కమ్మని "బొప్పాయి కూర" - ఒక్కసారి తింటే మీ ఫేవరెట్ రెసిపీ అయిపోతుంది!
పచ్చి బొప్పాయితో నోరూరించే కర్రీ - ఇలా చేస్తే అద్భుతంగా వస్తుంది!

By ETV Bharat Andhra Pradesh Team
Published : February 25, 2026 at 11:47 AM IST
Raw Papaya Curry in Telugu : బొప్పాయి అన్ని సీజన్లలో లభిస్తుంది. వీటిని నార్మల్‌గా తింటారు. కానీ దీనితో కర్రీ చేసుకోవచ్చని మీకు తెలుసా? లేదంటే మాత్రం ఇప్పుడు చెప్పబోయే పద్ధతిని పాటిస్తూ చేశారంటే సూపర్‌గా వస్తుంది. ఇది రెగ్యులర్ రెసిపీలు తిని బోరింగ్‌గా అనిపించిన వారికి ఒక మంచి ఆప్షన్. ఇలా చేస్తే ఎన్నడూ తినని కొత్త టేస్ట్‌ను ఎంజాయ్ చేస్తారు. ఇది ప్రిపేర్ చేయడానికి ఎక్కువ టైమ్ కూడా పట్టదు. ఇక లేట్ చేయకుండా పచ్చి బొప్పాయితో కర్రీ ఎలా చేయాలి? ఇందుకు కావాల్సిన పదార్థాలేంటో ఇప్పుడు చూద్దాం.
కరకరలాడుతూ నోరూరించే "బీరకాయ గారెలు" - అద్భుతమైన రుచిని ఎంజాయ్ చేస్తారు!

కావాల్సిన పదార్థాలు :
- పచ్చి బొప్పాయి - 1
- ఉల్లిపాయలు - 2
- పచ్చిమిర్చి - 4
- ఆయిల్ - 4 స్పూన్లు
- ఉప్పు - రుచికి సరిపడా
- కారం - ఒకటిన్నర టేబుల్ స్పూన్
- మిరియాల పొడి - 1 టీ స్పూన్
- కరివేపాకు - కొద్దిగా
- అల్లం తరుగు - 1 టీ స్పూన్
- తాలింపు దినుసులు - 1 టేబుల్ స్పూన్
- కొత్తిమీర - కొంచెం
- కొబ్బరి తురము 1 టీ స్పూన్
- పసుపు - అర టీ స్పూన్

తయారీ విధానం :
- ఈ రెసిపీ కోసం ముందుగా ఒక పచ్చి బొప్పాయిని శుభ్రంగా కడిగి పొట్టు తీసుకోవాలి. ఆ తర్వాత చిన్నచిన్న ముక్కలుగా కట్ చేయాలి. అలాగే రెండు ఉల్లిపాయలు, నాలుగు పచ్చిమిర్చిని తరిగి ఉంచాలి.
- ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నెలో కట్ చేసి పెట్టుకున్న బొప్పాయి ముక్కలు, సరిపడా నీళ్లు, పావు టీ స్పూన్ పసుపు వేసి ఉడికించాలి. బొప్పాయి ముక్కలు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.

- అనంతరం స్టవ్ ఆన్ చేసి పాన్‌లో మూడు స్పూన్ల ఆయిల్ పోయాలి. నూనె వేడైన తర్వాత తరిగి ఉంచిన ఉల్లి,పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించాలి.
- ఆనియన్స్ వేగాక ఒక టీ స్పూన్ అల్లం తరుగు యాడ్ చేసి వేగనివ్వాలి. ఇందులోనే ఉడికించిన బొప్పాయి ముక్కలు వేసి కలుపుతూ ఫ్రై చేయాలి.
- ఈ మిశ్రమం వేగిన తర్వాత ఒకటిన్నర టేబుల్ స్పూన్ కారం, ఒక టీ స్పూన్ మిరియాల పొడి, పావు టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసి వేగనివ్వాలి.
- ఆ తర్వాత ఒక టీ స్పూన్ కొబ్బరి తురుము, కొద్దిగా కొత్తిమీర తరుగు వేసి మిక్స్ చేయాలి.

- మరోవైపు తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసి కడాయిలో ఒక స్పూన్ నూనె పోయాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ తాలింపు దినుసులు, కొద్దిగా కరివేపాకు వేసి వేగనివ్వాలి.
- ఆ తర్వాత తాలింపును బొప్పాయి మిశ్రమంలో యాడ్ చేసి కలపాలి.

- అంతే ఘుమఘుమలాడే బొప్పాయి కూర సిద్ధంగా ఉంటుంది!
- ఈ పద్ధతిని పాటిస్తూ ఇంట్లో చేశారంటే పిల్లలు, పెద్దలూ వన్స్‌మోర్ అంటారంతే.
నోరూరించే "చిల్లీ పనీర్ 65" - ఇలా చేస్తే ఒక్క ముక్క మిగల్చరు!
'గంజి' కదా అని వదిలేస్తున్నారా? - ఉపవాసం టైంలో ఇలా చేశారంటే ఆరోగ్య ప్రయోజనాలు!

