ETV Bharat / offbeat

పిండి రుబ్బకుండానే రుచికరమైన "వడలు" - బంగాళదుంప, రవ్వతో అప్పటికప్పుడు రెడీ!

తక్కువ నూనెతో కరకరలాడే వడలు - ఇలా చేస్తే ఎంతో టేస్టీగా వస్తాయి!

Potato Vada
Potato Vada (Getty Images)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : January 9, 2026 at 4:24 PM IST

2 Min Read
Choose ETV Bharat

Aloo Vadalu Making : ఉదయం టిఫిన్స్​లోకి మెజారిటీ ఫుడ్ లవర్స్ తినే వాటిల్లో వడలు ఒకటి. ఇవి బయటకి క్రంచీగా, లోపల సాఫ్ట్​గా ఉంటాయి. వీటిని తయారు చేయాలంటే పప్పు ముందు రోజే నానబెట్టాలి. ఆ తర్వాత మిక్సీ పట్టి పులియబెట్టాలి. కానీ ఇదంతా చాలా టైమ్ టెకింగ్ ప్రాసెస్. అలా కాకుండా అప్పటికప్పుడు వడలు చేసుకోవచ్చని మీకు తెలుసా? లేదంటే ఇప్పుడు చెప్పబోయే పద్ధతిలో బంగాళదుంప, బొంబాయి రవ్వ ఉపయోగించి సింపుల్​గా చేసేయొచ్చు. ఇలా చేసి పెట్టారంటే పిల్లలు, పెద్దలందరికీ ఎంతో నచ్చుతాయి. అంతేకాక ఆయిల్ కూడా తక్కువగా పీల్చుకుంటాయి! మరి నోరూరించే ఈ రెసిపీ చేయడానికి కావాల్సిన పదార్థాలేంటి? ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం.

మదురై మీనాక్షి టెంపుల్ స్పెషల్ "లడ్డూలు' - తక్కువ పదార్థాలతో అప్పటికప్పుడు రెడీ!

Potato Vada
బంగాళదుంపలు (Getty Images)

కావాల్సిన పదార్థాలు :

  • బంగాళదుంపలు - 2
  • పచ్చిమిర్చి - 3
  • అల్లం తరుగు - 1 టేబుల్ స్పూన్
  • కారం - 1 టేబుల్ స్పూన్
  • బొంబాయి రవ్వ - ఒక కప్పు
  • కొత్తిమీర - ఒక కట్ట
  • ఆయిల్ - సరిపడా
Potato Vada
బొంబాయి రవ్వ (Getty Images)

తయారీ విధానం :

  • ముందుగా రెండు బంగాళాదుంపలను కడిగి పొట్టు తీసి గ్రేటర్​తో తురిమి పక్కనుంచాలి.
  • అదేవిధంగా స్టవ్ ఆన్ చేసి పాన్​లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ పోయాలి. నూనె వేడైన తర్వాత ఒక టేబుల్ స్పూన్ కారం, ఒక టేబుల్ స్పూన్ అల్లం తరుగు, పచ్చిమిర్చి ముక్కలు,వేసి ఫ్రై చేయాలి.
  • ఇవి వేగిన తర్వాత రెండు కప్పుల నీళ్లు, రుచికి సరిపడా ఉప్పు వేయాలి. ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్​లో ఉంచి మరిగించాలి.
Potato Vada
కారం (Getty Images)
  • వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు బంగాళదుంప తురుము వేసి ఒక నిమిషం పాటు ఉడికించాలి. అనంతరం కప్పు బొంబాయి రవ్వను కొద్దికొద్దిగా వేస్తూ ఉండలు లేకుండా మిక్స్ చేయాలి. ఈ మిశ్రమం దగ్గరపడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
  • ఇప్పుడు మిక్సింగ్ బౌల్లో బంగాళదుంప రవ్వ మిశ్రమం, కొత్తిమీర తురము వేసి పిండి మాదిరిగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత చిన్న చిన్న బాల్స్ మాదిరిగా చేసి పక్కనుంచాలి.
Potato Vada
పచ్చిమిర్చి (Getty Images)
  • అలాగే స్టవ్ ఆన్ చేసి కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోయాలి. నూనె వేడైన తర్వాత ఒక్కొ పిండి ముద్దను తీసుకొని వడల ఆకారంలో వత్తుకొని కడాయికి సరిపడా వేసి ఒక నిమిషం పాటు అలాగే వదిలేయాలి.
  • అనంతరం వడలను రెండు వైపులా టర్న్ చేస్తూ దోరగా ఫ్రై చేసి ప్లేట్​లో సర్వ్ చేసుకోవాలి.
Potato Vada
కొత్తిమీర (Getty Images)
  • ఇక అంతే వేడివేడి బంగాళదుంప వడలు తయారైనట్లే! ఆ తర్వాత వీటిని ఏ చట్నీతో తిన్నా ఎంతో టేస్టీగా ఉంటాయి.
  • ఈ పద్ధతిని పాటిస్తూ ఇంట్లో చేసి పెట్టారంటే పిల్లలు ఒకటికి రెండు ఇష్టంగా తింటారు.
  • మీరు ఎక్కువ మోతాదులో వడలను చేసుకోవాలనుకుంటే బంగాళదుంపలతో పాటు ఇతర పదార్థాలను అందుకనుగుణంగా పెంచి తీసుకోవాలి.

మంగుళూర్ స్పెషల్ "బెల్లం మెంతి దోసెలు" - తియ్యతియ్యగా స్వీట్ లవర్స్​ ఫుల్ ఖుష్!

పక్కా కొలతల్లో "చిక్కటి షోర్వా" - చపాతీ, బగారా రైస్​లోకి అద్దిరిపోతుంది!