ETV Bharat / offbeat

రంజాన్ స్పెషల్ "చికెన్ జహాపనా" - ఎన్నడూ తినని టేస్ట్​ని ఎంజాయ్ చేస్తారు!

చికెన్​తో సింపుల్​గా చేసుకునే రెసిపీ - నోటికి సరికొత్త రుచిని ఇస్తుంది!

Chicken Jahanpanah
Chicken Jahanpanah (Getty Images)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : February 26, 2026 at 12:10 PM IST

2 Min Read
Choose ETV Bharat

Chicken Jahanpanah Recipe : ముస్లింలు అత్యంత పవిత్రంగా భావించే రంజాన్ మాసం ప్రారంభమైంది. తెల్లవారుజామున సెహరి, సాయంత్రం ఇఫ్తార్‌ విందులతో సందడి వాతావరణం నెలకొంది. ఇక ఈ నెల అంటే ఘుమఘుమలాడే వంటలకు కేరాఫ్​ అడ్రస్. అందుకే ఇవాళ మీకోసం ఓ కొత్త రెసిపీని పరిచయం చేస్తున్నాం.​ అదే చికెన్ జహాపనా. ఓసారి ఇలా చేసి ఇది తిన్నారంటే మళ్లీమళ్లీ చేసుకోవాలనిపిస్తుంది. మరి ఈ రెసిపీ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం.

మండే ఎండల్లో ఒంటికి చలువ చేసే "జొన్న అంబలి" - నోటికి రుచిగా, పొట్టకి హాయిగా!

Chicken Jahanpanah
చికెన్ (Getty Images)

కావాల్సిన పదార్థాలు :

  • చికెన్ - ఒక కేజీ
  • పెరుగు - అర కప్పు
  • అల్లంవెల్లుల్లి పేస్ట్ - 4 టేబుల్ స్పూన్లు
  • టమోటా ప్యూరీ - అర కప్పు
  • పచ్చిమిర్చి - 6
  • ఉల్లిపాయలు - 6
  • లవంగాలు - 8
  • యాలకులు - 6
  • షాజీరా - 1 స్పూన్
  • దాల్చినచెక్క - 2
  • బిర్యానీ ఆకులు - 2
  • పసుపు - 1 స్పూన్
  • కారం - 2 స్పూన్లు
  • ధనియల పొడి - 2 స్పూన్లు
  • గరం మసాలా - 1 స్పూన్
  • ఉప్పు - రుచికి సరిపడా
  • నెయ్యి - 4 టేబుల్ స్పూన్లు
  • ఆయిల్ - 6 టేబుల్ స్పూన్
  • కొత్తిమీర - కొద్దిగా
  • నిమ్మరసం - 2 టేబుల్ స్పూన్లు
  • పుదీనా - కొంచెం
  • జీలకర్ర పొడి - 1 స్పూన్
Chicken Jahanpanah
పెరుగు (Getty Images)

తయారీ విధానం :

  • ఈ రెసిపీ కోసం ముందుగా గిన్నెలో కేజీ చికెన్ వేసి శుభ్రంగా కడిగి పక్కనుంచాలి. అలాగే ఆరు ఉల్లిపాయలు, ఆరు పచ్చిమిర్చిని తరిగి ఉంచాలి.
  • ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయిలో నాలుగు టేబుల్ స్పూన్ల నెయ్యి, ఆరు టేబుల్ స్పూన్ల నూనె వేయాలి. ఇవి వేడైన తర్వాత రెండు బిర్యానీ ఆకులు, రెండు దాల్చినచెక్క, ఆరు యాలకులు, ఎనిమిది లవంగాలు, ఒక స్పూన్ షాజీరా వేసి వేయించాలి.
Chicken Jahanpanah
ఉల్లిపాయ ముక్కలు (Getty Images)
  • మసాలాలు చక్కగా వేగాక తరిగి ఉంచిన ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేవరకు ఫ్రై చేయాలి. ఆనియన్స్ వేగాక కొద్దిగా పుదీనా, నాలుగు టేబుల్ స్పూన్ల అల్లంవెల్లుల్లి పేస్ట్, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేసి వేగనివ్వాలి.
  • అనంతరం అర కప్పు టమోటా ప్యూరీ యాడ్​ చేసి ఆయిల్ పైకి తేలెంత వరకూ ఫ్రై చేయాలి. ఆ తర్వాత అర కప్పు పెరుగు, సరిపడా నీళ్లు పోయాలి.
Chicken Jahanpanah
అల్లంవెల్లుల్లి పేస్ట్ (Getty Images)
  • ఇందులోనే రెండు స్పూన్ల కారం, ఒక స్పూన్ పసుపు, ఒక స్పూన్ జీలకర్ర పొడి, రెండు స్పూన్ల ధనియాల పొడి వేయాలి. అలాగే ఒక స్పూన్ గరం మసాలా, రుచికి సరిపడా ఉప్పు, చికెన్ ముక్కలు వేసి కలపాలి. ఆ తర్వాత మూతపెట్టి మంటను మీడియం ఫ్లేమ్​లో ఉంచి ఉడికించాలి.
  • ఈ మిశ్రమం చక్కగా ఉడికాక కొంచెం కొత్తిమీర, రెండు టేబుల్ స్పూన్ల నిమ్మరసం వేసి మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
Chicken Jahanpanah
మసాలా దినుసులు (Getty Images)
  • అంతే ఘుమఘుమలాడే చికెన్ జహాపనా సిద్ధంగా ఉంటుంది!
  • ఇలా ఇంట్లో చేసి పెట్టారంటే ఇంటిల్లిపాదీకి ఫేవరెట్ రెసిపీగా మారుతుంది.

రాయలసీమ స్టైల్ "పచ్చిమిర్చి పప్పు" - ఒక్కసారి తింటే మళ్లీమళ్లీ చేసుకుంటారు!​

కరకరలాడే "అటుకుల సమోసాలు" - మైదా లేకుండా సింపుల్​గా ఇలా చేయండి!