ETV Bharat / offbeat

కమ్మని ఆలూ "కట్​లెట్స్​" - పిల్లలకు ఇలా చేసి సర్​ప్రైజ్ ఇవ్వండి!

ఈవెనింగ్ టైమ్​కి అద్దిరిపోయే స్నాక్ రెసిపీ - ఇలా చేశారంటే అద్భుతంగా వస్తుంది!

Potato Cutlet
Potato Cutlet (Getty Images)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : April 25, 2026 at 5:11 PM IST

3 Min Read
Choose ETV Bharat

Potato Cutlets Making : సమ్మర్ హాలిడేస్ కావడంతో పిల్లలు ఇంట్లోనే ఉంటారు. ఈవెనింగ్ టైమ్​లో వారికి ఎప్పుడూ చేసి పెట్టే పునుగులు, గారెలు, బజ్జీలు, పకోడీ వంటివి కాకుండా ఏదైనా కొత్తగా చేసి పెట్టాలనుకుంటున్నారా? అది కూడా సింపుల్​గా రెడీ అవ్వాలా? అలాంటి వారికోసమే ఇన్​స్టంట్ స్నాక్ రెసిపీని ఇవాళ పరిచయం చేస్తున్నాం. అదే ఆలూ కట్​లెట్స్​. ఇలా ఇంట్లో చేసి పెట్టారంటే పిల్లల నుంచి పెద్దల వరకు ఒకటికి రెండు ఇష్టంగా తింటారు. డీప్ ఫ్రై అవసరం లేకుండానే అప్పటికప్పుడు సింపుల్​గా తయారు చేసుకోవచ్చు. మరి ఈ రెసిపీ ఎలా చేయాలో ఇప్పుడు ఓ లుక్కేయండి.

వీకెండ్ స్పెషల్ "చింతచిగురు మటన్ కర్రీ" - ఇలా చేస్తే ఇంటిల్లిపాదీ రుచికి ఫిదా!

Potato Cutlet
బంగాళదుంపలు (Getty Images)

కావాల్సిన పదార్థాలు :

  • బంగాళదుంపలు - 8
  • అల్లంవెల్లుల్లి పేస్ట్ - 2 టీ స్పూన్లు
  • పచ్చిమిర్చి - 8
  • కొత్తిమీర తరుగు - 2 టీ స్పూన్లు
  • పసుపు - అర టీ స్పూన్
  • కారం - అర టీ స్పూన్
  • గరంమసాలా - అర టీ స్పూన్
  • జీలకర్ర పొడి - అర టీ స్పూన్
  • ఆమ్​చూర్ పొడి - అర టీ స్పూన్
  • బ్రెడ్ పొడి - అర కప్పు
  • ఉప్పు - రుచికి సరిపడా
  • చాట్​మసాలా - అర టీ స్పూన్
  • బఠాణీలు - ఒక కప్పు
  • మైదాపిండి - 2 టీ స్పూన్లు
  • మిరియాల పొడి - 1 టీ స్పూన్
  • కార్న్​ఫ్లోర్ - 2 టీ స్పూన్లు
  • ఆయిల్ - తగినంత
Potato Cutlet
అల్లంవెల్లుల్లి పేస్ట్ (Getty Images)

తయారీ విధానం :

  • ఈ రెసిపీ కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నెలో ఎనిమిది బంగాళదుంపలు, సరిపడా నీళ్లు పోసి ఉడికించాలి. అదేవిధంగా మరో గిన్నెలో కప్పు బఠాణీలు, తగినన్ని వాటర్ యాడ్ చేసి ఉడకనివ్వాలి. బంగాళదుంపలు ఉడికిన తర్వాత పొట్టు తీసి మెత్తగా మాష్ చేసుకోవాలి.
  • ఇప్పుడు మిక్సింగ్ బౌల్లో బంగాళదుంప మిశ్రమం, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు, కొద్దిగా కొత్తిమీర తరుగు వేయాలి. అదేవిధంగా రెండు టీ స్పూన్ల అల్లంవెల్లుల్లి పేస్ట్, ఉడికించిన బఠాణీలు, అర టీ స్పూన్ పసుపు, అర టీ స్పూన్ జీలకర్ర పొడి, అర టీ స్పూన్ గరంమసాలా, అర టీ స్పూన్ ఆమ్​చూర్​ పొడి యాడ్ చేయాలి. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు, అర టీ స్పూన్ కారం వేసి బాగా కలపాలి.
Potato Cutlet
పచ్చిమిర్చి (Getty Images)
  • ఆ తర్వాత మరొక చిన్న గిన్నెలో రెండు టీ స్పూన్ల మైదాపిండి, ఒక టీ స్పూన్ మిరియాల పొడి, రెండు టీ స్పూన్ల కార్న్​ఫ్లోర్​, కొద్దిగా ఉప్పు, కప్పు నీళ్లు పోసి ఉండలు లేకుండా బాగా కలిపి పక్కనుంచాలి. అదేవిధంగా ఓ ప్లేట్​లో అర కప్పు బ్రెడ్ పొడిని వేసి పక్కనుంచాలి.
  • అనంతరం రెడీ చేసుకున్న బంగాళాదుంప మిశ్రమాన్ని నుంచి కొద్దికొద్దిగా తీసుకుంటూ కట్​లెట్స్​లా చేసుకోవాలి. ఆ తర్వాత దీన్ని మైదాపేస్ట్​లో ముంచి, బ్రెడ్​ పొడిలో దొర్లించి ఒక ప్లేట్​లోకి తీసుకోవాలి.
Potato Cutlet
కొత్తిమీర (Getty Images)
  • అనంతరం స్టవ్ మీద పాన్​ పెట్టి హీట్ చేయాలి. పాన్ వేడయ్యాక ముందుగా రెడీ చేసుకున్న కట్​లెట్స్​ను ఉంచాలి. ఆపైన కొద్దిగా నూనె వేస్తూ రెండు వైపులా టర్న్ చేస్తూ చక్కగా కాల్చుకోవాలి.
  • ఇవి రెండు వైపులా చక్కగా కాలాక ప్లేట్​లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి.
Potato Cutlet
కారం (Getty Images)
  • ఇక అంతే వేడివేడిగా నోరూరించే ఆలూ కట్​లెట్స్​ మీ ముందుంటాయి!
  • ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఇంట్లో ఈ విధంగా ట్రై చేయండి.

చిటికెలో "మ్యాంగో జ్యూస్" - మండుటెండల్లో కూల్​ కూల్​గా తాగేయండి!

నోట్లో వేసుకోగానే కరిగిపోయే "రైస్​ ఖీర్​ పుడ్డింగ్" - సింపుల్​గా ఇంట్లోనే రెడీ!