ETV Bharat / offbeat

సండే స్పెషల్ "కాజు రైస్, ప్రాన్స్ కోకోనట్ పులావ్" - టమోటా కెచప్​తో ఇలా ట్రై చేయండి!

జీడిపప్పు, రొయ్యల పులావ్ - ఎన్నడూ తెలియని రుచి ఖాయం!

kazu_rice_prawns_pulao_recipe
kazu_rice_prawns_pulao_recipe (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : January 4, 2026 at 10:47 AM IST

2 Min Read
Choose ETV Bharat

kazu rice prawns pulao recipe in telugu : సండే వచ్చిందంటే ఎప్పుడూ చికెన్ పులావ్, చికెన్ బిర్యానీ మాత్రమేనా? ఓ సారిలా జీడిపప్పు, ఫ్రాన్స్ పులావ్ ట్రై చేయండి. ప్రతి ముద్ద ఎంతో రుచిగా ఉంటుంది. టమోటాలకు బదులుగా టమోటా కెచప్​తో ట్రై చేసి చూడండి. కొత్తరుచిని ఆస్వాదించవచ్చు.

"చేపల కర్రీ" బాగా కుదరాలంటే ఈ టిప్స్ పాటించండి - మరుసటి రోజు ఘుమఘుమలాడుతుంది!

kazu_rice_prawns_pulao_recipe
kazu_rice_prawns_pulao_recipe (Getty images)

కావలసిన పదార్థాలు :

  • రొయ్యలు - 200 గ్రాములు
  • ఉల్లిపాయలు - 2
  • జీడిపప్పు - 15
  • దాల్చిన చెక్క - 2 ఇంచులు
  • షాజీరా - అర టేబుల్ స్పూన్
  • మరాఠీ మొగ్గ - 1
  • అనాస పువ్వు - 1
  • లవంగాలు - 4
  • యాలకులు - 3
  • జాపత్రి - కొద్దిగా
  • జాజికాయ - సగం
  • ఉప్పు - రుచికి సరిపడా
  • పచ్చిమిర్చి - 3
  • అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1.5 టేబుల్ స్పూన్లు
  • నూనె - 6 టేబుల్ స్పూన్లు
  • పుదీనా - కొద్దిగా
  • కొత్తిమీర - కొద్దిగా
  • టమాటా కెచప్ - 1 టేబుల్ స్పూన్
  • బియ్యం - 2 కప్పులు
  • కొబ్బరి పాలు - అర కప్పు
  • కరివేపాకు - 1 రెమ్మ
  • నెయ్యి - 2 టేబుల్ స్పూన్లు
kazu_rice_prawns_pulao_recipe
kazu_rice_prawns_pulao_recipe (Getty images)

తయారీ విధానం :

  • ముందుగా స్టవ్ వెలిగించి బిర్యానీ కడాయి (మందంగా ఉన్నది) పెట్టుకోవాలి. కడాయిలో నూనె వేసుకుని వేడి అయిన తర్వాత జీడిపప్పు ఎర్రగా వేయించి పక్కకు తీసుకోవాలి.
kazu_rice_prawns_pulao_recipe
kazu_rice_prawns_pulao_recipe (Getty images)
  • మళ్లీ అదే కడాయిలో మిగిలిన నూనెలో మసాలా దినుసులు వేయించాలి. దాల్చిన చెక్క, షాజీరా, మరాఠీ మొగ్గలు, లవంగాలు, యాలకులు, అనాస, జాపత్రి వేసుకున్నాక సన్నగా, పొడవుగా కట్ చేసిన అర కప్పు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి.
kazu_rice_prawns_pulao_recipe
kazu_rice_prawns_pulao_recipe (Getty images)
  • ఇపుడు రుచికి సరిపడా ఉప్పు వేస్తే ఉల్లిపాయలు తొందరగా వేగుతాయి. ఆ తర్వాత 3 పచ్చిమిర్చి చీలికలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి నూనెలో మగ్గి వాసన పోయి నూనె తేలాక టమోటా కెచప్, క్లీన్ చేసుకున్న రొయ్యలు వేసి ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత పుదీనా, కొత్తిమీర వేసుకుని వాసన పోయాక ఎసరు పోసుకోవాలి.
kazu_rice_prawns_pulao_recipe
kazu_rice_prawns_pulao_recipe (Getty images)
  • ఎసరు మరుగుతున్నపుడు నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకోవాలి. ఆ తర్వాత కొబ్బరిపాలు, కరివేపాకు, జాజికాయ పొడి వేసుకుని కలపాలి. ఇపుడు వేయించిన జీడిపప్పు, నెయ్యి వేసుకుని మూతపెట్టుకుని మీడియం ఫ్లేమ్​లో 10 నిమిషాల పాటు దమ్ కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత మరో 5 నిమిషాలు లో ఫ్లేమ్​లో ఉడికించాలి. అంతే! ఈ రొయ్యల పులావ్ అద్దిరిపోతుంది. ఈ సంక్రాంతికి కొత్తగా ఇలా ట్రై చేయండి.

"ఉడిపి స్టైల్ ఆలూ బిర్యానీ" - ఇలా ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు!

అసలైన "ఆంధ్రా పులావ్" - ఇలా చేశారంటే కమ్మగా లాగించేస్తారు!