నోరూరించే "వంకాయ, బంగాళాదుంప ఫ్రై" - చపాతీ, అన్నంలోకి ఎంతో టేస్టీగా ఉంటుంది!
ఎంతో మంది ఇష్టపడం వెజ్ కాంబో - తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది

By ETV Bharat Andhra Pradesh Team
Published : January 6, 2026 at 10:32 AM IST
Vankaya Bangaladumpa Curry : తెలుగు వారి ఇళ్లలో ఎక్కువగా చేసుకునే వెజ్ వంటకాల్లో వంకాయ, గోంగూర తప్పకుండా ఉంటాయి. వాటిల్లో కలపడానికి టమోటాలు వాడుతుంటారు. అయితే ఇవాళ మనకు ఎంతో ఇష్టమైన వంకాయను బంగాళాదుంపలతో కలిసి ముద్దకూర ట్రై చేద్దాం. వంకాయ, బంగాళాదుంప ముద్ద కూర ఎంతో కమ్మగా ఉంటుంది. చపాతీ, వేడి వేడి రైస్‌లోకి హ్యాపీగా తినేయొచ్చు.
ఘుమఘుమలాడే ఇన్స్టెంట్ "గుత్తి వంకాయ కర్రీ" - చూస్తేనే టేస్ట్ చేయాలనిపిస్తుంది!

కావల్సిన పదార్థాలు :
- వంకాయలు - పావు కేజీ
- బంగాళాదుంపలు - 2
- నూనె - 3 టేబ్లు స్పూన్లు
- ఆవాలు - అర స్పూన్
- జీలకర్ర - అర స్పూన్
- మినప్పప్పు - అర స్పూన్
- పచ్చిశనగపప్పు - స్పూన్
- ఎండు మిర్చి - 2
- ఉల్లిపాయలు - 1 పెద్దది
- పచ్చిమిర్చి - 3
- ఉప్పు - రుచికి సరిపడా
- పసుపు - పావు స్పూన్
- కరివేపాకు - 1 రెమ్మ
- అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 స్పూన్
- టమోటా - 1
- కారం - 2 స్పూన్లు
- ధనియాల పొడి - 1 స్పూన్
- కొత్తిమీర - తగినంత

తయారీ విధానం :
- ముందుగా ఓ గిన్నెలో నీళ్లు, ఉప్పు కలిపి పావు కేజీ వంకాయలు, బంగాళాదుంపలు ముక్కలుగా కట్ చేసుకోవాలి. వంకాయ ముక్కలను పొడవుగా కట్ చేసుకుని ఉప్పు నీళ్లలో వేసి పెట్టుకోవాలి. ఇపుడు బంగాళాదుంపల చెక్కు తీసుకుని ముక్కలుగా కట్ చేసుకుని తీసుకోవాలి. మరీ చిన్నగా కాకుండా మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకుని నీళ్లలో వేసుకోవాలి.

- ఇపుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని నూనె వేసుకుని పోపు గింజలు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, పచ్చి శనగపప్పు, మినప్పప్పు కలిపి వేసుకోవాలి. ఆ తర్వాత ఎండు మిర్చి వేసుకుని ఉల్లిపాయను సన్నగా తరిగి వేసుకోవాలి. ఆపై పచ్చిమిర్చి కూడా వేసుకుని బాగా వేయించాలి. ఉప్పు, పసుపు వేసుకుని మూతపెట్టి 3 నిమిషాలు లో ఫ్లేమ్‌లో మగ్గించాలి.

- ఉల్లిపాయలు మెత్తబడిన తర్వాత కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని కలపాలి. వాసన పోయిన తర్వాత నీళ్లలో వేసుకున్న బంగాళాదుంప ముక్కలు వేసుకోవాలి. ఓ సారి కలిపిన తర్వాత మూత పెట్టి 3 నిమిషాలు సన్నటి మంపైనే మగ్గించాలి. ముక్కలు అడుగంటకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇపుడు వంకాయ ముక్కలు వేసుకుని బాగా కలిపి వాటిని కూడా నూనెలో మగ్గించాలి. వంకాయ, ఆలూ ముక్కలు మగ్గించుకున్న తర్వాత టమోటా ముక్కలు వేసుకోవాలి.

- మరో సారి కలిపి టమోటా మెత్తబడే వరకు మగ్గించాలి. ఈ సమయంలో ఘాటుకు సరిపడా కారం, ధనియాల పొడి వేసుకుని బాగా కలపాలి. ముక్కలకు కారం పట్టేలా కొద్దిగా నీళ్లు పోసుకుని ఉప్పు వేసుకుని టేస్ట్ చూసి మూతపెట్టి మరో 5 నిమిషాలు సన్నటి మంటపై వేయించాలి.
- చివరగా కొత్తిమీర ఆకు కట్ చేసి వేసుకోవాలి. ఇలా చేసిన ఆలూ వంకాయ కర్రీ ఎంతో టేస్టీగా ఉంటుంది.
జొన్నపిండితో "ఇడ్లీలు" - సూపర్ సాఫ్ట్‌గా ఉంటాయి - ఇన్‌స్టంట్‌గా చేసుకోవచ్చు!
చిక్కటి గ్రేవితో "సోయా కీమా కర్రీ"- ఒక్కసారి తింటే మళ్లీమళ్లీ చేసుకోవడం పక్కా!

