ETV Bharat / offbeat

రోడ్లు బాగోలేకపోతే బిల్లులు ఇవ్వరు - కాంట్రాక్టర్ల నాసిరకం పనులకు చెక్!

సిమెంట్, రాయి, కంకర, ఇసుక ప్రతీదీ పక్కాగా - నాణ్యతలో తేడా వస్తే మూడురెట్ల రికవరీ!

రోడ్ల నాణ్యత పరీక్షలు
రోడ్ల నాణ్యత పరీక్షలు (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : October 13, 2026 at 2:42 PM IST

3 Min Read
Choose ETV Bharat

Road Quality Checker : రోడ్డు బాగుంటేనే ప్రయాణం బాగుంటుంది. ఏ మాత్రం లోపాలున్నా వాహనాలపై ప్రభావం పడుతుంది. ఈ నేపథ్యంలో రోడ్డు నిర్మాణంలో నాణ్యతా లోపాలను గుర్తించేందుకు ప్రత్యేక క్వాలిటీ కంట్రోల్ ఏజెన్సీ పనిచేస్తుంది. రోడ్డు నిర్మాణంలో మట్టి, కంకర, తారు లేయర్లు సరిగ్గా ఉన్నాయా లేవా? సిఫార్సు చేసిన మెటీరియల్ ఉపయోగించారా లేదా? అనేది పరిశీలిస్తుంది.

రహదారులు నిర్మాణంలో ఏమాత్రం లోపాలున్నా అది నాణ్యతపై ప్రభావం చూపుతుంది. వాహనాల మైలేజీ తగ్గడంతో పాటు అవి త్వరగా పాడయ్యే అవకాశం ఉంటుంది. ఒక వేళ నమూనాలో తేడాలుంటే ప్రమాదాలూ జరగొచ్చు. గుత్తేదారులు ఇవన్నీ పట్టనట్టు నాణ్యత లేకుండా, తూతూమంత్రంగా పనులుచేసి చేతులు దులిపేసుకుంటారు. ఎంచక్కా బిల్లులు దండుకుంటారు. అయితే, ఇకపై అది కుదరదు. పనుల్లో తేడాలున్నా, నిర్మాణంలో లోపాలున్నా నాణ్యత నియంత్రణ విభాగం(క్వాలిటీ కంట్రోల్ ఏజెన్సీ) ఇట్టే పట్టేస్తుంది. ఇండియన్ రోడ్ కాంగ్రెస్ (ఐఆర్సీ), మోర్త్ సూచించిన ప్రమాణాలు, నిబంధనల మేరకు రహదారులు నిర్మించేలా పర్యవేక్షిస్తుంది. నిర్మాణ పనుల్లో వినియోగించే మెటీరియల్ నుంచి, అది పూర్తయ్యే దాకా పలు రకాల పరీక్షలు నిర్వహించి నాణ్యతను నిర్ధారిస్తుంది. ఒకవేళ నాసి రకం పనులుచేస్తే వాటిని తిరిగి సరి చేయిస్తుంది.

ప్రాణం పోయాక 'బ్రేక్' వేస్తే ఏం లాభం! - డ్రైవింగ్ సీట్లో ఉన్నప్పుడు గుర్తుంచుకోవాల్సిన అంశాలివే!

ఆమోదించినవే వినియోగించాలి

నిర్మాణంలో వాడే సిమెంట్, రాయి, కంకర, స్టీల్, ఇసుక తదితర మెటీరియల్ ఏదైనా బోర్డు ఆఫ్ ఇంజినీర్స్ బృందం సిఫార్సు చేసినవి మాత్రమే వినియోగించాలి. పని అంచనాల రూపకల్పనలోనే నిర్దిష్ట సామగ్రి వాడాలని సూచిస్తారు. నిర్దేశిత గనుల నుంచే కంకర, రాయి లాంటివి తీసుకురావాలి. సిఫార్సు చేసిన మెటీరియలా? కాదా అని నిర్మాణ ప్రదేశంలో ఉండే జేఈ, ఏఈలు చెక్ చేసి నాణ్యతను ధ్రువీకరించుకున్నాకే పనులు ప్రారంభమవుతాయి.

