ETV Bharat / offbeat

ఎలా గుర్తుపట్టాలో తెలుసా 'బంగారం'! - రంగు చూసి చెప్పేయొచ్చు!

బంగారంలో ఏం కలుపుతారు? - తయారీలో వాడే లోహాల రహస్యమిదే!

gold_quality_check
gold_quality_check (Getty images)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : June 29, 2026 at 12:06 PM IST

2 Min Read
Choose ETV Bharat

GOLD QUALITY CHECK : బంగారంలో కలిపే లోహాల ఆధారంగా రంగు, మెరుపు మారుతుంది. రాగి కలిపితే ఎరుపు వర్ణం వచ్చే 'రోజ్‌ గోల్డ్‌'గా, వెండి కలపడం వల్ల తేలికపాటి రంగుతో మరింత మెరుస్తుంది. జింక్‌, నికెల్ వంటి ఇతర లోహాలు కలిపినపుడు బంగారం బలంగా మారుతుంది. బంగారంలో వివిధ రకాల లోహాలను కలిపి విభిన్న రంగుల్లో, డిజైన్లలో ఆభరణాలు తయారు చేస్తుంటారు.

gold_quality_check
gold_quality_check (Getty images)

మెడలో హారం, చెవి దిద్దులు, చేతి బ్రేస్​లెట్, వేళ్లకు ఉంగరాలు! ఇలా బంగారు నగలు అనేకం ఉన్నా వాటి తయారీ సహా మెరుపు కోసం ఇతర లోహాలను కలపడం అనివార్యం. అందుకే నగలన్నీ ఒకే రంగులో ఉండవు. బంగారాన్ని మెరిపించడానికి, ఆకర్షణీయంగా తీర్చిదిద్దడానికి తయారీదారులు లోహాలను ఉపయోగిస్తుంటారు. ఇతర లోహాల శాతం ఆధారంగా బంగారాన్ని క్యారెట్లలో కొలుస్తుంటారు.

ఎంతో సున్నితమైన బంగారంలో రాగి, నికెల్, వెండి, పల్లాడియం వంటి లోహాలను కలిపితేనే ఆభరణాలు తయారు చేయడానికి వీలవుతుంది. బంగారంలో ఇతర లోహాలు ఎంత మొత్తంలో కలిపారో 'క్యారెట్‌' తెలుపుతుంది. అందుకే "24 క్యారెట్లు, 22 క్యారెట్లు, 18 క్యారెట్లు" అని బంగారం స్వచ్ఛతను కొలుస్తారు. క్యారెట్ వాల్యూ పెరిగే కొద్ది బంగారం స్వచ్ఛత పెరిగి ధర ఎక్కువగా ఉంటుంది.

మెరిసేదంతా బంగారం కాదండీ! - ఆభరణాలు కొనేటప్పుడు ఈ టిప్స్​ పాటిస్తే బెస్ట్​!

gold_quality_check
gold_quality_check (Getty images)

బంగారం స్వచ్ఛతను ఫైన్‌నెస్, దాని రంగును చూసి గుర్తించొచ్చు. 24 క్యారెట్ల బంగారం మెరుస్తూ ఉంటే 22 క్యారెట్ల బంగారం మెరుపు కాస్త తక్కువగా, డార్కిష్‌గా ఉంటుంది. ఇతర లోహాలు కలిసేకొద్దీ బంగారం రంగు మారుతుంది. వైట్ గోల్డ్‌లో నికెల్ ఎక్కువగా ఉంటుంది.

24 క్యారెట్ల బంగారం (Pure Gold) 99.9 శాతం స్వచ్ఛమైంది. ఇందులో ఇతర లోహాలేవీ ఉండవు. దీని ధర ఎక్కువగా ఉంటుంది. ఇక 22 క్యారెట్ల బంగారం (91.6 శాతం)లో మిగిలిన రెండొంతుల్లో రాగి, జింక్ లాంటి లోహాలు కలిసి ఉంటాయి. అందుకే 24 క్యారెట్ల బంగారంతో పోల్చి చూస్తే 22 క్యారెట్ల బంగారం బలంగా ఉంటుంది. ఆభరణాల తయారీకి అనుగుణంగా ఉంటుంది.

gold_quality_check
gold_quality_check (Getty images)

ఇక 18 క్యారెట్ల బంగారంలో ఆరు భాగాలు ఇతర లోహాలు కలిసి ఉంటాయి. ఇందులో బంగారం స్వచ్ఛత 75 శాతం కాగా, 25 శాతం జింక్, రాగి, నికెల్ లాంటి లోహాలు ఉంటాయి. 24, 22 క్యారెట్ల బంగారం కంటే ఇది మరింత దృఢంగా ఉంటుంది. 14 క్యారెట్ల బంగారంలో 58.3 శాతం పుత్తడి, మిగిలిన 41.7 శాతం ఇతర లోహాలు ఉంటాయి. మార్కెట్లో 10 క్యారెట్లు, 9 క్యారెట్ల బంగారం కూడా అందుబాటులో ఉంది.

మీకు తెలుసా?

చాలా మంది వన్ గ్రామ్ గోల్డ్ నగల్లో 1శాతం బంగారం ఉంటుందనుకుంటారు. కానీ, అది నిజం కాదు. రాగి, ఇత్తడి, వెండితో తయారు చేసిన నగలకు బంగారం రంగు పూస్తారు.

బులియన్ మార్కెట్​లోకి 'జొన్నగిరి' గోల్డ్​ - ఏపీ మ్యాప్‌తో మెరుస్తున్న 24 క్యారెట్ల స్వచ్ఛత

బంగారం, వెండిపై కేంద్రం కీలక నిర్ణయం- భారీగా పెంచిన దిగుమతి సుంకం