టేస్టీ "పొటాటో కర్రీ"! - కొత్త వాళ్లు కూడా అద్భుతంగా చేసుకునే సింపుల్ రెసిపీ!
అన్నం, పూరీల్లోకి బంగాళాదుంప కర్రీ - ఇలా చేశారంటే సూపర్ టేస్ట్

By ETV Bharat Andhra Pradesh Team
Published : February 23, 2026 at 5:06 PM IST
Aloo Curry recipe in telugu : బంగాళాదుంప కర్రీ ఇలా చేశారంటే అన్నం, చపాతీలతో పాటు పూరీల్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఎపుడూ టమోటా కలిపి కర్రీ చేయడం రొటీన్. కానీ, ఓ సారి ఇలా ట్రై చేశారంటే ఎంతో టేస్టీగా ఉంటుంది. తయారు చేయడం ఇప్పుడిప్పుడే వంట నేర్చుకుంటున్న వారికి కూడా చాలా తేలిక. ఇక్కడ ఇచ్చిన పద్ధతిలో ఓ సారి చేశారంటే వంటిల్లు ఘుమఘుమలాడాల్సిందే.
ఉల్లి ఆకుతో పసందైన "ఎగ్ కర్రీ" - అన్నం, చపాతీల్లోకి అద్భుతమైన కాంబో!

కావల్సిన పదార్థాలు :
- బంగాళాదుంపలు - 500 గ్రాములు
- నూనె - 3 టేబుల్ స్పూన్లు
- టమోటాలు - 2
- వెల్లుల్లి రెబ్బలు - 6
- కొత్తిమీర - చిన్న కట్ట
- దాల్చిన చెక్క - 2 ఇంచులు
- లవంగాలు - 3
- మిరియాలు - అర స్పూన్
- జీలకర్ర - అర స్పూన్
- ఉల్లిపాయలు - 2
- కరివేపాకు - 1 రెమ్మ
- పచ్చి బఠానీ - అర కప్పు
- అల్లం వెల్లుల్లి పేస్ట్
- పసుపు - పావు స్పూన్
- కారం - 2 స్పూన్లు
- ధనియాల పొడి - 1 స్పూన్
- గరం మసాలా - అర స్పూన్

తయారీ విధానం :
- ముందుగా బంగాళాదుంపల పై పొట్టు తీసుకుని మీడియం సైజు ముక్కలు కట్ చేసుకుని ఉప్పు నీళ్లలో వేసుకోవాలి. ఇపుడు స్టవ్ పై కడాయి పెట్టి నూనె వేసుకుని బంగాళాదుంప ముక్కలు వేసుకోవాలి.
- ఇపుడు టమోటా ముక్కలు మిక్సీలోకి తీసుకుని వెల్లుల్లి రెబ్బలు, కొత్తిమీర కూడా వేసుకుని మెత్తని పేస్ట్ చేసుకోవాలి. ఇపుడు బంగాళాదుంపలు సాఫ్ట్ గా మారిన తర్వాత పక్కకు తీసుకోవాలి. ఇపుడు అదే కడాయిలో నూనె చెక్క, లవంగాలు, మిరియాలు, జీలకర్ర వేసుకుని ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి.

- ఆ తర్వాత పచ్చి బఠానీ వేసుకోవాలి. బఠానీ వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసుకుని కలిపి పచ్చివాసన పోయిన తర్వాత టమోటా పేస్ట్ వేసుకోవాలి. ఇపుడు మరో పావు కప్పు బఠానీ గ్రైండ్ చేసుకోవాలి.
- కర్రీలోకి కారం, ధనియాల పొడి, గరం మసాలా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. గ్రేవీకి సరిపడా నీళ్లు పోసుకుని మూతపెట్టుకుని మరిగించుకోవాలి. ఇపుడు మరో ప్యాన్ లో నూనె వేసుకుని బఠానీ పేస్ట్ ఫ్రై చేసుకోవాలి.
- ఇపుడు మరుగుతున్న గ్రేవీలో ఫ్రై చేసుకున్న బంగాళాదుంప ముక్కలు వేసుకోవాలి. ఆ తర్వాత ఫ్రై చేసుకున్న బఠానీ పేస్ట్ వేసుకోవాలి. ఆ తర్వాత మూతపెట్టుకుని సన్నటి మంటపై నూనె తేలే వరకు ఉడికించుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న బఠానీ కర్రీ ఎంతో రుచిగా తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది.
రొటీన్‌కి భిన్నంగా "అలసందల చారు" - ఒక్కసారి తింటే ఫేవరెట్ డిష్‌గా మారడం పక్కా!
బ్రేక్‌ఫాస్ట్‌లోకి అద్దిరిపోయే "ఓట్స్ ఆమ్లెట్" - సుతిమెత్తగా, వేడివేడిగా అదుర్స్!

