ETV Bharat / offbeat

అద్దిరిపోయే "పొట్లం బిర్యానీ"! - ఇలా ఈజీగా తయారు చేయండి

- చికెన్, ఫిష్, ప్రాన్స్​తో కలిపి చేసే అరుదైన వంటకం - ఈ వెరైటీ బిర్యానీ తప్పకుండా ట్రై చేయాల్సిందే!

Potlam Biryani
Potlam Biryani (ETV Abhiruchi)
author img

By ETV Bharat Telangana Team

Published : April 12, 2026 at 9:24 AM IST

2 Min Read
Choose ETV Bharat

Potlam Biryani : బిర్యానీలో ఎన్నో రకాల ఫ్లేవర్స్ ఉన్నాయి. వాటిల్లో ఒక్కో రెసిపీది ఒక్కో టేస్ట్. అయితే, చాలా మంది చికెన్ దమ్ బిర్యానీ మాత్రమే ట్రై చేస్తుంటారు. ఇళ్లలో కూడా ఇదే ప్రిపేర్ చేస్తుంటారు. కామీ, మీరు ఎప్పుడైనా పొట్లం బిర్యానీ చేశారా? ఇందులో కూడా చాలా వేరియేషన్స్ ఉన్నాయి. అలాంటి వాటిల్లో ఒక స్పెషల్ వెర్షన్ ఇప్పుడు మనం ప్రిపేర్ చేయబోతున్నాం.

నాన్​ వెజ్​లో ఏదో ఒక ఐటమ్​తో బిర్యానీ చేయడం అందరికీ తెలుసు. కానీ, ఈ రెసిపీలో చికెన్, రొయ్యలు, చేపలు మూడింటినీ కలిపి ఒకే రెసిపీ తయారు చేయబోతున్నాం. కానీ, దేనికదే సెపరేట్​గా ఉంటుంది. ఇదే ఇందులో ప్రత్యేకత! మరి ఈ రెసిపీని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం.

కావాల్సిన పదార్థాలు :

  • చికెన్ - 300 గ్రాములు
  • రొయ్యలు - 200 గ్రాములు
  • చేప ముక్కలు - 200 గ్రాములు
  • బాస్మతి బియ్యం - 2 కప్పులు
  • అల్లం వెల్లుల్లి పేస్ట్ - 2 టేబుల్ స్పూన్
  • నిమ్మరసం - 1 టేబుల్ స్పూన్
  • కారం - 3 స్పూన్లు
  • ఉప్పు - తగినంత
  • ఉల్లిపాయలు - 2
  • టమాటాలు - 2
  • పుదీనా, కొత్తిమీర - తగినంత
  • అరటి ఆకులు - 3
  • బిర్యానీ ఆకులు - రెండు
  • లవంగాలు - ఐదారు
  • యాలకులు – ఐదారు
  • అనాస పువ్వు - ఒకటి
  • పసుపు - తగినంత
  • గరం మసాలా - తగినంత
  • షాజీరా - అర స్పూన్

సండే నాడు గరంగరంగా "గ్రీన్​ చికెన్​ పులావ్​" - పచ్చిమిర్చి పేస్ట్​తో అద్దిరిపోతుంది!

తయారీ విధానం :

  • ముందుగా మూడు బౌల్స్‌ తీసుకొని వాటిల్లో చికెన్, రొయ్యలు, చేప ముక్కలను వేయాలి.
  • తర్వాత మూడిట్లోనూ వరుసగా గరం మసాలా, పసుపు, కొత్తిమీర, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, నిమ్మరం, అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకొని చక్కగా మిక్స్ చేసుకోవాలి
  • వాటిని మూడు అరిటాకుల్లో వేసి పొట్లాలు కట్టుకోవాలి. ఇలా కట్టుకున్న తర్వాత వాటిని కనీసం అర గంటపాటు పక్కన పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల చక్కగా మేరినేట్ అవుతాయి.
  • ఆ తర్వాత స్టౌ ఆన్​ చేసి పైన బాండీ పెట్టుకొని కాస్త ఆయిల్ వేయాలి.
  • వేడెక్కిన తర్వాత అందులో బిర్యానీ ఆకులు, లవంగాలు, యాలకులు, అనాస పువ్వు, షాజీరా వేసి ఫ్రై చేసుకోవాలి
  • తర్వాత అందులో నిలువుగా కట్​ చేసుకున్న ఉల్లిపాయలు వేసి రంగు మారే వరకు ఫ్రై చేసుకోవాలి
  • అనంతరం రెండుగా చీల్చుకున్న పచ్చి మిర్చీ, అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకోవాలి
  • ఆ తర్వాత కొత్తిమీర, పుదీనా, టమాటా, కారం, ఉప్పు వేసుకోవాలి. కాసేపు ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగానే నానబెట్టుకున్న రైస్​ను అందులో వేసేయాలి
  • ఈ బాస్మతి బియ్యాన్ని 70% వరకు ఉడికించాలి
  • ఇప్పుడు మరో హండీ తీసుకొని, రెండో స్టౌ మీద పెట్టాలి. ఆ ఖాళీ హండీలో మూడు పొట్లాలను పెట్టుకోవాలి.
  • అందులో 70 శాతం ఉడికిన రైస్​ వేసుకొని మూత పెట్టాలి. ఇలా 15 నిమిషాల పాటు కుక్​ చేసుకుంటే సరి. అద్దిరిపోయే పొట్లం బిర్యానీ సిద్ధమైపోతుంది.

అద్దిరిపోయే భత్కలి బిర్యానీ - ఈ సండే ఘుమఘుమలాడించండి!