'రాఖీ పౌర్ణమి నాడే చంద్రగ్రహణం' - జ్యోతిషులు ఏమంటున్నారంటే!
వచ్చేది పాక్షిక చంద్ర గ్రహణమే - పగటి వేళ, మన దగ్గర కనిపించే అవకాశమే లేదు!

By ETV Bharat Andhra Pradesh Team
Published : August 24, 2026 at 10:02 AM IST
Rakhi Pournami 2026 Timing : ఆగస్టు 28న పౌర్ణమి సందర్భంగా చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఈ పాక్షిక చంద్రగ్రహణం అమెరికా, యూరప్, ఆఫ్రికాలో మాత్రమే కనిపిస్తుంది తప్ప భారతదేశంలో కనిపించదు. అదే రోజున రక్షాబంధన్ పర్వదినం, పౌర్ణమి, చంద్రగ్రహణం రావడం మరో విశేషం. అయితే, గ్రహణం రోజున రాఖీ కట్టవచ్చా? ఏ సమయంలో రాఖీ కట్టాలి అనే సందేహాలు సహజమే. ఈ నేపథ్యంలో 'గ్రహణ దర్శనం' కీలకం కానుంది. ఏర్పడుతున్నది పాక్షిక చంద్రగ్రహణమే అయినా, అది మన దేశంలో అస్సలు కనిపించదు కాబట్టి ఎలాంటి ఇబ్బందులు లేవని ప్రముఖ జ్యోతిషులు, పంచాగ కర్త డా.శంకరమంచి శివ సిద్ధాంతి వెల్లడించారు.
చంద్రునిలో 93శాతం భాగం భూమి అంబ్రా (కాంతి ఛాయ)లో ఉంటుందని నాసా శాస్త్రవేత్తలు తెలిపారు. దీనివల్ల ప్రత్యేక వీక్షణ పరికరాలు అవసరం లేకుండానే గ్రహణాన్ని నేరుగా చూడొచ్చని పేర్కొన్నారు. గ్రహణం సందర్భంగా వెండి చంద్రుడు కాస్తా రాగి రంగులో కనిపిస్తాడు.
'రాయలసీమ, దక్షిణ కోస్తా' ప్రజలకు గుడ్ న్యూస్ - మరో రెండు ఎక్స్ప్రెస్ రైళ్లు రెగ్యులర్!
గ్రహణం గరిష్ట స్థాయిలో ఉన్నప్పుడు చంద్రుని వ్యాసంలో సుమారు 93 శాతం భూమి అంబ్రాలో ఉంటుంది. వాతావరణం సూర్యకాంతిని వడపోయడం వల్ల, చంద్రుడు ముదురు, తుప్పు లేదా రాగి రంగులో కనిపిస్తాడు. అమెరికాలో ఈ పాక్షిక గ్రహణం రాత్రి 11:12 గంటల నుంచి తెల్లవారుజామున 1:13 గంటల వరకు ఉంటుంది.
2026 సంవత్సరంలో ఇదే చివరి చంద్రగ్రహణం. మార్చిలో ఏర్పడిన సంపూర్ణ చంద్రగ్రహణం తర్వాత ఇది వస్తోంది కాబట్టి గ్రహాల స్థితిగతులపై ప్రభావం చూపుతుందని పలువురు జ్యోతిషులు పేర్కొంటున్నారు. కానీ, ఆ భయాలేమీ అక్కర్లేదని డా.శంకరమంచి శివ సిద్ధాంతి వివరించారు.
చంద్రగ్రహణం ఏ రాశిలో?
ఈ పాక్షిక చంద్రగ్రహణం కుంభరాశి-శతభిష నక్షత్ర పరిధిలో ఏర్పడుతుంది. వాస్తవానికి గ్రహణ దర్శనం లేని ప్రాంతాలకు గ్రహణ ఫలితాలను వర్తింపజేయడం సరికాదు.
- ఆగస్టు 28న గ్రహణ సమయాలు
- ఉపచ్ఛాయా గ్రహణ ప్రారంభం: ఉదయం 6:53
- పాక్షిక గ్రహణ ప్రారంభం: ఉదయం 8:03
- గ్రహణ గరిష్ఠ స్థితి: ఉదయం 9:43 ప్రాంతంలో
- పాక్షిక గ్రహణ ముగింపు: ఉదయం 11:22
- ఉపచ్ఛాయా గ్రహణ ముగింపు: మధ్యాహ్నం 12:32
- ఈ సమయాల్లో మన దగ్గర పగలు ఉంటుంది కాబట్టి చంద్రుడు కనిపించే అవకాశాల్లేవు.
ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.
ఉద్యోగం, చదువు రీత్యా ఊరెళ్లడం కుదరట్లేదా? - 'వర్చువల్ రాఖీ'తో పండగ చేసుకోండిలా!
భూమిపై 'నరకానికి ద్వారం' - కరాకుమ్ ఎడారిలో భయానక అగ్నిగుండం!