నాణ్యతా విభాగం రిలీజ్ చేయకుండా ఏ వస్తువునూ విని యోగించడానికి వీల్లేదు. వస్తువుల నాణ్యతలో లోపా బుంటే మేజర్ డీవియేషన్గా గా గుర్తిస్తుంది.

లోపాలు, తేడాలుంటే ఉన్నతాధికారులకు రాతపూర్వకంగా తెలియజేస్తుంది. ఆ మెటీరియల్ వెనక్కి పంపి తిరిగి నిర్దేశిత ప్రమాణాల ప్రకారం తీసుకురావాలని సూచిస్తుంది. ఒకసారి క్వాలిటీ కంట్రోల్ విభాగం అప్రూవ్ చేసిన దస్త్రాలు, ప్రొసీజర్లను మార్చకూడదు.

గుత్తేదారుడే బాధ్యత

నిర్మాణ దశలో ప్రమాణాలకు అనుగుణంగా పనులు చేయాల్సిన బాధ్యత గుత్తేదారుడిదే. ఎన్డీబీ, పీఎంజీఎస్​వై పథకాల పనులైతే నిర్మాణం పూర్తయినప్పటి నుంచి ఐదేళ్ల వరకు నిర్వహణను కూడా చూడాల్సి ఉంటుంది. ఆలోపు నాణ్యత లోపిస్తే గుత్తేదారే సరిచేయాలి. ప్యాచ్ వర్కులు, తారు, కూలీలు, యంత్రాలు ఇలా ప్రతి దానికయ్యే వ్యయాన్ని గుత్తేదారు సమకూర్చుకోవాల్సి ఉంటుంది.

రికవరీ విధానమిలా!

నిర్మాణం పూర్తయ్యాక ప్రయోగ పరీక్షలు, క్షేత్రస్థాయి(షీల్డ్ జాబ్) నివేదికలు వచ్చాకే బిల్లుల చెల్లింపు ఉంటుంది. వీటన్నింటినీ నాణ్యత నియంత్రణ విభాగం పరిశీలించిన తర్వాతే బిల్లు చెల్లించడానికి సిఫార్పు చేస్తుంది. పనుల్లో తేడాలున్నట్లు గుర్తిస్తే 10 శాతం లోపు అయితే రెండింతలు, అంతకుమించి ఉన్నట్లు తేలితే మూడు రెట్లు రికవరీలు పెడతారు.

ప్రతి దశలోనూ పరిశీలన

రహదారుల నిర్మాణంలో భాగంగా మట్టి పరిచే దగ్గరి నుంచి తారు వేసే దాకా ప్రతి దశలోనూ నాణ్యతను పరిశీలిస్తాం. మట్టి రేణువుల పరిమాణం, తేమ శాతాన్ని రోడ్ రోలర్​తో పరీక్షించి కోర్ కటింగ్ తీసి రోడ్డు పటిష్టతను నిర్ధారిస్తాం. నమూనా ప్రకారం 75 ఎంఎం, 100 ఎంఎం కంకర వినియోగించారా? అని కొలుస్తాం. కంకర పొడవుగా, మరీ పలుచగా లేకుండా వాహనాల బరువుకు పొడిగా మారకుండా బలంగా ఉండేలా చూస్తాం తారు పరిమాణం, సమానంగా ఉందా? లేదా? అని సిమెంట్ మిశ్రమ పరీక్షచేసి నాణ్యతను నిర్ధారిస్తాం అని ఏలూరు నాణ్యత నియంత్రణ విభాగం డీఈ కోటేశ్వర్​రావు వెల్లడించారు.

చికెన్ షాప్​ దగ్గర ఇవి గమనించారా? - మీ కళ్లెదుటే కనిపించే వీటిని గుర్తించండి!

పిండి మిల్లు దగ్గర నిలబడే పని లేదు - ఈ మెషిన్​తో ఇంట్లోనే నచ్చిన 'పొడి పిండి' రెడీ!