రైలులో మీ సీట్లో మరొకరు కూర్చున్నారా? - గొడవక్కర్లేదు ఈ "నంబర్‌కు" మెసేజ్ పెడితే చాలు!
-మీ రైలు ప్రయాణం సాఫీగా సాగాలంటే - ఈ నంబర్స్ గుర్తుంచుకోవాల్సిందే!

Published : February 26, 2026 at 3:14 PM IST
Railway Helpline Number : మనలో మెజార్టీ పీపుల్ దూర ప్రయాణమనగానే ట్రైన్ జర్నీని ఎంచుకుంటుంటారు. తక్కువ ఖర్చుతో సౌకర్యవంతంగా ప్రయాణించవచ్చని రైలు ప్రయాణానికి మొగ్గు చూపుతుంటారు. ఇందుకోసం కొన్ని రోజులు లేదా నెలల ముందుగానే వారు వెళ్లాల్సిన ప్రదేశాలకు సంబంధించి టికెట్లు బుక్ చేసి సీట్లు కన్ఫార్మ్ చేసుకుంటుంటారు. ఎందుకంటే బెర్త్, సీటు కన్ఫార్మ్ లేకుండా రైళ్లలో ప్రయాణించడం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది.
ఇదిలా ఉంటే కొంతమంది ఎలాంటి రిజర్వేషన్ లేకుండానే రైలు ఎక్కడంతో పాటు రిజర్వ్ చేసుకున్న సీట్లు, బెర్తులు ఆక్రమించేస్తుంటారు. రిజర్వ్డ్ సీట్ అని చెప్పినా పట్టించుకోరు. ఇదేంటి? తమకు రిజర్వ్ చేసిన సీట్లో కూర్చున్నారని ప్రశ్నిస్తే వాదనలకు దిగుతుంటారు. కానీ, మీకు తెలుసా? అలాంటి సమయాల్లో ఎలాంటి గొడవలు, ఘర్షణలు లేకుండా, చాలా ఈజీగా మీరు రిజర్వేషన్ చేసుకున్న సీటును పొందొచ్చని చెబుతున్నారు రైల్వే అధికారులు. అందుకోసం ఈ నంబర్‌కు జస్ట్ ఒక చిన్న మెసేజ్ చేస్తే సరిపోతుందంటున్నారు. మరి, ఏంటి ఆ నంబర్? మెసేజ్ ఏమని చేయాలో ఇప్పుడు చూద్దాం.
రైలులో ప్రయాణించేటప్పుడు ఎవరైనా మీకు రిజర్వ్ అయినా సీట్లో కూర్చుంటే ముందుగా ఆ వ్యక్తికి మీ రిజర్వేషన్ టికెట్ చూపించి సర్ది చెప్పే ప్రయత్నం చేయాలి. టికెట్ చూపించి పరిస్థితిని వివరించాక కూడా అతడు లేదా ఆమె ఖాళీ చేయడానికి నిరాకరిస్తే ఈ నంబర్‌కు SMS చేయండి. దాంతో మీ సమస్యకు ఈజీగా పరిష్కారం దొరుకుతుంది.
ఈ నంబర్‌కు మెసేజ్ పెట్టండి!
రైలులో ప్రయాణిస్తున్నప్పుడు మీరు రిజర్వ్ చేసుకున్న సీటును ఎవరైనా ఆక్రమిస్తే ఈ నంబర్‌కు మెసేజ్ పెట్టండి. వెంటనే మీ ఇష్యూ క్లియర్ అయిపోతుంది. ఇందుకోసం మీ మొబైల్ నుంచి "139" అనే నంబర్‌కు ఒక ప్రత్యేకమైన ఫార్మాట్లో SMS సెండ్ చేయాలి.
ఏమని మెసేజ్ చేయాలంటే?
ముందుగా "SEAT" అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ PNR నంబర్‌ను ఎంటర్ చేయాలి. తర్వాత ఒక స్పేస్ ఇచ్చి మీ సీట్ నంబర్ ఎంటర్ చేసి స్పేస్ ఇచ్చి OCCUPIAED BY UNKNOWN PASSENGER" అని టైప్ చేసి 139 నంబర్‌కు పంపాలి(ఉదా - SEAT 1234567890 45 Occupied by Unknown Passenger)! అప్పుడు వెంటనే మీ ట్రైన్లో ఉన్న TC, రైల్వే పోలీసులకు నోటిఫికేషన్ వస్తుంది. అనంతరం రైల్వే పోలీసులు లేదా సిబ్బంది మీ దగ్గరకు చేరుకుని సమస్యను పరిష్కరిస్తారు. దాంతో మీరు రిజర్వ్ చేసుకున్న సీటులో సౌకర్యవంతంగా ప్రయాణం కొనసాగిస్తారు!
గ్యాస్ సిలిండర్‌పై ఉండే ఈ "నంబర్" ఏంటో తెలుసా?! - పేలుడుకు కారణం కావొచ్చు!
ఈ యాప్ ద్వారానూ ప్రాబ్లమ్ సాల్వ్!
మీరు RailMadad యాప్ ద్వారా కంప్లైయింట్ చేసినా టికెట్ ఇష్యూను ఈజీగా క్లియర్ చేసుకోవచ్చంటున్నారు రైల్వే అధికారులు. మరి కంప్లైంట్ ఎలా చేయాలంటే..
- ముందుగా మీ మొబైల్లో రైల్‌మదద్ వైబ్‌సైట్ https://railmadad.indianrailways.gov.in ను ఓపెన్ చేయాలి.
- అనంతరం మీ ఫోన్ నంబర్ ఎంటర్ చేసి Get OTPపై క్లిక్ చేయాలి. ఆ తర్వాత OTP నమోదు చేయాలి.
- నెక్ట్స్ మీ PNR నంబర్ ఎంటర్ చేయాలి. తర్వాత టైప్ ఆప్షన్‌పై క్లిక్ చేసి మీ కంప్లైంట్‌ను సెలెక్ట్ చేసుకోవాలి.
- ఆపై ఇన్సిడెంట్ డేట్ సెలెక్ట్ చేసి కంప్లైయింట్ను వివరంగా రాసి ప్రోసీడ్ ఆప్షన్‌పై క్లిక్ చేస్తే చాలు!
- మీరు చేసిన కంప్లైయింట్ వెంటనే రైల్వే శాఖకు అందుతుంది. వారు తగిన చర్యలు తీసుకుని మీ సీటును మీకు ఇప్పిస్తారు!
- అలాగే, మీ కంప్లైయింట్ స్టేటస్‌ను ఆన్లైన్లో చూసుకునే వెసులుబాటు ఉంటుంది.
RPF హెల్ప్‌లైన్ :
ట్రైన్లో మీకు ఎదురయ్యే ఏదైనా సమస్యను పరిష్కరించడానికి మీరు RPF హెల్ప్‌లైన్ సహాయం కూడా తీసుకోవచ్చు. సీటు లేదా శాంతి భద్రతల సమస్యకు సంబంధించి రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్‌ను సంప్రదించవచ్చు. "182" నంబర్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేసినా కూడా మీ సమస్యకు పరిష్కారం పొందవచ్చంటున్నారు రైల్వే అధికారులు.
ట్రాఫిక్ సిగ్నళ్ల వద్ద "MNL, VAC, ATC" అక్షరాలు గమనించారా? - వాటి అర్థమేంటో తెలుసా?

