ETV Bharat / offbeat

నోట్లో వేసుకోగానే కరిగిపోయే "షీర్ కుర్మా" - రంజాన్ మాసంలో ఇలాగే చేస్తుంటారు!

రంజాన్ 2026 స్పెషల్ షీర్ కుర్మా - ఇంట్లోనే తియ్యని వేడుక చేసుకోండి!

Sheer Khurma
Sheer Khurma (Getty Images)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : February 18, 2026 at 2:36 PM IST

2 Min Read
Choose ETV Bharat

Sheer Khurma in Telugu : ముస్లింలకు రంజాన్ మాసం ఎంతో పవిత్రమైనది. ఈ మాసంలో మనకు వేడివేడి హలీమ్ గుర్తుకొస్తుంది. ఇదే కాకుండా షీర్ కుర్మా అంటే చాలా మందికి ఫేవరెట్. దీనిని సాధారణ రోజుల్లోనూ ప్రిపేర్ చేస్తుంటారు. అయితే కొన్నిసార్లు ఇది చేసినప్పుడు గట్టిగా పడటమో లేదా సరిగ్గా కుదరకపోవడమో జరుగుతుంది. అలాంటి వారు ఇప్పుడు చెప్పబోయే స్టెప్స్ పాటిస్తూ చేశారంటే పర్ఫెక్ట్​గా వస్తుంది. బిగినర్స్ కూడా ఈ పద్ధతిలో సింపుల్​గా చేసుకోవచ్చు. మరి ఈ స్వీట్ రెసిపీ చేయడానికి కావాల్సిన పదార్థాలేంటి? ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందామా?

"పాలకూర పచ్చి బఠానీ కర్రీ" - ఇదొక్కటి చాలు పూరీ, రైస్​లో పర్ఫెక్ట్​గా ఉంటుంది!

Sheer Khurma
పాలు (Getty Images)

కావాల్సిన పదార్థాలు :

  • సేమియా - ఒక కప్పు
  • ఎండు ఖర్జూరం - 6
  • బాదం పలుకులు - 10
  • జీడిపప్పు - 15
  • పిస్తాపప్పు - 10
  • నెయ్యి - 6 టేబుల్ స్పూన్లు
  • చిరోంజి పప్పు - 2 టేబుల్ స్పూన్లు
  • పాలు - 1 లీటర్
  • కండెన్సడ్ మిల్క్ - 300 ఎంఎల్ లేదా పంచదార - పావు కిలో (250 గ్రాములు)
  • కిస్​మిస్ - పావు కప్పు
  • యాలకుల పొడి - అర టీ స్పూన్
Sheer Khurma
డ్రైఫ్రూట్స్ (Getty Images)

తయారీ విధానం :

  • ముందుగా మిక్సింగ్ బౌల్లో ఆరు ఎండు ఖర్జూరం, 10 బాదం, 15 జీడిపప్పు, 10 పిస్తాపప్పులు వేయాలి. ఇందులో సరిపడా వేడి నీళ్లు నాలుగు గంటల పాటు నానబెట్టాలి. 4 గంటల అనంతరం ఎండు ఖర్జూరం, బాదం, జీడిపప్పును ముక్కలుగా కట్ చేసుకోవాలి.
  • ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్​లో మూడు టేబుల్ స్పూన్ల నెయ్యి వేయాలి. నెయ్యి కరిగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఎండు ఖర్జూరం ముక్కలు, జీడిపప్పు పలుకులు, బాదం, పిస్తా పలుకులు, రెండు టేబుల్ స్పూన్ల చిరోంజి పప్పు వేసి వేయించాలి. ఇవి బాగాక ప్లేట్​లో వేయాలి.
Sheer Khurma
నెయ్యి (Getty Images)
  • ఇదే పాన్​లో మూడు టేబుల్ స్పూన్ల నెయ్యి వేయాలి. నెయ్యి కరిగిన తర్వాత కప్పు సేవియా వేయాలి. ఇప్పుడు మంటను లో ఫ్లేమ్​లో ఉంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేవరకు వేయించాలి. ఆ తర్వాత వీటిని ఓ ప్లేట్​లోకి తీసుకోవాలి.
  • ఇంకోవైపు స్టవ్ ఆన్ చేసి కడాయిలో లీటర్ పాలు పోసి మరిగించాలి. పాలు మరుగుతున్నప్పుడు 300 ఎంఎల్ కండెన్సడ్​ మిల్క్ లేదా పావు కప్పు 250 గ్రాముల పంచదార వేసి కలపాలి.
Sheer Khurma
యాలకులు (Getty Images)
  • ఇందులోనే పావు కప్పు కిస్​మిస్ యాడ్ చేసి మిక్స్ చేయాలి. ఆ తర్వాత వేయించిన డ్రైఫ్రూట్స్ వేసి కలపాలి. అనంతరం మంటను లో ఫ్లేమ్​లో ఉంచి ఫ్రై చేసి పెట్టుకున్న సేవియా వేసి 15 నిమిషాల పాటు ఉడికించాలి.
  • పదిహేను నిమిషాల అనంతరం అర టీ స్పూన్ యాలకుల పొడి వేసి మిక్స్ చేయాలి.
  • అంతే నోరూరించే షీర్ కుర్మా సిద్ధంగా ఉంటుంది!

నోటికి కొత్త రుచినిచ్చే "టమోటా మెంతి సోయా కర్రీ" - కొత్తవాళ్లైనా ఇలా సింపుల్​గా చేసేయొచ్చు!

లంచ్​లోకి ఏం చేయాలో తోచనపుడు ఇలా ట్రై చేయండి - పిల్లలు, పెద్దలు టేస్టీగా తింటారు!