ETV Bharat / offbeat

ఎండుమిర్చి వేసి "పల్లీ చట్నీ" చేయండి - సూపర్​గా ఉంటుంది - 10 నిమిషాల్లో రెడీ!

-పల్లీ చట్నీని ఎప్పుడూ ఒకటే పద్ధతిలో చేస్తున్నారా? - ఇలా ట్రై చేయండి, కిర్రాక్​గా ఉంటుంది!

Palli Chutney with Red Chilli
Palli Chutney with Red Chilli (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : November 13, 2025 at 4:35 PM IST

2 Min Read
Choose ETV Bharat

Palli Chutney with Red Chilli: ఇడ్లీ, దోశ, వడ, బోండా ఇలా టిఫెన్​ ఏదైనా అందులోకి పల్లీ చట్నీ కంపల్సరీ. వేడివేడి టిఫెన్​ను ఈ చట్నీలో ముంచుకుని తింటుంటే ఆ టేస్ట్​ వేరే లెవల్​. అయితే పల్లీ చట్నీని చాలా మంది పచ్చిమిర్చి వేసి చేస్తుంటారు. కానీ ఎప్పుడూ అలానే కాకుండా ఎండుమిర్చి వేసి ఓసారి ట్రై చేయండి. సూపర్​గా ఉంటుంది. ఇక ఎక్స్ట్రాగా పుట్నాల పప్పు, పచ్చి కొబ్బరి వేసి చేస్తే ఆ రుచి మరింత బాగుటుంది. ఈ చట్నీని అప్పటికప్పుడు చేసుకోవచ్చు. మరి లేట్​ చేయకుండా ఎండుమిర్చి వేసి పల్లీ చట్నీ ఎలా చేసుకోవాలో చూసేయండి.

Palli Chutney with Red Chilli
పల్లీలు (Getty Images)

కావాల్సిన పదార్థాలు:

  • నూనె - 1
  • పల్లీలు - 1 కప్పు
  • ఎండుమిర్చి - 10
  • పుట్నాలపప్పు - పావు కప్పు
  • పచ్చి కొబ్బరి ముక్కలు - పావు కప్పు
  • ఉప్పు - రుచికి సరిపడా
Palli Chutney with Red Chilli
ఎండుమిర్చి (Getty Images)

తాలింపు కోసం:

  • నూనె - 2 టీస్పూన్లు
  • ఆవాలు - అర టీస్పూన్​
  • జీలకర్ర - అర టీస్పూన్​
  • మినప్పప్పు - అర టీస్పూన్​
  • శనగపప్పు - అర టీస్పూన్​
  • ఎండుమిర్చి - 2
  • కరివేపాకు - 2 రెమ్మలు
Palli Chutney with Red Chilli
పుట్నాలపప్పు (Getty Images)

తయారీ విధానం:

  • స్టవ్ ఆన్​ చేసి కడాయి పెట్టి నూనె పోసి వేడి చేసుకోవాలి. కాగిన నూనెలో పల్లీలు, ఎండుమిర్చి తుంపలు వేసి లో ఫ్లేమ్​లో కలుపుతూ వేయించుకోవాలి.
  • పల్లీలు, ఎండుమిర్చి పర్ఫెక్ట్​గా వేగిన తర్వాత పుట్నాలపప్పు వేసి మరో నిమిషం వేయించి స్టవ్​ ఆఫ్​ చేయాలి.
  • పల్లీల మిశ్రమం పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీజార్​లోకి వేసుకోవాలి. ఆపై అందులోకి పచ్చి కొబ్బరి ముక్కలు, రుచికి సరిపడా ఉప్పు వేసి ఓసారి గ్రైండ్​ చేసుకోవాలి.
  • అనంతరం కొద్దికొద్దిగా వాటర్​ పోసుకుంటూ వీలైనంత మెత్తగా గ్రైండ్​ చేసుకోవాలి.
Palli Chutney with Red Chilli
తాలింపు (Getty Images)
  • పల్లీ చట్నీని మెత్తగా గ్రైండ్​ చేసుకున్న తర్వాత గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు దీనికి తాలింపు పెట్టుకోవాలి.
  • అందుకోసం స్టవ్​ ఆన్​ చేసి కడాయి పెట్టి నూనె పోసి వేడి చేసుకోవాలి. ఆయిల్​ కాగిన తర్వాత ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు వేసి లో ఫ్లేమ్​లో వేయించుకోవాలి.
  • తాలింపు గింజలు వేగిన తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు వేసి క్రిస్పీగా వేయించుకున్న తర్వాత స్టవ్​ ఆఫ్​ చేసి ఈ తాలింపును పచ్చడిలో వేసి కలుపుకుంటే సరి. ఎంతో టేస్టీగా ఉండే పల్లీ చట్నీ రెడీ. నచ్చితే మీరూ ట్రై చేయండి.
Palli Chutney with Red Chilli
పల్లీ చట్నీ (ETV Bharat)

చిట్కాలు:

  • పల్లీలు నూనెలో వేయించుకుంటాం కాబట్టి పొట్టు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీకు నూనెలో వేయించుకోవద్దు అనుకుంటే నార్మల్​గా వేయించి పొట్టు తీసేస్తే సరి. అప్పుడు కేవలం ఎండుమిర్చి ఒక్కటే నూనెలో వేయించుకుంటే సరిపోతుంది.
  • ఎండుమిర్చిని మీరు తినే రుచికి సరిపడేలా యాడ్​ చేసుకోవాలి. ఎండుకారం కన్నా ఎండుమిర్చిని నూనెలో వేసి తీసుకుంటే పచ్చడి రుచి మరింత బాగుంటుంది.

బెల్లంతో జ్యూసీ జ్యూసీగా "ఉసిరికాయ మురబ్బా" - తయారీ చాలా సింపుల్, ఏడాది నిల్వ!

టేస్టీ అండ్​ హెల్దీ "ఎగ్​ సలాడ్​" - 10 నిమిషాల్లో రెడీ - బ్రేక్​ఫాస్ట్​, స్నాక్స్​, డిన్నర్​కు బెస్ట్​!