ETV Bharat / offbeat

పల్లీలు, టమాటాలతో కిర్రాక్​ "చట్నీ" - 10 నిమిషాల్లో రెడీ - అన్ని టిఫెన్స్​లోకి అదుర్స్​!

-టిఫెన్స్​లోకి రెగ్యులర్​ చట్నీలు చేస్తున్నారా? - ఇలా ఓసారి ట్రై చేయండి - టేస్ట్​ అదుర్స్​!

Palli Tomato Chutney
Palli Tomato Chutney (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : February 25, 2026 at 1:54 PM IST

2 Min Read
Choose ETV Bharat

Tasty and Spicy Palli Tomato Chutney: ఇడ్లీ, దోశ, వడ, బోండా ఇలా టిఫెన్​ ఏదైనా అందులోకి చట్నీ కంపల్సరీ. టిఫెన్​ ఎంత టేస్టీగా ఉన్నా చట్నీ లేదంటే పెద్దలే కాదు పిల్లలు కూడా తినడానికి ఇంట్రస్ట్​ చూపించరు. అందుకే అమ్మలు తప్పనిసరిగా చేస్తుంటారు. అయితే టిఫెన్స్​లోకి అందరి ఫేవరెట్​ చట్నీ అంటే పల్లీలతో చేసేది. కాగా పల్లీ చట్నీని ఎప్పుడూ చేసే పద్ధతిలో కాకుండా కాస్త టమాటాలు యాడ్​ చేసి చేయండి. చాలా అద్భుతంగా ఉంటుంది. తయారు చేసుకోవడం కూడా సులువే. ఈ చట్నీ అన్ని టిఫెన్స్​లోకి పర్ఫెక్ట్​. కేవలం టిఫెన్స్​ మాత్రమే కాదు అన్నంలోకి కూడా సరిపోతుంది. మరి లేట్​ చేయకుండా కమ్మని పల్లీ టమాటా చట్నీ ఎలా చేసుకోవాలో చూసేయండి.

కావాల్సిన పదార్థాలు:

  • పల్లీలు - అర కప్పు
  • శనగపప్పు - 2 టీస్పూన్లు
  • మినప్పప్పు - 2 టీస్పూన్లు
  • వెల్లుల్లి రెబ్బలు - 6
  • అల్లం ముక్క - చిన్నది
  • ఉల్లిపాయ - 1
  • ఎండుమిర్చి - 10
  • చింతపండు - కొద్దిగా
  • టమాటాలు - 5
  • ఉప్పు - రుచికి సరిపడా
Palli Tomato Chutney
Palli Tomato Chutney (Getty Images)

తాలింపు కోసం:

  • నూనె - 2 టీస్పూన్లు
  • ఆవాలు - 1 టీస్పూన్​
  • మినప్పప్పు - 1 టీస్పూన్​
  • ఎండుమిర్చి - 3
  • ఇంగువ - చిటికెడు
  • కరివేపాకు - 2 రెమ్మలు
Palli Tomato Chutney
Palli Tomato Chutney (Getty Images)

తయారీ విధానం:

  • ముందుగా టమాటాలు, ఉల్లిపాయను సన్నగా, పొడుగ్గా కట్​ చేసుకోవాలి.
  • స్టవ్​ ఆన్​ చేసి పాన్​ పెట్టి 3 టీస్పూన్ల నూనె పోసి వేడి చేసుకోవాలి. కాగిన నూనెలో పల్లీలు, శనగపప్పు, మినప్పప్పు వేసి లో ఫ్లేమ్​లో వేయించుకోవాలి.
  • పల్లీలు గోల్డెన్​ బ్రౌన్​ కలర్​లోకి మారినాక వెల్లుల్లి రెబ్బలు, అల్లం ముక్క, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి.
Palli Tomato Chutney
Palli Tomato Chutney (Getty Images)
  • ఉల్లిపాయ ముక్కలు లైట్​గా వేగినాక ఎండుమిర్చి, చింతపండు వేసి మరికాసేపు ఫ్రై చేయాలి.
  • ఎండుమిర్చి కూడా వేగిన తర్వాత టమాటా ముక్కలు వేసి మెత్తగా అయ్యే వరకు కుక్​ చేసుకోవాలి.
  • టమాటాలు కూడా మంచిగా ఉడికినాక స్టవ్​ ఆఫ్​ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి.
Palli Tomato Chutney
Palli Tomato Chutney (Getty Images)
  • మిక్సీజార్​లోకి ఉడికించిన టమాటా, పల్లీల మిశ్రమం, రుచికి సరిపడా ఉప్పు వేసి కొన్ని నీళ్లు పోసి వీలైనంత మెత్తగా గ్రైండ్​ చేసుకోవాలి.
  • ఇలా గ్రైండ్​ చేసిన పచ్చడిని గిన్నెలోకి తీసుకోవాలి. తాలింపు కోసం స్టవ్​ ఆన్​ చేసి పాన్​ పెట్టి నూనె పోసి వేడి చేసుకోవాలి.
  • కాగిన నూనెలో ఆవాలు, మినప్పప్పు వేసి వేయించాలి. ఇవి దోరగా వేగినాక ఎండుమిర్చి, ఇంగువ, కరివేపాకు వేసి ఫ్రై చేయాలి.
  • తాలింపు మంచిగా వేగినాక స్టవ్​ ఆఫ్​ చేసి దీనిని గ్రైండ్​ చేసిన చట్నీలో వేసి కలుపుకుంటే సరి. ఎంతో టేస్టీగా ఉండే టమాటా పల్లీ చట్నీ రెడీ.
Palli Tomato Chutney
Palli Tomato Chutney (ETV Bharat)

చిట్కాలు:

  • పల్లీలను దోరగా వేయించుకోవాలి. ఇవి మాడితే పచ్చడి టేస్ట్​ కూడా మారుతుంది.
  • ఎండుమిర్చిని మీరు తినే కారానికి సరిపడా యాడ్​ చేసుకోవాలి.
  • ఈ పచ్చడి కాస్త లూజుగా ఉంటేనే టేస్ట్​ బాగుంటుంది. అలా అని మరీ లూజుగా చేస్తే బాగోదు.

చికెన్​ స్టఫింగ్​తో "మిర్చి బజ్జీలు" - కిర్రాక్​ టేస్ట్​తో అద్దిరిపోతాయి!

బండి మీద అమ్మే రుచితో కరకరలాడే "పకోడీ" - పిండి కలపడంలోనే అసలు సీక్రెట్!