసిపీ కోసం ముందుగా మిక్సింగ్ బౌల్లో రెండు కప్పుల బియ్యప్పిండి, ఒక కప్పు గోధుమపిండి వేసి కలపాలి. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు, ఒక టీ స్పూన్ బేకింగ్​ సోడా, ఒకటిన్నర కప్పు పెరుగు యాడ్ చేసి బాగా మిక్స్ చేయాలి.
  • అనంతరం కొద్దికొద్దిగా నీళ్లు పోస్తూ పిండిని బోండాల పిండి కన్సిస్టెన్సీ వచ్చేలా కలపాలి. ఆ తర్వాత 10 నిమిషాల పాటు ఆపకుండా ఒకటే డైరెక్షన్​లో పిండిని బాగా కలుపుతూ మిక్స్ చేయాలి. ఇలా చేయడం వల్ల బోండాలు గుల్లగా వస్తాయి. ఆ తర్వాత మూతపెట్టి రెండు గంటల పాటు పక్కనుంచాలి.
Mysore Bonda
కరివేపాకు (Getty Images)
  • అదేవిధంగా రెండు ఉల్లిపాయలు, నాలుగు పచ్చిమిర్చి, కొద్దిగా అల్లాన్ని తరిగి ఉంచాలి.
  • రెండు గంటల అనంతరం పిండిలో కట్ చేసి పెట్టుకున్న ఉల్లి,పచ్చిమిర్చి, అల్లం ముక్కలు వేసి కలపాలి. ఇందులోనే ఒక టీ స్పూన్ జీలకర్ర, కొదిగా కరివేపాకు యాడ్ చేసి మరో ఐదు నిమిషాల పాటు మిక్స్ చేయాలి.
Mysore Bonda
ఉల్లిపాయలు, అల్లం (Getty Images)
  • అనంతరం స్టవ్​ ఆన్​ చేసి కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోయాలి. నూనె వేడైన తర్వాత పిండిని కొద్దికొద్దిగా తీసుకుంటూ బోండాల మాదిరిగా కడాయికి సరిపడా వేసి రెండు నిమిషాల పాటు అలాగే వదిలేయాలి.
  • రెండు నిమిషాల అనంతరం బోండాలను రెండు వైపులా టర్న్ చేస్తూ దోరగా వేయించి ప్లేట్​లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి.
Mysore Bonda
పెరుగు (Getty Images)
  • అంతే బియ్యప్పిండితో కమ్మని బోండాలు రెడీ అయినట్లే!
  • ఈ బోండాలను టమోటా లేదా పల్లీ చట్నీతో తింటే సూపర్​గా ఉంటుంది.
Mysore Bonda
జీలకర్ర (Getty Images)
  • ఈ పద్ధతిని పాటిస్తూ ఇంట్లో చేసి పెట్టారంటే ఇంటిల్లిపాదీకి ఫేవరెట్ రెసిపీగా మారుతుంది!

నోరూరించే "దోసకాయ కుర్మా" - అన్నం, చపాతీల్లోకి అద్భుతంగా ఉంటుంది!

లంచ్​లోకి ఏం చేయాలో తోచనపుడు ఇలా ట్రై చేయండి - పిల్లలు, పెద్దలు టేస్టీగా తింటారు!