ఇడ్లీ, దోసె ఏదైనా సరే - అద్దిరిపోయే "పల్లీ, టమోటా చట్నీ"!
టిఫిన్లలోకి సింపుల్ చట్నీ - ఎవరికైనా ఇట్టే నచ్చుతుంది!

By ETV Bharat Andhra Pradesh Team
Published : February 11, 2026 at 3:49 PM IST
Peanut Tomato Chutney for Dosa : ఇడ్లీ, దోసె ఇలా టిఫిన్ ఏదైనా సరే ఇలాంటి చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది. చాలా మంది పల్లీ చట్నీ లేదా టమోటా చట్నీ, సాంబార్ లాంటివి తయారు చేస్తుంటారు. కానీ, పల్లీటమోటా చట్నీ అద్దిరిపోతుంది. పల్లీలు, టమోటాలు దోరగా వేయించుకుని ఆ తర్వాత మెత్తగా గ్రైండ్ చేసి తాలింపు వేసుకుంటే అద్భుతమైన చట్నీ రెడీగా ఉంటుంది.
కరకరలాడే క్యాటరింగ్ స్టైల్ చిక్కుడు కాయ ఫ్రై - అన్నం, రోటీల్లోకి అద్భుతం!

కావాల్సిన పదార్థాలు :
- నూనె - 2 స్పూన్లు
- పల్లీలు - పావు కప్పు
- పచ్చి శనగపప్పు - 1 స్పూన్
- మినప్పప్పు - 1 స్పూన్
- వెల్లుల్లి - 6
- అల్లం - కొద్దిగా
- ఉల్లిపాయ - 1
- ఎండు మిర్చి - 8
- చింతపండు - కొద్దిగా
- టమోటా - 3
- బెల్లం - కొద్దిగా
- ఉప్పు - రుచికి సరిపడా

తాలింపులోకి :
- నూనె - 1 స్పూన్
- ఆవాలు - అర స్పూన్
- మినప్పప్పు - అర స్పూన్
- ఎండు మిర్చి - 2
- ఇంగువ - చిటికెడు
- కరివేపాకు - 1 రెమ్మ
- జీలకర్ర - 1స్పూన్

తయారీ విధానం :
- ముందుగా స్టవ్ పై కడాయి పెట్టుకుని 2 స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కగానే పల్లీలు వేసుకోవాలి. పల్లీలు సగం వేయించగానే పచ్చి శనగపప్పు, మినప్పప్పు వేసుకోవాలి. ఆ తర్వాత వెల్లుల్లి, అల్లం ముక్కలు వేయించాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుని వేయించాలి. ఇపుడు కారానికి సరిపడా ఎండు మిర్చి వేసుకోవాలి. రంగు కోసం కశ్మీరీ చిల్లీ కూడా వేసుకుంటే బాగుంటుంది. కొద్దిగా చింతపండు వేసి వేయించుకోవాలి.

- చివరగా టమోటా ముక్కలు కూడా వేసుకుని కలిపి మూత పెట్టుకుని సన్నటి మంటపై ఉడికించాలి. ఆ తర్వాత స్టవ్ కట్టేసి పక్కన పెట్టుకుని చల్లార్చుకోవాలి. ఇపుడు ఉడికించిన టమోటా, పల్లీలను మిక్సీలోకి తీసుకుని కొద్దిగా బెల్లం, రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా నీళ్లు పోసుకుని గ్రైండ్ చేసుకోవాలి. మరీ గట్టిగా, అలాగని లూజా కాకుండా కాస్త మధ్యస్థంగా గ్రైండ్ చేయాలి. లేదంటే ముందుగా గట్టి చట్నీ ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకుని ఆ తర్వాత మిక్సీలో కొద్దిగా నీళ్లు పోసి కలుపుకుంటే సరిపోతుంది. ఇలా రెడీ చేసుకున్న చట్నీలోకి పోపు వేసుకుంటే చాలు.

- తాలింపు కోసం స్టవ్ పై కడాయి పెట్టుకుని నూనె వేసుకోవాలి. వేడెక్కగానే ఆవాలు, మినప్పప్పు వేయించాలి. ఆ తర్వాత జీలకర్ర, ఎండుమిర్చి వేసుకోవాలి. చివరగా కరివేపాకు, ఇంగువ వేసుకుని చిటపటలాడించి దించేసుకంటే సరిపోతుంది. ఈ పోపును ముందుగా రెడీ చేసుకున్న చట్నీలో కలుపుకోవాలి.
పసందైన "అటుకుల కొబ్బరి పూర్ణాలు" - పర్ఫెక్ట్గా పొంగాలంటే ఇలా ట్రై చేయండి!
టేస్టీ "రంభా చికెన్" రెసిపీ మీకోసం - అద్దిరిపోయే ఈ కర్రీ దాబాల్లో మాత్రమే దొరుకుతుంది!

