ETV Bharat / offbeat

'ప్రియాంక చోప్రా' ఇష్టంగా తినే "ఉల్లిపాయ పచ్చడి"! - మీరూ ఓసారి రుచి చూడండి!

- పచ్చి ఉల్లిపాయలతో అద్దిరిపోయే 'పచ్చడి' - బ్యాచిలర్స్ కూడా సింపుల్​గా రెడీ చేసుకోవచ్చు!

Priyanka Chopra Favourite Pickle Recipe
Priyanka Chopra Favourite Pickle Recipe (Eenadu)
author img

By ETV Bharat Telangana Team

Published : November 12, 2025 at 10:31 AM IST

2 Min Read
Choose ETV Bharat

Priyanka Chopra Favourite Pickle Recipe : మనలో చాలా మందికి రోటి పచ్చళ్లు అంటే చాలా ఇష్టం. ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఏదైనా కమ్మని పచ్చడి ఉంటే చాలు దాంతో ఆ పూట తృప్తిగా భోజనం చేసిన ఫీలింగ్ పొందుతారు. అలాగే, పప్పు, పెరుగు, రసం వంటి వాటిల్లోకి సైడ్​ డిష్​గా ఏదో ఒక పచ్చడి తోడైతే ఆ రుచి అద్భుతంగా ఉంటుంది. అయితే, నార్మల్ పీపుల్ మాత్రమే కాదు కొంతమంది సెలబ్రిటీలు కూడా పచ్చళ్లు తినడానికి ఎక్కువ ఇష్టపడుతుంటారు.

అందులో భాగంగానే ప్రముఖ బాలీవుడ్ నటి 'ప్రియాంక చోప్రా' ఇష్టంగా తినే ఒక పచ్చడి రెసిపీని మీ కోసం తీసుకొచ్చాం! అదే, నోరూరించే "ఉల్లిపాయ పచ్చడి". ఈ రెసిపీని తక్కువ పదార్థాలతో చాలా సింపుల్​గా తయారు చేసుకోవచ్చు. పచ్చి ఉల్లిపాయలతో చేసుకునే దీని టేస్ట్ కూడా భలే కమ్మగా ఉంటుంది. వేడివేడి అన్నంతోపాటు చైనీస్ వంటకాల్లోకి అద్దిరిపోతుంది. బ్యాచిలర్స్​తో పాటు బిగినర్స్ కూడా ఈ పచ్చడిని ఈజీగా రెడీ చేసుకోవచ్చు. మరి, ప్రియాంక మెచ్చే ఈ పచ్చడికి కావాల్సిన పదార్థాలేంటి? ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

Ullipaya Pachadi
ఉల్లిపాయలు (Getty Images)

కావాల్సిన పదార్థాలు :

  • ఉల్లిపాయలు - మూడు
  • పచ్చిమిర్చి - నాలుగు
  • సోంపుపొడి - రెండు చెంచాలు
  • ఆమ్​చూర్ పొడి - ఒక చెంచా
  • పసుపు - అరచెంచా
  • కశ్మీర్​కారం - చెంచా
  • చాట్​మసాలా - ఒక చెంచా
  • ఇంగువ - అర చెంచా
  • ఉప్పు - రుచికి తగినంత
  • నూనె - కొద్దిగా (తాలింపు కోసం)
  • కరివేపాకు - ఒకట్రెండు రెమ్మలు
  • నిమ్మరసం - అరచెక్క

మార్నింగ్ చేసిన ఇడ్లీలు మిగిలాయా? - ఈవెనింగ్ స్నాక్​గా "టిక్కా" చేయండి!

Ullipaya Pachadi
పచ్చిమిర్చి (Getty Images)

తయారీ విధానం :

  • ఈ సింపుల్ అండ్ టేస్టీ పచ్చడి తయారీ కోసం ముందుగా ఉల్లిపాయలను నిలువుగా సన్నని చీలికలుగా కట్ చేసుకోవాలి. అలాగే, పచ్చిమిర్చీలను నిలువుగా తరుక్కుని పక్కనుంచాలి.
  • ఇప్పుడు ఒక వెడల్పాటి మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న సన్నని ఉల్లిపాయ చీలికలు, పచ్చిమిర్చి చీలికలు, దంచిన సోంపుపొడి, ఆమ్​చూర్ పొడి, పసుపు, కశ్మీర్​కారం, చాట్​మసాలా, రుచికి తగినంత ఉప్పు వేసుకుని ఒకసారి ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిసిలా బాగా కలుపుకోవాలి.
Ullipaya Pachadi
పోపుదినుసులు (Getty Images)
  • అనంతరం అందులోకి తాలింపును సిద్ధం చేసుకోవాలి. అందుకోసం స్టవ్ మీద చిన్న కడాయి పెట్టి కొద్దిగా నూనె వేసి వేడి చేసుకోవాలి.
  • ఇక్కడ మామూలు కన్నా ఆవనూనె వాడితే పచ్చడి మరింత రుచికరంగా వస్తుంది.
  • నూనె లైట్​గా వేడయ్యాక అందులో ఇంగువ, కరివేపాకు వేసి లో ఫ్లేమ్​లో తాలింపును మంచిగా వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
  • తర్వాత ఆ తాలింపును ముందుగా రెడీ చేసుకున్న ఉల్లిపాయ మిశ్రమంలో వేసి అంతా కలిసేలా కలపాలి.
Ullipaya Pachadi
కరివేపాకు (Getty Images)
  • ఇక చివరిగా అందులో నిమ్మరసం పిండి కలిపి సర్వ్ చేసుకోండి. అంతే, వేడివేడి అన్నంలోకి అద్దిరిపోయే "ఉల్లిపాయ పచ్చడి" నిమిషాల్లోనే రెడీ అవుతుంది!
  • ప్రియాంక చోప్రా ఇష్టంగా తినే ఈ పచ్చడి వేడివేడి అన్నంలోకి మాత్రమే కాకుండా చైనీస్ వంటకాల్లోకి చాలా బాగుంటుంది!
  • మరి, నచ్చితే మీరూ ఇంట్లో కూరగాయలేమి లేనప్పుడు క్విక్ అండ్ ఈజీగా కిచెన్​లో ఉన్న ఉల్లిపాయలతో ఈ పచ్చడిని ట్రై చేయండి. సూపర్ టేస్టీగా ఉండే దీన్ని ఇంటిల్లిపాదీ ఎంతో ఇష్టంగా తింటారు. పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుంది!
Ullipaya Pachadi
నిమ్మరసం (Getty Images)

బెండకాయతో కరకరలాడే "పకోడీ" - నూనె పీల్చదు, టేస్ట్ అదుర్స్!

అమ్మమ్మల నాటి "వడ" రెసిపీ - తక్కువ పదార్థాలతో అప్పటికప్పుడు రెడీ!